
సాక్షి, హైదరాబాద్: దేశంలో నల్లధనాన్ని రూపుమాపడానికి, హింసాత్మక చర్యలను అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్ అన్నారు. బుధవారం నల్లధనం వ్యతిరేకదినంగా హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ నోట్ల రద్దు, జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారని, వీటిపై బహిరంగచర్చకు రావాలని అనంతకుమార్ సవాల్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో తీవ్రవాదులకు, నక్సలైట్లకు డబ్బులు అందడం ఆగిపోయిందన్నారు.
కశ్మీర్‌లో గత ఏడాది 2,683 రాళ్ల దాడులు జరిగితే, ఈ ఏడాది 639 సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయన్నారు. బినామీ ఆస్తులు, దొంగ ఖాతాలపై గతంలో చర్యలెందుకు తీసుకోలేదో సోనియా, రాహుల్, మన్మోహన్‌సింగ్, చిదంబరం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment