చెత్త సమస్యకు చెక్
- దేశంలోని 500 నగరాల్లో ‘బయో మెథానేషన్’
- వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
- బెంగళూరు కేఆర్ మార్కెట్‌లో ఏర్పాటుకు శంకుస్థాపన
- కేంద్ర మంత్రి అనంత కుమార్
బెంగళూరు : దేశంలోని 500 నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించడానికి బయో మెథానేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి కేఆర్ మార్కెట్‌లో రూ. 102 కోట్లతో ఆ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేఆర్ మార్కెట్ నుంచి రోజూ ఐదు వేల కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడుతున్నాయన్నారు. నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ కట్టే సత్యనారాయణ, బెంగళూరు నగరంలోని ఎంపీలు, శాసన సభ్యులు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఇప్పటికే సూచిం చామన్నారు.