జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్‌లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు.
ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది.
ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు.
హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది.
హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు.
ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది
Comments
Please login to add a commentAdd a comment