gulam nabi ajad
-
కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది. ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్‌లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు. హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది. హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
గాంధీభవన్‌లో రసాభాస.. నేతల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గాంధీ భవన్లో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, వీ హనుమంతరావులు పరస్పరం దూషణలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గులాంనబీ ఆజాద్ ముందే వీరిద్దరు వాగ్వాదానికి దిగారు. ఆజాద్ పర్యటనపై తనకు సమాచారం లేదని వీహెచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి బదులుగా ఆయన (వీహెచ్) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటాల యుద్ధం చెలరేగింది. వారిద్దరికి సర్ధి చెప్పేందుకు ఆజాద్ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తూ.. సమావేశం మధ్యలోనే వీహెచ్ బయటకు వెళ్లిపోయారు. మరోవైపు టీపీసీపీ పదవి కోసం ఆజాద్ వద్ద పోటాపోటీ నినాదాలకు దిగారు. ముఖ్యంగా పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి అనుచరులు భారీఎత్తున నినాదాలు చేశారు. పదవి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే దక్కాలని వారు డిమాండ్ చేశారు. -
సభలో ఆసక్తికరఘట్టం.. సుజనా కోసం వెంటనే లేచిన ఆజాద్!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా? రెండు పార్టీలు ఒకరికొకరు సహాయాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయా? రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక హోదాపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆ రెండు పార్టీల వ్యవహార శైలిని గమనిస్తే ఇదే అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. స్వల్పకాలిక చర్చను మొదలుపెట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కొంతసేపు మాట్లాడాక.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కల్పించుకున్నారు. ‘చౌదరీ మీకు కేటాయించిన సమయం అయిపోయింది ఇక ముగించండి’ అని ఆయన సూచించారు. వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేచి నిలబడి సుజనా చౌదరికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే నిబంధనల ప్రకారం టీడీపీకి ఇచ్చిన సమయం అయిపోయిందని, ఇతర పార్టీలు తమకు కేటాయించిన సమయాన్ని వదులుకోడానికి సిద్ధంగా ఉంటే ఆ సమయాన్ని సుజనాకి ఇవ్వడానికి తనకి అభ్యంతరం లేదని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ తర్వాత గులాం నబీ ఆజాద్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ... సుజనా చౌదరికి సమయం ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించిన వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారం చూసిన వాళ్లకి గులాం నబీ ఆజాద్, సుజనా చౌదరీ ఒకే పార్టీకి చెందిన వారేమో అనిపించేలా ఈ వ్యవహారం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీకి దూరం అయ్యాక.. కాంగ్రెస్‌తో టీడీపీ ప్రేమలో పడింది. టు కాంగ్రెస్ కూడా ఏపీలో టీడీపీకి అనుకూలంగా వ్యవహారాలు నడుపుతోంది. ప్రత్యేక హోదా నినాదంతో వైఎస్సార్ సీపీ ఏపీ బంద్ నిర్వహిస్తే.. దాన్ని టీడీపీ వ్యతిరేకించింది. టీడీపీకి అనుకూలంగా ఏపీ కాంగ్రెస్ కూడా హోదా బంద్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ముదురుతున్న అనుబంధం చర్చనీయాంశమవుతోంది. -
కాంగ్రెస్, ఉగ్రవాదుల ఆలోచన ఒక్కటే!
జమ్మూ: కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు ఒకే రకంగా ఆలోచిస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూ, కశ్మీర్లు విడిపోయేందుకు అంగీకరించదని స్పష్టం చేశారు. భద్రతా బలగాలను విమర్శిస్తూ.. ఇటీవల కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లు చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా మండిపడ్డారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని జమ్మూలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘సోజ్, మీరు వంద జన్మలెత్తినా.. కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడాన్ని బీజేపీ ఒప్పుకోదు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ రెండు ప్రాంతాలను కలిపారు. ఆయన ఆశయ సాధనే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. రాహుల్ వీరిని సమర్థిస్తారా? భద్రతా బలగాలు కశ్మీర్లో.. ఉగ్రవాదుల కంటే సామాన్యులను ఎక్కువగా చంపేస్తున్నాయని ఆజాద్ ఆజాద్ వ్యాఖ్యలను సమర్థిస్తూ లష్కరే తోయిబా ప్రకటన చేయడంతో.. షా మండిపడ్డారు. ‘లష్కరే ఉగ్రవాదులు, కాంగ్రెస్ నేతల ఫ్రీక్వెన్సీ (ఆలోచన ధోరణి) సరిగ్గా సరిపోతోంది. ఆజాద్‌తోపాటు లష్కరే.. వ్యాఖ్యలను రాహుల్ ఖండిస్తారా?’ అని షా ప్రశ్నించారు. ఆజాద్, సోజ్‌లు దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
వంద శాతం గెలుస్తాం
బెంగళూరు: బల పరీక్షలో వంద శాతం గెలుస్తానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అన్నారు. ‘ఈ రాజకీయ క్రీడలో మేం మా ఆధిక్యాన్ని నిరూపించుకుంటాం. బలపరీక్షలో నెగ్గుతాం’ అని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత సాధారణ ఆధిక్యం లేకుండానే సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప.. పీఠమెక్కిన దాదాపు 55 గంటల్లోనే విశ్వాసపరీక్షను ఎదుర్కోనున్నారు. మా ఎమ్మెల్యేను ఢిల్లీలో ఉంచారు: ఆజాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం బేరసారాల కోసం ఢిల్లీకి పిలిపించుకుందనీ, అక్కడ నుంచి ఆయన తిరిగిరాకుండా కట్టడి చేస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానం లో ఉన్న గవర్నర్.. ఆయన చేతులతోనే రాజ్యాంగం పీక నొక్కుతున్నారని ఆజాద్ మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారనడానికి సుప్రీం ఉత్తర్వులే నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప సర్కార్ శనివారం సాయంత్రం బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా ఉన్నాయని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఉన్నాయని ఆయన అభివర్ణించారు. కర్ణాటకలో బీజేపీ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. ప్రభుత్వాల ఏర్పాటులో మేఘాలయా, గోవా, మణిపూర్లలో ఒక నియమం, కర్ణాటకలో మరో నియమమా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బలనిరూపణ కోసం గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వడం విస్మయం కలిగిస్తోందన్నారు. కాగా, ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని సుప్రీం పేర్కొన్నందున అత్యంత సీనియర్ ఎమ్మెల్యేనే ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని సూచించారు. -
హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
-
హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి. రాజ్యాంగంపై విశ్వాసం లేని మంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు పోడియంను చుట్టుముట్టి నిరసన తెలపడంతో రాజ్యసభ చైర్మన్ సభను వాయిదా వేశారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లౌకిక అనే పదంపై తన వ్యతిరేకతను బాహాటంగా చాటుకున్నారు. లౌకికవాదులమని చెప్పుకొనే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని ఎన్నోమార్లు సవరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) పదాన్ని తొలగించాలని అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పట్టేదార్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
మళ్లీ ఆజాద్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆ పార్టీ ట్రబుల్ షూటర్లలో ఒకరైన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరులో లేదా నవంబర్ మొదటి వారంలో ఆజాద్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అత్యున్నత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను ఇటీవలే తప్పించి ఆర్సీ కుంతియాను నియమించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కొరవడటం, క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోవడం వంటి అంశాలను చక్కదిద్దేందుకు కుంతియా ఏమాత్రం ప్రయత్నించడంలేదని, ఆయనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి స్థాయి లేదని సీనియర్ నేతలు కొందరు అధిష్టానవర్గం దృష్టికి తీసుకెళ్లారు. కొందరైతే కుంతియాపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించే బాధ్యతను ఆజాద్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందుగా ఆజాద్‌ను రంగంలోకి దించాలని పార్టీ ముందుగా భావించింది. అయితే వచ్చే ఏడాది నవంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నియామక పక్రటనను కూడా ముందుకు జరిపినట్లు సమాచారం. కుంతియాను లెక్కచేయని నేతలు మామూలుగా అధిష్టానవర్గం ఎవరిని ఇన్చార్జిగా నియమించినా కాంగ్రెస్ నేతలు ఆయన చెప్పినట్లు నడుచుకోవడం కొంతవరకు ఆనవాయితీ. కానీ కుంతియాను ఇన్చార్జిగా నియమించిన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది. కుంతియాకు ఇన్చార్జి స్థాయి లేదంటూ నేతలు బహిరంగంగా విమర్శించడమే కాకుండా వెంటనే ఆయన్ను తొలగించాలని అనేక మంది ఢిల్లీకి వెళ్లారు. నేరుగా సోనియా, రాహుల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు అయితే ఏకంగా తాము పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ బహిరంగంగా అల్టిమేటమ్ జారీ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా ఏ మాత్రం పనికిరారని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నడుచుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడొకరు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. కుంతియాను కొనసాగిస్తే కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, ఓ స్థాయి కలిగిన నేతను నియమిస్తే బాగుంటుందని అనేక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా అధిష్టానవర్గానికి సూచించినట్లు సమాచారం. కోమటిరెడ్డి సోదరులను నిలువరించిన ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించే సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్‌కు పనికొచ్చే నాయకులుగా పేరున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడుతున్నారని తెలియడంతోనే ఆజాద్ రంగంలోకి దిగారు. అధిష్టానవర్గంతో మాట్లాడి కోమటిరెడ్డి సోదరులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దని సూచించారు. వారి భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో కూడా మాట్లాడిన ఆజాద్.. కోమటిరెడ్డి సోదరులు పార్టీ వీడకుండా చర్చలు జరపాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిని తన నివాసానికి పిలిపించుకుని జైపాల్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరపారు. మరుసటి రోజే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆజాద్, రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు తెలిసింది. ఆజాద్‌ను పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమిస్తే తాము పార్టీలోనే ఉంటామని కోమటిరెడ్డి సోదరులు తమ సన్నిహితులతో చెబుతున్నారు. పార్టీ వీడిన వారిని రప్పించేందుకు చర్యలు గడచిన మూడేళ్ల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఇటీవల ఆజాద్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా .. సీనియర్ నేతలకు ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, జీవన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులతో కమిటీ వేయాలని, పార్టీని వీడి వెళ్లినవారితో ఈ కమిటీ సంప్రదింపులు జరపాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై విధానపరమైన ప్రకటన వెలువడిన తర్వాతే పార్టీ వీడి వెళ్లిన వారితో చర్చలు ఉంటాయని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఆజాద్ తిరిగి రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నింపింది. -
'ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్'
విచారణ సంస్థలకు సారథులే లేరు మోదీకి రాహుల్ జపం ఎందుకు రాష్ట్రంలో దొంగల ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఏడాది నరేంద్రమోదీ పాలనలో ధరలు నియంత్రించామంటూ పచ్చి అబద్ధాలను ప్రచారాలు చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వయలార్ రవి, ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ రాసిన బహిరంగలేఖలోనూ అన్ని అబద్ధాలేనని ఆరోపించారు. ధరలు తగ్గాయనడం ఈ శతాబ్దంలోనే పెద్ద జోక్‌గా ఆజాద్ అభివర్ణించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా, ప్రజలపై భారాన్ని మోపుతూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఏడాది పాలన అవినీతిరహితమని చెప్పుకోవడం ఆత్మవంచనే అని విరుచుకుపడ్డారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచారహక్కు కమిషన్ వంటి కీలకమైన విచారణ సంస్థలకు సారథులే లేకుంటే అవినీతి ఎలా బయటపడుతుందని ప్రశ్నిం చారు. రాష్ట్రాలతో కలసి పనిచేస్తామంటూనే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాల్లేకుండా అణిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీని చూసి మోదీ భయపడుతున్నారని, అందుకే మోదీ ప్రతిరోజూ రాహుల్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయంపై నిర్లక్ష్యం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రైతులను కష్టనష్టాల పాల్జేసిన ఘనత మాత్రం మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. భూసేకరణ బిల్లు విషయం లో దేశం అంతా వ్యతిరేకించినా మోదీ మొం డిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలపాలన సాగుతున్నదని ఆజాద్ వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలి చిన ఎమ్మెల్యేలను దొంగల్లాగా ఎత్తుకొని పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఇక్కడి అధికారపార్టీ దొంగలా వ్యవహరిస్తున్నందునే తాము పరిశీలనకు రావాల్సి వచ్చిందని ఆజాద్ వెల్లడించారు. నేరేళ్ల శారద బాధ్యతల స్వీకరణ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితురాలైన నేరేళ్ల శారద శుక్రవారం గాంధీభవన్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, మహిళలపై వివక్షను చూపించే ప్రభుత్వంపై మహిళల హక్కుల కోసం పోరాడాల్సి ఉందన్నారు. సీఎం అతిపెద్ద మాంత్రికుడని దుయ్యబట్టారు.