సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గాంధీ భవన్‌లో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, వీ హనుమంతరావులు పరస్పరం దూషణలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గులాంనబీ ఆజాద్ ముందే వీరిద్దరు వాగ్వాదానికి దిగారు. ఆజాద్ పర్యటనపై తనకు సమాచారం లేదని వీహెచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి బదులుగా ఆయన (వీహెచ్) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటాల యుద్ధం చెలరేగింది. వారిద్దరికి సర్ధి చెప్పేందుకు ఆజాద్ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తూ.. సమావేశం మధ్యలోనే వీహెచ్ బయటకు వెళ్లిపోయారు. మరోవైపు టీపీసీపీ పదవి కోసం ఆజాద్ వద్ద పోటాపోటీ నినాదాలకు దిగారు. ముఖ్యంగా పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి అనుచరులు భారీఎత్తున నినాదాలు చేశారు. పదవి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే దక్కాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment