
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసి.. సరికొత్త మార్పులకు నాంది పలికిన డిమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు)కు నేటితో ఏడాది ముగుస్తోంది. రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు సరిగ్గా ఏడాది కిందటే ఇదే రోజున ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి.. పెను సంచలనానికి తెరతీశారు. ఈ సంచలన నిర్ణయంతో తమ వద్ద ఉన్న పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. నోట్ల రద్దుతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు డిమానిటైజేషన్‌ను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. పెద్దనోట్ల విజయవంతమైందని పేర్కొంటూ బీజేపీ, అధికార పక్షం ఓవైపు సంబరాలు నిర్వహిస్తుండగా.. ప్రతిపక్షాలు పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8వ తేదీని ’బ్లాక్ డే’ గా పాటిస్తూ నిరసన తెలుపుతున్నాయి.
సంబరాలు..!
బీజేపీ శ్రేణులు ఉత్తరప్రదేశ్‌లో పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించాయి. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ ఫొటోకు స్వీట్లు తినిపిస్తూ.. కొత్త నోట్లను ప్రదర్శిస్తూ.. బీజేపీ నేతలు ’డిమానిటైజేషన్’ సంబరాలు నిర్వహించారు.
కాంగ్రెస్ నిరసన
పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ’బ్లాక్ డే’గా పాటించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో భారీ మరథాన్ పరుగును నిర్వహించింది. నల్లదుస్తులు ధరించి కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఈ రన్‌లో పాల్గొని.. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment