Anantha Kumar
-
‘షాక్‌కు గురయ్యా.. అయినా నచ్చచెప్పుకొన్నా’
సాక్షి, బెంగళూరు : బీజేపీ అధిష్టానం బెంగళూరు సౌత్ లోక్‌సభ సీటును యువ న్యాయవాదికి కేటాయించడం తనను షాక్‌కు గురిచేసిందని తేజస్వినీ అనంతకుమార్ అన్నారు. యడ్యూరప్ప క్యాంపుతో సత్సంబంధాలు కలిగి ఉన్న 28 ఏళ్ల తేజస్వీ సూర్యను తమకు కంచుకోటగా ఉన్న బెంగళూరు సౌత్ స్థానం నుంచి బీజేపీ బరిలో దింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ టికెట్‌ను ఆశించిన తేజస్వినీ అనంతకుమార్ మాట్లాడుతూ.. ‘ నాతో పాటు మా కార్యకర్తలను ఈ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సమయాల్లోనే పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఆలోచించాలని నా మనసుకు నచ్చచెప్పుకొన్నా. పార్టీ ఆదేశాల్ని శిరసావహిస్తా. నా భర్త చాలా ఏళ్లపాటు పార్టీ కోసం పనిచేశారు. మాకెప్పుడూ జాతి ప్రయోజనాలే ముఖ్యం. ఆ తర్వాతే పార్టీ, స్వప్రయోజనాలు. ఆ విషయాన్ని నిరూపించుకునే సమయం ఇప్పుడు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యక్ష ప్రశ్నలు వేసి సమయాన్ని వృథా చేయకండి. దేశానికి సేవ చేయాలని భావిస్తే నరేంద్ర మోదీజీ గెలుపు కోసం కృషి చేయండి’ అని ఆమె పిలుపునిచ్చారు. కాగా బెంగళూరు సౌత్ నుంచి 1996 నుంచి 2014 వరకూ బీజేపీ దివంగత నేత అనంతకుమార్ విజయబావుటా ఎగురువేశారు. ఆయన మరణంతో ఈ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పార్టీ భారీ కసరత్తు చేసింది. ఈ క్రమంలో అనంత కుమార్ భార్య తేజస్విని పేరును రాష్ట్ర బీజేపీ వర్గం.. అధిష్టానానికి సిఫారసు చేసింది. అంతేకాదు ఒకానొక సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అదే స్థానం నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా.. తేజస్వి సూర్య పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తేజస్వీ సూర్య కర్ణాటక రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన హిందువుల ప్రయోజనాల కోసం పోరాడతారనే ప్రచారం ఉంది. అంతేకాదు ప్రధాని మోదీ పట్ల అత్యంత విధేయత కనబరిచే వ్యక్తిగా పేరొందిన సూర్య... ఆయనపై విమర్శలు గుప్పించే వారికి గట్టిగానే సమాధానమిస్తారు. అదేవిధంగా బీజేపీ మీడియా మేనేజ్మెంట్ సెల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తారు. -
తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం
న్యూఢిల్లీ: ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ చరిత్రపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్దే కొత్త వాదనకు తెరతీశారు. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో పేర్కొన్నారని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్‌మహల్‌గా మారిందని వివరించారు. ఇకనైనా మేల్కోకుంటే మన ఇళ్లు కూడా మసీదులుగా మారుతాయని, రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను తాకే వ్యక్తి చేతుల్ని నరికేసేలా చరిత్రను రాయాలని సూచించారు. -
హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
-
కొత్త గొడవ మొదలైంది..
న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యకలాపాలను దాదాపు రెండు వారాల పాటు అడ్డుకున్న ప్రధాని మోదీ వ్యాఖ్యల వివాదం ముగిసింది. కానీ తాజాగా, లౌకికవాదులపై కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరో దుమారం పార్లమెంటును కుదిపేసింది. మాజీ ప్రధాని మన్మోహన్పై ప్రధాని మోదీకి అపార గౌరవం ఉందని, ఆయనను అవమానించేలా వ్యాఖ్యానించలేదని రాజ్యసభలో ఆర్థికమంత్రి జైట్లీ వివరణ ఇవ్వడంతో మోదీ వ్యాఖ్యల వివాదం ముగిసింది. గుజరాత్లో బీజేపీ ఓటమికి పాక్‌తో కలిసి మన్మోహన్ కుట్రపన్నారంటూ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన విషయం తెల్సిందే. పితృత్వ మూలాలు తెలియనివారే లౌకికవాదులమని చెప్పుకుంటారని, లౌకికతకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేస్తామని ఇటీవల అనంత్‌కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం పార్లమెంటు ఉభయసభలు దద్ధరిల్లాయి. విపక్షాల నిరసనలతో ఉభయసభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. హెగ్డే వ్యాఖ్యలను సమర్ధించబోమని ప్రభుత్వం వివరణ ఇచ్చినా విపక్షం శాంతించలేదు. లోక్‌సభలో.. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మంత్రి హెగ్డేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ 11గంటలకు, పరిస్థితిలో మా ర్పులేక పోవటంతో 12 గంటలకు, మళ్లీ 2.45 గంటలకు వాయిదా వేశారు. 4గంటలకు సమావేశం కాగా నినాదాలు హోరెత్తటంతో 15 నిమిషాలపాటు వాయిదావేశారు. తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో.. ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు హెగ్డే వ్యాఖ్యలను ప్రస్తావించాయి. సభలో చర్చించాలని పట్టుబట్టాయి. సరైన నోటీసు లేకుండా చర్చించటం కుదరదని చైర్మన్ వెంకయ్య స్పష్టం చేశారు. గందరగోళం కొనసాగటంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వా తా ఇదే పరిస్థితి కొనసాగటంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగోయెల్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం..హెగ్డే అభిప్రాయాన్ని ప్రభుత్వం అంగీకరించబోద’ని ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తికి మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని ఆజాద్ అన్నారు. సభ సద్దుమణగక పోవటంతో చైర్మన్ వెంకయ్య సభను మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా వేశారు. ఇతర ముఖ్యాంశాలు.. ► పాస్‌పోర్టు జారీ సమయంలో ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ విధానానికి మినహాయింపు ఇస్తూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో తెలిపారు. ► సైనిక దళాలకు సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారిందని లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. త్రివిధ దళాలకు కలిపి సుమారు 60వేల పోస్టులు ఖాళీగా ఉండగా సైన్యంలోనే అత్యధికంగా 27వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. మన్మోహన్ అంటే మాకు అపారగౌరవం మన్మోహన్పై మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో జైట్లీ వివరణ ఇచ్చారు..‘ మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీలకు దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రసంగాల్లో గానీ, ప్రకటనల ద్వారా గానీ మోదీ శంకించలేదు. ప్రధాని చేసిన ప్రకటనలన్నీ ఎన్నికల సభల్లోనివే. మిగతా పార్టీలూ ఆరోపణలు చేశాయి. మన్మోహన్‌ను ప్రధాని విమర్శించారని ఎవరైనా అనుకుంటే అది కేవలం అవగాహన లోçపమే ’అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆజాద్ స్పందించారు. జైట్లీ వివరణకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ నేతలూ ప్రధాని పదవి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడబోరన్నారు. ప్రధానమంత్రిని ‘నీచ్ ఆద్మీ’ అంటూ సంబోధించిన మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ వివాదానికి ముగింపు పలికిన అధికార, ప్రతిపక్ష నేతలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి. రాజ్యాంగంపై విశ్వాసం లేని మంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు పోడియంను చుట్టుముట్టి నిరసన తెలపడంతో రాజ్యసభ చైర్మన్ సభను వాయిదా వేశారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లౌకిక అనే పదంపై తన వ్యతిరేకతను బాహాటంగా చాటుకున్నారు. లౌకికవాదులమని చెప్పుకొనే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ ఆ రాజ్యాంగాన్ని ఎన్నోమార్లు సవరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) పదాన్ని తొలగించాలని అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పట్టేదార్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ భూస్థాపితం కావాలి
బొమ్మనహళ్లి : వచ్చే శాసన సభ ఎన్నికల్లో బెంగళూరు నగరంలో ఉన్న 28 నియోజక వర్గాల్లో 25 సీట్లు గెలవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 150 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేసి యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేంద్రమంత్రి అనంత్‌కుమార్ అన్నారు. బొమ్మనహళ్లి నియోజకవర్గం పుట్టెనహళ్లి వార్డులో ఉన్న ఆర్బీఐ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ పరివర్తనా ర్యాలీని ఆయన యడ్యూరప్పతో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ... సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సొమ్మును దోపిడీ చేస్తోందని, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 25 మంది పైన హిందూ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ... బీజేపీ అంటే జైలుకు వెళ్లే పార్టీ అంటున్న సిద్ధుపై బీఎస్‌వై మండిపడ్డారు. సీఎం ఏసీబీ, సీఓడీలను దుర్వినియోగం చేసుకుంటూ అవినీతి నాయకులకు క్లీన్చిట్ ఇప్పిస్తున్న సిద్ధు త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక్, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ మురళీధర్‌రావు, మాజీ మంత్రి అరవింద లింబావలి, సీటీ రవి, వీ.సోమణ్ణ, ఎమ్మెల్యేలు సతీష్‌రెడ్డి, ఎం.కృష్ణప్ప, రవిసుబ్రమణ్యం, ఎంపీలు పీసీ మోహన్, శోభాకరందాజ్లే, నటి శ్రుతి, ఎమ్మెల్సీ తార, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
నల్లధనం అడ్డుకట్టకే పెద్ద నోట్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నల్లధనాన్ని రూపుమాపడానికి, హింసాత్మక చర్యలను అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్ అన్నారు. బుధవారం నల్లధనం వ్యతిరేకదినంగా హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ నోట్ల రద్దు, జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారని, వీటిపై బహిరంగచర్చకు రావాలని అనంతకుమార్ సవాల్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో తీవ్రవాదులకు, నక్సలైట్లకు డబ్బులు అందడం ఆగిపోయిందన్నారు. కశ్మీర్లో గత ఏడాది 2,683 రాళ్ల దాడులు జరిగితే, ఈ ఏడాది 639 సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయన్నారు. బినామీ ఆస్తులు, దొంగ ఖాతాలపై గతంలో చర్యలెందుకు తీసుకోలేదో సోనియా, రాహుల్, మన్మోహన్సింగ్, చిదంబరం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
బెంగుళూరులో టూల్ రూమ్
మైసూరులో టెక్స్టైల్ క్లస్టర్ తయారీ రంగంలో వృద్ధి లక్ష్యం ఏడు శాతం కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పారిశ్రామిక రంగానికి ఉపయుక్తమయ్యే టూల్ రూమ్ (ఉత్పత్తి సాధనాలు)ను బెంగళూరులో నెలకొల్పనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. నగర శివారులోని తుమకూరు రోడ్డులో గల బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శనా కేంద్రంలో గురువారం ఆయన మూడు రోజుల ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, అచ్చులు, ఆటో పార్ట్స్ ప్రదర్శన ‘ఎమ్మా ఎక్స్పో-2014’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిన కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తలమునకలుగా ఉన్నందున, తనను వెళ్లాల్సిందిగా కోరారని తెలిపారు. బెంగళూరుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఏదైనా వరాన్ని ప్రకటించాలని కోరినప్పుడు టూల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాల్సిందిగా సూచించారని తెలిపారు. దీంతో పాటే మెసూరులో టెక్స్టైల్ క్లస్టర్‌ను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారని చెప్పారు. వంద రోజుల్లో విధానం దేశంలో ఎంఎస్ఎంఈ విధానాన్ని వంద రోజుల్లో ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏబీ. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో జాతీయ స్థూలోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏడు శాతం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో దారుణంగా పడిపోయిందని విమర్శించారు. తయారీ రంగంలో ఏడు శాతం వృద్ధిని సాధించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జీడీపీలో తయారీ రంగం వాటా 15 శాతం ఉండేట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి సాధించాలంటే రుణాలు, భూమి, ప్రాథమిక సదుపాయాలను సింగిల్ విండో ద్వారా అందించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్ల వెంచర్ కేపిటల్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో బెంగళూరు, కర్ణాటకకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఈ ప్రదర్శనలో 205 మంది ఎగ్జిబిటర్లతో పాల్గొంటున్న తైవాన్ను అభినందిస్తూ, చైనాతో పోటీని ఎదుర్కోవడానికి సహకరించాల్సిందిగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ప్రారంభోత్సవంలో తైపీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాల్టర్ యే, ఇండియాలోని తైపీ ఎకనమిక్స్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి, రాయబారి చుంగ్-క్వాంగ్ తీన్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత దేశ జనాభా 120 కోట్లని, వారంతా తైవాన్‌కు వస్తే కష్టం కనుక, తమ ఉత్పత్తులను ఇక్కడికే తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నామని చుంగ్-క్వాంగ్ చమత్కరించారు. కాగా ఈ మూడు రోజుల ప్రదర్శనలో ఇండియాకు చెందిన 210 మంది ఎగ్జిబిటర్లు కూడా పాల్గొంటున్నారు. -
వరద పీడిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన
బాధిత కుటుంబానికి రూ. లక్ష అందజేత సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుల్బర్గలోని వరద పీడిత ప్రాంతాల్లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ ఆదివారం పర్యటించారు. గత నెల 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ అపార నష్టం సంభవించింది. స్థానిక శరణ బసవేశ్వర చెరువులో నీటి పరిమాణాన్ని తగ్గించడానికి చేసిన ఏర్పాట్లను మంత్రి తిలకించారు. చెరువు కట్టలను పటిష్ట పరచడానికి రూ.6.74 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు మహా నగర పాలికె కమిషనర్ శ్రీకాంత్ కట్టిమని ఆయనకు తెలిపారు. అనంతరం కమలా నగరలో వరదల్లో మరణించిన ఆరేళ్ల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తన సొంత డబ్బు నుంచి రూ.లక్ష నష్ట పరిహారాన్ని అందించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దత్తాత్రేయ సీ. పాటిల్, ఎమ్మెల్సీ అమరనాథ పాటిల్, మాజీ మంత్రులు రేవూ నాయక్ బెళమగి, సునీల్ వల్కాపురె, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ సీఈఓ ప్రభృతులున్నారు. -
చెత్త సమస్యకు చెక్
దేశంలోని 500 నగరాల్లో ‘బయో మెథానేషన్’ వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు బెంగళూరు కేఆర్ మార్కెట్లో ఏర్పాటుకు శంకుస్థాపన కేంద్ర మంత్రి అనంత కుమార్ బెంగళూరు : దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి కేఆర్ మార్కెట్లో రూ. 102 కోట్లతో ఆ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేఆర్ మార్కెట్ నుంచి రోజూ ఐదు వేల కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయన్నారు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టే సత్యనారాయణ, బెంగళూరు నగరంలోని ఎంపీలు, శాసన సభ్యులు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సూచిం చామన్నారు. -
ప్రజా సమస్యలు తెలియని మీకు.. రాజకీయాలెందుకు?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజల సమస్యలు ఏ మాత్రం తెలియని ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ నందన్ నిలేకని కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి, బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్ విమర్శించారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ (న్యాయ, పరిశ్రమలు, ఆర్థిక విభాగాలు) సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గత పదేళ్ల యూపీఏ పాలనలో ధరల పెరుగుదల, అవినీతిపై నిలేకని ఒక్కమాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. అవినీతి, కుంభకోణాలకు పర్యాయ పదంగా మారిన కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం ఆయనకు తగదని హితవు పలికారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా వివిధ అంశాల ఆధారంగా జరుగుతాయని నిలేకని గుర్తుంచుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు, వంట గ్యాసు ధరలను నియంత్రించడంలో విఫలమైన కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంస్థల జాతీయ నాయకులు నీరజ్ తాయల్, మహేంద్ర పాండే, రజనీష్ గోయెంగా ప్రభృతులు పాల్గొన్నారు.