న్యూఢిల్లీ: ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ చరిత్రపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్దే కొత్త వాదనకు తెరతీశారు. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో పేర్కొన్నారని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్‌మహల్‌గా మారిందని వివరించారు. ఇకనైనా మేల్కోకుంటే మన ఇళ్లు కూడా మసీదులుగా మారుతాయని, రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను తాకే వ్యక్తి చేతుల్ని నరికేసేలా చరిత్రను రాయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment