సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా? రెండు పార్టీలు ఒకరికొకరు సహాయాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాయా? రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక హోదాపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆ రెండు పార్టీల వ్యవహార శైలిని గమనిస్తే ఇదే అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. స్వల్పకాలిక చర్చను మొదలుపెట్టిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కొంతసేపు మాట్లాడాక.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కల్పించుకున్నారు. ‘చౌదరీ మీకు కేటాయించిన సమయం అయిపోయింది ఇక ముగించండి’ అని ఆయన సూచించారు. వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేచి నిలబడి సుజనా చౌదరికి మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే నిబంధనల ప్రకారం టీడీపీకి ఇచ్చిన సమయం అయిపోయిందని, ఇతర పార్టీలు తమకు కేటాయించిన సమయాన్ని వదులుకోడానికి సిద్ధంగా ఉంటే ఆ సమయాన్ని సుజనాకి ఇవ్వడానికి తనకి అభ్యంతరం లేదని వెంకయ్య నాయుడు అన్నారు.
ఆ తర్వాత గులాం నబీ ఆజాద్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ... సుజనా చౌదరికి సమయం ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించిన వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారం చూసిన వాళ్లకి గులాం నబీ ఆజాద్, సుజనా చౌదరీ ఒకే పార్టీకి చెందిన వారేమో అనిపించేలా ఈ వ్యవహారం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీకి దూరం అయ్యాక.. కాంగ్రెస్‌తో టీడీపీ ప్రేమలో పడింది. టు కాంగ్రెస్ కూడా ఏపీలో టీడీపీకి అనుకూలంగా వ్యవహారాలు నడుపుతోంది. ప్రత్యేక హోదా నినాదంతో వైఎస్సార్ సీపీ ఏపీ బంద్ నిర్వహిస్తే.. దాన్ని టీడీపీ వ్యతిరేకించింది. టీడీపీకి అనుకూలంగా ఏపీ కాంగ్రెస్ కూడా హోదా బంద్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ముదురుతున్న అనుబంధం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment