కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి. రాజ్యాంగంపై విశ్వాసం లేని మంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు.