hanumatha rao
-
‘ఏం జరిగినా కాంగ్రెస్ పాపమే అంటున్నారు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ అకాల వర్షంతో నష్టపోయిన రైతులపై లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు వస్తుందన్నా రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదన్నారు. హైదరాబాద్లో ఇల్లు కూలిన వారికి కేవలం రూ. 10వేలు ఇస్తే సరిపోదని, పూర్తిగా కూలిన ఇళ్లకు 2 లక్షల రూపాయలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని ఆయన డిమండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు చెల్లించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పాపమే అంటున్నారని, 6 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ చూపిన శ్రద్ధ.. రైతులు, ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. వర్షాలతో నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికి అధికారులు వెంటనే వెళ్లి సర్వే చెయ్యాలని, వారికి న్యాయం చెయ్యాలన్నారు. పంట నష్టం కారణంగా రైతులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని, వెంటనే మేలుకొని ఎకరాకు 20వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేందుకు వారి తరపున ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్యరంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: బండి సంజయ్కు మంత్రి హరీష్ సవాల్) -
గాంధీభవన్లో రసాభాస.. నేతల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గాంధీ భవన్లో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, వీ హనుమంతరావులు పరస్పరం దూషణలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గులాంనబీ ఆజాద్ ముందే వీరిద్దరు వాగ్వాదానికి దిగారు. ఆజాద్ పర్యటనపై తనకు సమాచారం లేదని వీహెచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనికి బదులుగా ఆయన (వీహెచ్) గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. దీంతో ఇద్దరి నేతల మధ్య మాటాల యుద్ధం చెలరేగింది. వారిద్దరికి సర్ధి చెప్పేందుకు ఆజాద్ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్త చేస్తూ.. సమావేశం మధ్యలోనే వీహెచ్ బయటకు వెళ్లిపోయారు. మరోవైపు టీపీసీపీ పదవి కోసం ఆజాద్ వద్ద పోటాపోటీ నినాదాలకు దిగారు. ముఖ్యంగా పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి అనుచరులు భారీఎత్తున నినాదాలు చేశారు. పదవి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే దక్కాలని వారు డిమాండ్ చేశారు. -
'టీడీపీ పని అయిపోయింది'
హైదరాబాద్: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పని అయిపోయిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని సెటిలర్స్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీహెచ్ తెలిపారు.