kashmir pandits
-
కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది. ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్‌లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు. హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది. హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది -
ఒకే ఇంట్లో ఆరుగురు మృతి.. ఏం జరిగింది?
ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉగ్రవాదులు సోఫియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్లపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ కశ్మీర్ పండిట్ చనిపోగా, అతని సోదరుడు గాయపడ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భట్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6 members of family found dead at home in Jammu https://t.co/QIgJKdeD3A — Hindustan Times (@HindustanTimes) August 17, 2022 ఇది కూడా చదవండి: రోడ్డు లేక డోలీలో ఆస్పత్రికి బాలింత.. కవలలు కన్నుమూత! -
మానవత్వానికి మృత్యులోయ
గత నెల ఓ కశ్మీరీ పండిట్, ఓ వైన్‌షాపు ఉద్యోగి, మొన్న ఓ టీవీ నటి, నిన్న ఓ స్కూల్ టీచర్, ఇవాళ గురువారం ఓ బ్యాంకు మేనేజర్. మరి, రేపు...? తలచుకొంటేనే నిద్ర పట్టని ఈ వరుస హత్యలతో దాదాపు 75 లక్షల మందికి ఆవాసమైన కశ్మీర్ లోయ వణికిపోతోంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని, మే 1 నుంచి ఇప్పటికి 8 మందిని ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. దేశంలోని వైవిధ్యానికీ, లౌకికవాదానికీ ప్రతీకగా నిలుస్తున్న హిందూ కశ్మీరీలు, ముస్లిమ్ కశ్మీరీలు, స్థానికేతరులు – ఇలా మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఇప్పుడు తీవ్రవాదుల లక్ష్యమే. ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద కశ్మీరీ లోయకు తిరిగొచ్చిన హిందూ ప్రభుత్వోద్యోగులు వందల మంది భయాందోళనలతో పెట్టేబేడా సర్దుకొని, వెళ్ళిపోతుండడం పెనువిషాదం. ఈ తాజా దృశ్యాలు మళ్ళీ 1990 నాటి పరిస్థితిని తలపించాయి. ప్రాణాలు పోతుంటే, పాలనా యంత్రాంగం ఏం చేస్తోందన్న జవాబు లేని ప్రశ్నను సంధించాయి. కశ్మీర్లో కేంద్రం కనుసన్నల్లోని లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉన్నా, ఈ పరిస్థితి తలెత్తడం పాలకుల ఘోర వైఫల్యమే. అమరనాథ్ యాత్ర కూడా సమీపిస్తుండడంతో తక్షణ దిద్దుబాటు కోసం హోమ్‌మంత్రి కశ్మీర్‌పై ఉన్నత స్థాయి భద్రతా సమావేశం పెట్టడం, భద్రతా సలహాదారుతో భేటీ కావడం అనివార్యమయ్యాయి. అయితే కశ్మీర్లో శాంతిభద్రతలు నెలకొనడం దాయాది పాకిస్తాన్‌కు సుతరామూ ఇష్టం ఉండదని తెలిసిందే. అక్కడ చిచ్చు రేపి చలిమంట కాసుకుందామనేది దీర్ఘకాలంగా దాని ప్రణాళిక. తాజా ఘటనలూ అందుకు తగ్గట్టే ఉన్నాయి. కశ్మీరీ ముస్లిమ్ పౌరులు ఎప్పటి నుంచో లక్ష్యం కాగా, ఇప్పుడు కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ, సిక్కు మతస్థులు, వలస కార్మికులపై హత్యాకాండ పెరిగింది. ఒకపక్క కశ్మీర్లో ఈ మైనారిటీలకు స్థానం లేదని చాటి, మరోపక్క దేశంలోని మిగతా ప్రాంతాల్లో మతపరమైన విభేదాలు రేపే పన్నాగం నడుస్తోంది. ముందుగా రెక్కీ చేసి మరీ అమాయకుల్ని చంపుతున్నారంటే, ఉగ్రమూకలు ఎలాంటి భయాందో ళనలు రేపాలనుకుంటున్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వోద్యోగులు తమను కశ్మీర్ నుంచి జమ్మూకు సామూహిక బదలీ చేయాల్సిందంటూ వీధికెక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కశ్మీర్ లోయలోని వలస క్యాంపుల్లో ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం ఉద్యోగులకు వినతి చేయాల్సి వస్తోంది. హిందూ ప్రభుత్వోద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామంటోంది. కానీ, రాజధాని శ్రీనగర్ సైతం సురక్షితం కానప్పుడు, ఉద్యోగులను జిల్లా కేంద్రాలకు పంపిస్తామన డంలో అర్థం లేదు. అలాగని ఉద్యోగులు కోరుతున్నట్టు అందరూ జమ్మూకు తరలిపోవడం సాధ్యమా? వందల సంఖ్యలో వలస వస్తున్న కశ్మీరీలను భరించే ప్రాథమిక వసతులు జమ్మూలోనూ లేవు. ఒకవేళ రేపు జమ్మూలోనూ ఇలాంటి భద్రతా సమస్యే తలెత్తితే, వీళ్ళంతా ఇంకెక్కడికి పోవాలి? కశ్మీర్లో హిందువులు 2 శాతం లోపే! అక్కడకు ఎస్సీ –ఓబీసీ కోటాలో ఉద్యోగాలకు వచ్చినవారు, దీర్ఘకాలంగా ఉంటున్న రాజస్థానీ రాజ్‌పుత్‌లు, పొట్టచేతబట్టుకొని వచ్చిన బిహారీలు, లౌకికవాద ముస్లిమ్‌లు– అందరూ బాధితులే. తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు కనీసం మరో రెండు మూడేళ్ళు పడుతుందని భద్రతా వర్గాలే చెబుతున్నాయి. అప్పటి దాకా వీళ్ళు బలిపశువులు కావాల్సిందేనా? ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితులు చక్కబడిపోయాయనీ, పోతాయనీ అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొన్నదన్న పాలకుల మాటలోని డొల్లతనమూ బయటపడింది. స్థానికంగా తీవ్రవాదుల భర్తీ తగ్గి, విదేశీ తీవ్రవాదుల సంఖ్య పెరగడం కొత్త ట్రెండ్. ఆకస్మిక తీవ్రవాద దాడి చేసి, మళ్ళీ అందరిలో ఒకరిగా గడిపేసే ‘హైబ్రిడ్ తీవ్రవాదులు’ అనే కొత్త పదం కశ్మీరీ రక్తచరిత్రలో వచ్చి చేరింది. వీటిని అడ్డుకోకపోతే, ఎంతకాలమైనా ఇదే పరిస్థితి. పాల కులు అది గుర్తించాలి. జమాతే శక్తులు వివిధ వర్గాల్లో జొరబడి, కీలక సమాచారాన్నీ, అమాయకుల ఆనుపానుల్నీ లీక్ చేస్తున్నాయని పోలీసుల మాట. దానిపై దృష్టి పెట్టి, ఇంటి దొంగలను ఏరి వేయాలి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత పూరించి, ప్రజాస్వామ్య సర్కారుకు సత్వరం దోవ చేయాలి. రాష్ట్రాల కన్నా మనుషుల మనసులు గెలవడం ముఖ్యం. భిన్న వర్గాల మధ్య సౌహార్దం మరీ ముఖ్యం. పరస్పరం అనుమానాలు ప్రబలే మాటల వల్ల ఏం ప్రయోజనం? టూరిస్టులు పెరిగినంత మాత్రాన సాధారణ స్థితి నెలకొన్నట్టు కాదు. కశ్మీర్‌ది పర్యాటకాభివృద్ధిని మించిన సమస్య. కశ్మీరీల భద్రతకు ముందుగా తీవ్రవాద నిర్మూలన కీలకం. ఉపాధి కోల్పోయిన స్థానికులు ఉగ్రమూకల వైపు ఆకర్షితులు కాకుండా చూడడం ముఖ్యం. ప్రాంతీయాభివృద్ధి మాటలే కాదు... ప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇంకా ముఖ్యం. స్థానిక సెంటిమెంట్లను పక్కనబెట్టి, కశ్మీర్ స్వయంప్రతిపత్తినీ, రాష్ట్ర ప్రతిపత్తినీ ఏకపక్షంగా రద్దు చేసిన పాలకులు... ప్రతిపక్షాలనూ నిర్వీర్యం చేయాలన్న నిరంకుశ ధోరణిలోనే వెళితే కష్టం. కశ్మీరీ ప్రధాన స్రవంతి నాయకత్వమైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమో క్రాటిక్ పార్టీలను ప్రజాక్షేత్రంలో కలుపుకొనిపోవాలి. స్థానికులలో ధైర్యం పాదుగొల్పాలి. ఆందోళన లకు చెవి ఒగ్గకుండా, ఆయుధబలంతో ఉక్కుపాదం మోపాలని చూస్తే ఉగ్రచర్యలు కొత్త పిలకలు వేస్తాయి. ఎంతసేపటికీ తప్పంతా పాత పాలకులదే అని చేతులు కడిగేసుకుందా మంటే కుదరదు. పాత సమస్యపై పాలకులు కొత్తగా ఆలోచించాలి. శాంతిస్థాపనకు కొత్త వ్యూహంతో రావాలి. పాలించే రాష్ట్రాల సంఖ్యలో మరో అంకె పెంచుకోవడం కన్నా, ప్రజలకూ, దేశానికీ అదే ముఖ్యం. -
ఉగ్రకాండ.. అమిత్ షా మీటింగ్ ముందర మరొకటి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం. మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్‌గఢ్. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్ భట్ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కూడా దారుణ హత్యకు గురైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు. కశ్మీర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం హైలెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం. ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా? -
చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?
శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్‌ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పోలీసులు టియర్‌గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బుద్గం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్(36).. టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. బుద్గాం జిల్లా చదూర గ్రామం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించే లోపు ఆయన ప్రాణం విడిచాడు. గత ఆరు నెలల్లో ఇది మూడో ఘటన. ఈ ఘటనకు నిరసనగా కశ్మీర్ పండిట్లు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. క్యాంపుల నుంచి బయటకు వస్తున్న కశ్మీరీ పండిట్లు.. రోడ్లను దిగ్భంధించి, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వైపు మార్చ్‌గా వెళ్తున్న నిరసనకారుల్ని టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేశాయి భద్రతా బలగాలు. అందుకే తీసుకొచ్చారా? కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు నినాదాలు చేస్తున్నారు. ‘‘సిగ్గుపడాల్సిన ఘటన ఇది. ప్రభుత్వాన్ని మేం నిలదీస్తున్నాం. ఇదేనా పునరావాసం అంటే? మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడసలు భద్రత ఏది? మా పని మేం చేసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని ఎందుకు చంపడం? మేం చేసిన నేరం ఏంటి? ఇదంతా నిర్వాహక వైఫల్యమే!. ఆందోళనలు వ్యక్తం చేస్తే టియర్ గ్యాసులు ప్రయోగిస్తారా? అంటూ మండిపడుతున్నారు కశ్మీరీ పండిట్లు. #WATCH Police fire tear gas shells at protestors to prevent them from moving towards the Airport Road in Budgam during their protest demonstration against the recent killings of Kashmiri Pandits in the Union Territory pic.twitter.com/EPHvomqH9j — ANI (@ANI) May 13, 2022 బుద్గం షెకాపోరాలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్థానిక ముస్లింలు.. కశ్మీరీ పండిట్లకు మంచి నీళ్లు, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్లకు న్యాయం జరగాలని, భద్రతా అందాలంటూ గళం కలిపారు. ‘‘ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా కశ్మీరీ పండిట్లకు భద్రత లేకపోతే ఎలా? ఇంక ఎక్కడికి వెళ్లాలి వాళ్లు?ఇది పూర్తిగా పరిపాలనపరమైన వైఫల్యమే. కశ్మీర్ ముస్లింలందరికీ విజ్ఞప్తి. కశ్మీరీ పండిట్లకు మద్దతుగా ముందుకు వచ్చి నిరసనలు చేపట్టండి అంటూ తమ కమ్యూనిటీ అక్కడి ప్రజలు పిలుపు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ అడిగారు! కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రాహుల్ భట్ ఆరు నెలల కిందటే ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆయన అభద్రతా భావంలోకి కూరుకపోయారని ఆయన భార్య చెప్తున్నారు.