shivalayam
-
కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖపట్నం విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. -
శివాలయంలో నాగుపాము.. భారీగా తరలివచ్చిన భక్తులు
ఆదిలాబాద్: మండల కేంద్రానికి సమీపంలోని భవానిగిరి గుట్ట వద్ద ఉన్న శివాలయంలో గురువారం నాగుపాము దర్శనమిచ్చింది. గర్భగుడి వద్ద ఉన్న రేకుల షెడ్డుపై గంటపాటు పడవ విప్పి ఉండటంతో ఆలయ వ్యవస్థాపకుడు పోచ్చన్న మహరాజ్ ఫోన్లో వీడియో తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు భారీగా తరలివచ్చి నాగుపాము దర్శనం చేసుకున్నారు. -
Chilkur: చిలుకూరులో 1000 ఏళ్ల నాటి శివాలయం..
సాక్షి, హైదరాబాద్: చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికా వెళ్లాలనుకునే యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. వీసా బాలాజీ అంటూ వారు పిలుచుకుంటుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతన శివాలయం ఉందని, ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిదని తాజాగా చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానికులు దానికి సున్నం వేసి పూజాదికాలు నిర్వహిస్తున్నప్పటికీ, అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా శివనాగిరెడ్డి ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లపై పరిశోధించారు. ఈ సందర్భంగా ఈ శివాలయాన్ని పరిశీలించి, నిర్మాణ శైలి, అందులోని విగ్రహాల శైలి ఆధారంగా అది వెయ్యేళ్ల క్రితంనాటిదని తేల్చారు. ఆలయ అధిష్టానం ఇప్పటికే భూమిలోకి కూరుకుపోయిందని, ఆలయ రాళ్ల మధ్య పగుళ్లేర్పడి విచ్చుకుపోతున్నాయని, శిఖరభాగంలోని రాళ్లు దొర్లిపోతున్నాయని పేర్కొన్నారు. 9–10 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. జైన బసదిగా విలసిల్లిన గ్రామం వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం జైన బసదిగా విలసిల్లిందని, ఇక్కడ అద్భుత జైన నిర్మాణాలుండేవని, ఇక్కడి కొన్ని శిల్పాలు ప్రస్తుతం గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని, ఇప్పటికీ గ్రామంలోని చాలా ప్రాంతాల్లో జైన శిల్పాలు కనిపిస్తున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటుల శైలి శివాలయం పక్కన కూడా జైన శిల్పముందన్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న భైరవ, వీరుల, నాగదేవత, భక్తురాలి శిల్పాలను సరిగ్గా ప్రతిష్టించాలని, చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన మండపాన్ని కూడా పునరుద్ధరించాలని సూచించారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
Maha Shivratri 2023 : శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు (ఫొటోలు)
-
రాజన్న దర్శనం కోసం వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు. అన్నదానం ప్రారంభం జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు సేవలు దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు -
Maha Shivaratri 2023: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులంతా పాతాళ గంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటున్నారు. అధికారులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే ఆలయ అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహాశివుడ్ని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. విశాఖ తీరంలో శివరాత్రి శోభ అలముకుంది. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆర్కే బీచ్‌లో టీఎస్ఆర్ సేవా పీఠం ఆధ్వర్యంలో కోటి శివలింగార్చన నిర్వహించారు. అప్పికొండలోని సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు. తిరుపతి: జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి సందర్బంగా భక్తులతో శివాలయాలు కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహాస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్త జనం పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం ఇంద్ర విమానం వాహనం, రాత్రి కి నంది - సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు. కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తున్నారు. కపిలేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం రధోత్సవం, రాత్రి నంది వాహన సేవ ఉంది. ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం లింగాల తిరుగుడులో సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చోడవరంలోని గంగా సమేత పార్వతి పరమేశ్వర స్వయంభు ఆలయంలో శివరాత్రి సందర్బంగా పూజలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం పంచదార్లలలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం మఠం పంచాయతీలో మత్స్య లింగేశ్వర స్వామి శివరాత్రి జాతర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో శివరాత్రి జాతర జరుగుతోంది. గుహల్లో వెలిసిన మహాశివుడికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. కాశీపట్టణంలో ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. శివలింగపురంలో స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు లోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి వేడకుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి ఏటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా: కృత్తివెన్ను శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జోగి రమేష్ మంత్రి జోగి రమేష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవదాయ ధర్మదాయ శాఖ ఏసీ గోపీనాథ్ బాబు. శ్రీ నాగేశ్వర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జోగి రమేష్. కృష్ణాజిల్లా: మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకళ్లపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు. ఏలూరు జిల్లా: ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురుస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట భక్త జనసంద్రంతో నిండిపోయింది. శ్రీ భవాని శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరించేందుకు భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చారు. -
హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం
హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం (అక్టోబర్ 26) నుంచి ప్రారంభమైంది. నవంబర్ 23 వరకు కొనసాగే ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. అన్ని ఆలయాలు, నదీతీరాలు, ఇళ్లల్లో సైతం దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. దీపదర్శనం, దీపదానం, దీప ప్రకాశనం అనే మూడు ఈ మాసంలో ఎంతో పుణ్యాన్నిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయాలు కార్తీక సందడికి సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక సోమవారాలు, ఏకాదశి, శనివారంతో పాటు ఈ నెలరోజులూ పుణ్యదినాలేనని అర్చకులు చెబుతున్నారు. విశిష్టత ఇలా.... కార్తిక శుద్ధ పాడ్యమికి బలి పాడ్యమి అని పేరు. ఈ రోజున బలిచక్రవర్తిని పూజించి దానం చేస్తే సంపదలు తరగవని చెబుతారు. మరుసటి రోజు ‘భగినీ హస్త భోజనం’ చేస్తారు. దీన్నే యమ ద్వితీయ, భ్రాత ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు సోదరులు, సోదర వరసైన వారిని ఇంటికి పిలిచి స్వయంగా వంటచేసి భోజనం వడ్డిస్తారు. శుద్ధ చవితిని నాగుల చవితిగా చేసుకుంటారు. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ మరుసటి రోజుకు క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. శుద్ధ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ రోజున మహావిష్ణువు పరమశివుణ్ని పూజించారని నానుడి. కార్తికపౌర్ణమిని పరమశివుడు త్రిపురాసులను సంహరించిన రోజుగా చెబుతారు. ఈ రోజున శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. దీపమే దైవం... ‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అన్నారు. దీపమే దైవ స్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, విప్పనూనె వంటి వాటితో కూడా దీపారాధనలు చేస్తారు. నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు కూడా ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. దీనివల్ల కష్ట నష్టాలు పోవడంతో పాటు పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అక్టోబర్ 26వ తేదీ నుంచి వచ్చేనెల 23వ తేదీ వరకు కార్తీక మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి. ఈనెల 31వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 4న ఏకాదశీ, 7న రెండో కార్తీక సోమవారం, అదే రోజు కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, 8న చంద్ర గ్రహణం, నవంబర్ 14న మూడో సోమవారం, 21న నాల్గోవ సోమవారం. ఆకాశదీపం ప్రత్యేకం ఆయా ఆలయాల వద్ద ద్వజస్తంభాలకు ఈ నెల రోజుల పాటు సాయంత్రం వేళ ఆకాశదీపాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దీపాలను ధ్వజస్తంభాలకు వేలాడదీస్తుంటారు. ఈ దీపాన్ని చూసిన, నమస్కరించిన దోషాలు తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఏటేటా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. (క్లిక్ చేయండి: కేదారేశ్వర వ్రతం ఎందుకు చేసుకుంటారంటే!) -
మమ్మేల రావయ్యా.. మా శివయ్య!
శ్రీశైలం టెంపుల్/అమరావతి/శ్రీకాళహస్తి రూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం స్వామిఅమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు గల గంగాధర మండపం వద్దకు పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఆశీనులను చేసి సాత్విక బలి సమర్పించారు. అశేష భక్తజనం శివనామాన్ని స్మరిస్తుండగా ఆలయం పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి ముందు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయపుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంగరంగ వైభవంగా అమరేశ్వరుని దివ్యరథోత్సవం అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం వైభవంగా సాగింది. అమరావతి, ధరణికోట నుంచి చింకా, ఆలపాటి, కామిరెడ్డి, కోనూరువారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశాస్త్రి పర్యవేక్షణలో పలు పూజలు నిర్వహించి రథోత్సవ ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. రథాన్ని సర్వాంగసుందరంగా పూలతో అలంకరించి ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని అందులో కొలువుదీర్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్‌లు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని క్రోసూరు జంక్షన్ వరకు లాగారు. అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథాన్ని యథాస్థానానికి చేర్చారు. నేత్రపర్వంగా ముక్కంటీశుని రథోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని రథోత్సవం బుధవారం కనులపండువగా సాగంది. రథోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు దేవస్థానానికి చెందిన స్వర్ణాభరణాలను అలంకరించడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల తేజస్సును చూసి పరవశించిపోయారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరుడిని ఇష్టదైవంగా కొలుస్తున్న ఆదివాసీలు
-
శివోహం..
సాక్షి నెట్వర్క్: ‘హరహర మహాదేవ.. శంభోశంకరా..’ అంటూ మంగళవారం రాష్ట్రం ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏ నోట విన్నా శివనామ స్మరణే వినిపించింది. అభిషేకాలతో భక్తవశంకరుడిని ప్రసన్నం చేసుకున్నారు. పలుచోట్ల పరమేశ్వరుడిని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. నల్లమల కొండలు శివనామ స్మరణతో పరవశించాయి. మల్లన్న, భ్రామరీలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన స్వామి, అమ్మవారు.. వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు హరోంహరా.. శంభో.. శివశంకరా అంటూ పరవశించారు. నీలకంఠుడికి పాగాలంకరణ శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో శివుడి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ ప్రత్యేకం. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే దేదీప్యకాంతులతో కనువిందుచేసిన విద్యుద్దీపాలను ఆపేశారు. క్షణాల్లో శంభో శివశంభో.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి మిన్నంటింది. పృధ్వీ వెంకటేశ్వర్లు స్వామి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం వెలిగిన విద్యుద్దీపాల కాంతుల్లో పాగాలంకరణ భక్తులను కనువిందు చేసింది. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాదిగా భక్తులు వచ్చిన వాహనాలతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అనేక వాహనాలను రోడ్డుమీదే నిలపాల్సి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తెలంగాణలోని మన్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలను నిలిపేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో.. శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారు ఇంద్రవిమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి నంది వాహనంపై, అమ్మ సింహ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటిగంట నుంచే దేవస్థానంలో లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిగంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. భక్తజనసంద్రంగా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో పోటెత్తింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. 17 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు, వెండిప్రభను సమర్పించారు. త్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ కృష్ణమనోహర్, జస్టిస్ పద్మావతి దర్శించుకున్నారు. పంచారామమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఏక రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రామతీర్థంలో.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవాలయమైనా ఏటా మాదిరే శివరాత్రికి భక్తులు హాజరై శ్రీరాముడిని, పక్కనే ఉన్న ఉమాసదాశివుడిని పూజించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండపై శిఖరజ్యోతి వెలిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, పూజలు చేశారు. పంచారామక్షేత్రాల్లో.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, భీమారామ, క్షీరారామ, కుమారభీమారామాల్లో పరమశివుడిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిలను, శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగానికి నిర్వహించిన పూజల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పాల్గొన్నారు. విశాఖలో మహాకుంభాభిషేకం మహా శివరాత్రిని పురస్కరించుకొని టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో మంగళవారం 37వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతం, సుగంధద్రవ్యాలు, పళ్లరసాలతో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
అపురూప దృశ్యం.. భక్తులు తన్మయత్వం
శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ఆలయ పరిధిలోని భీమేశ్వర ఆలయం శిఖరాన కార్తిక పౌర్ణమి వేళ గురువారం రాత్రి చంద్ర దర్శనం కనువిందు చేసింది. ఆలయం శిఖరాన నిండు పౌర్ణమి చంద్రుడు ఇలా దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. – జలుమూరు -
ఆలయానికి దారేది..
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభ
-
కార్తీక శోభ
-
శైవ క్షేత్రాల్లో కార్తీక మాస శోభ..
కార్తీక మాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారు జామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకరుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక మాస ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. చదవండి: ధర్మ దాన దీపోత్సవం తూర్పుగోదావరి జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తులు దర్శించుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శివనామ స్మరణతో కుండలేశ్వరం,ముమ్మిడివరం, తాళ్ళరేవు, యానంలోని శైవ క్షేత్రాలు మారుమ్రోగింది. మురమళ్ళ వృదగౌతమి గోదావరిలో తెలవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివుని దర్షించుకునేందుకు ఆలయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకమాస పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో దక్షిణ కాశి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకునేలా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కోవిడ్ ప్రభావంతో కార్తీక సోమవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో సప్త గోదావరి నదిలో స్నానాలు నిలిపివేశారు. అభిషేకాలు, కుంకుమ పూజలు, దీపారాధనల కూడా నిషేధించారు. పోటెత్తిన భక్తులు రాజమండ్రి గోదావరి ఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు, దీపారాధనలు చేపట్టారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం, పిఠాపురం పాదగయా క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భీమవరం శ్రీఉమాసోమేశ్వరజనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అధికారులు దర్శనం కల్పిస్తున్నారు. అమర లింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామూహిక నదీస్నానాలకు అనుమతించలేదు. కర్నూలు జిల్లా శ్రీశైలం : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీరోజు నాలుగు విడతలుగా ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం రాజన్నసిరిసిల్లా జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన చేయనున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కార్తీక మాస సందర్భంగా చర్ల మండలంలోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా : కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శివ నామస్మరణతో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయం మార్మోగుతుంది. కరోనా ప్రభావంతో భక్తులు అంతగా లేక పవిత్ర గోష్పాద క్షేత్రం వేలవేల పోయింది. మాస్కు ధరించి శివపార్వతులను పలువురు భక్తులు దర్శించుకున్నారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు చేపట్టారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామూహిక నది స్నానాలకు అనుమతి లేదు విజయవాడ : కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక దీపారాధన కోసం పెద్ద సంఖ్యలో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఘాట్లలో స్నానం చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గుంటూరు : కార్తీక సోమవారం కావడంతో అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శించుకోడానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సామూహిక నదీ స్నానాలకు అధికారులు అనుమతించలేదు. సామూహిక దీపారాధనకు కూడా అనుమతి లేదు. -
వివాదాస్పదమైన శివాలయ నిర్మాణం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎస్ఎంపురం గ్రామంలో శివాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ నిర్మాణ పనుల్లో రాజకీయ జోక్యం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇందులో జోక్యం చేసుకోవద్దని పోలీసులను బెదిరిస్తూ.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ భవనం మీద నుంచి దూకి జెడ్పీ మాజీ అధ్యక్షురాలు చౌదిరి ధనలక్ష్మి తనయుడు, మాజీ సర్పంచ్ అవినాష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం గాయాలతో శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు గ్రామంలో శివాలయ నిర్మాణం చివరి దశలో ఉంది. కొంతకాలంగా ఈ పనులు నిలిచిపోవటంతో స్థానిక వివాహిత చౌదిరి సంధ్య ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణంతోపాటు, ప్రతిష్ట కోసం విగ్రహాలను కొనుగోలుకు మహాబలిపురం విగ్రహ నిర్మాణ శిల్ప సంస్థకు బయానా చెల్లించింది. ఇదేక్రమంలో ఆ నిర్మాణం తామే పూర్తి చేస్తామని టీడీపీ వర్గానికి చెందిన కొంతమంది పట్టుబట్టారు. ఈ విషయమై ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈమెకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు బాసటగా నలిచారు. దీంతో పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో శివాలయ నిర్మాణ పనులు సంధ్య పర్యవేక్షణలో శుక్రవారం చేపట్టారు. దీన్ని టీడీపీ నాయకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ముందస్తు సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ వాతావరణæం చక్కబెట్టారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎచ్చెర్ల ఎస్సై రాజేష్, సీఐ మల్లేశ్వరావు వేధిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీస్‌లను బెదిరిస్తూ స్టేషన్ టెర్రాస్ పైకి అవినాష్ చేరుకున్నాడు. శ్లాబ్ పట్టుకుని జారే క్రమంలో ఆవరణలో ఉన్న కారుపై పడ్డాడు. దీంతో 108 వాహనంలో శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్పించారు. గాయపడ్డ అవినాష్, కుటుంబ సభ్యుల నుంచి ఎచ్చెర్ల ఏఎస్సై కృష్ణ వివరాలు తీసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లా అదపపు ఎస్పీ సోమశేఖర్, డీఎస్పీ మూర్తి గ్రామం సందర్శించారు. పోలీసులు రక్షణగా నిలిచారు.... పోలీసులు నాకు రక్షణగా నిలిచారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి (బాబ్జి), అతడి కుమారుడు మాజీ సర్పంచ్ అవినాష్, మాజీ ఎంపీటీసీ గొండు నర్సింగరావు దాడికి ప్రయత్నించారు. పోలీసులు రక్షణగా నిలిచారు. ఈ దాడిలో నా చేతికి గాయమైంది. దీనిపై ఫిర్యాదు చేశాను. గతంలో ఆలయ నిర్మాణ కమిటీ లేకుండానే పనులు చేశారు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. టీడీపీ నాయకులు నన్ను డబ్బులు అడిగారు. అవి దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి నిర్మాణం ప్రారంభించాను. రూ. 25 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. దైవభక్తి, ప్రజాప్రయోజన పనులను రాజకీయం చేయటం తగదు. ఆలయ నిర్మాణంలో శాంతియుతంగా వ్యవహరించిన పోలీసులకు బెదిరింపులు చేయడం సరికాదు. సహకరించాల్సిన మాజీ సర్పంచ్ అవినాష్ ఆత్మహత్యకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. – సంధ్య, ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత -
కార్తీక మహాపర్వం పున్నమి
కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు, సిక్కులకు కూడా విశిష్ట పర్వదినం. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే– ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణ, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు ఈ రోజు. నేడు ప్రత్యేకంగా చేయవలసినవి: దైవ దర్శనం, దీపారాధన, దీపదానం , సాలగ్రామ దానం , దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణం పేర్కొంటోంది. అదేవిధంగా అరుణ గిరిపై వెలిగించే కార్తీక దీపం ఎంతో విశిష్టమైనది. కన్నుల పండుగైనదీ. వందల టన్నుల ఆవునెయ్యిలో వేల టన్నుల నూలు వస్త్రాన్ని ముంచి, అరుణగిరి కొండలపై వెలిగించే ఈ దీపం ముందు ఆనాటి పున్నమి వెన్నెల చిన్నబోతుంది. పదిరోజులపాటు వరుసగా పున్నమి వెన్నెలను వెదజల్లుతుంది. -
భక్తికి ఆనవాళ్లు దేవతా వాహనాలు
వాహనం అనేది ఒకచోటు నుండి మరోచోటికి ప్రయాణించడానికి ఉపయోగించేదని సామాన్యార్ధం. నిజానికి వాహనం అంటే మోసేదని అ ర్ధం. దేవుడిని మోసేది దేవతా వాహనం. ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలిసే వరకు మన శరీరం ఈ జీవాత్మకు వాహనం. ఉత్సవాల్లో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. నిజానికి అది ఊరేగింపు కాదు. ఊరుకి ఎరిగింపు. దేవుడు వస్తున్నాడని ఊరుకు తెలియజేయడం. సాధారణంగా దేవతావాహనాలు ము ఖ్యంగా భక్తరూపాలే అయ్యుంటాయి. అవే ఆ దే వుళ్లకు ముఖ్యవాహనాలవుతాయి. శివుడికి అధికారనంది, వృషభం... విష్ణువుకు గరుడుడు.. వినాయకుడికి మూషికం.. సుబ్రహ్మణ్యస్వామికి మయూరం.. అమ్మవారికి సింహవాహనం.. అయ్యప్పస్వామికి గజం.. ఇలా ఇవన్నీ జంతు ప్రవృత్తికి చెందినవైనా.. భగవంతుణ్ణి అఖండ భక్తిభావంతో కొలిచి.. చివరికి దేవుణ్ణి ఎక్కడికైనా తీ సుకెళ్లగలిగే శక్తి గల వాహనంగా మారారు. ‘భగవంతుని జయించడానికి భక్తికి మించిన ఆయుదం లేదు‘ అనే ఈ సత్యాన్ని ఊరుకి ఎరిగింపు చే యడానికి భగవంతుడు ఆ వాహనాలపై విచ్చేసి భక్తులకు దర్శనమిచ్చి వారి పూజలందుకుంటాడు. ఆలయంలో ఉత్సవవేళలో దేవుడు సంచరించే వాహనాలన్నింటినీ ఓ మండపంలో ఉంచుతారు. దాన్ని వాహనసేవా మండపం అంటారు. ఆ మండపంలో వాహనాలన్నింటినీ దర్శించిన భక్తులకు మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. సహజంగానే వాటికి నమస్కరిస్తారు. కాసేపు కూర్చుంటారు. అప్పుడు ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సింది భక్తిని అలవరచుకోవడం. ఏ ఆలయంలో వాహనాలన్నీ ఉండి..ఉత్సవాలన్నీ చక్కగా జరుగుతాయో.. ఆ ఆలయం మహిమాలయం అవుతుంది. శివాలయంలో వృషభం, అధికారనంది, భూత, కైలాస, రావణ, పురుషమృగ, హంస, మకర, విమాన, రంగ, శిబికా మొదలైన వాహనాలుంటే.. విష్ణ్వాలయంలో గరుడ, ఆంజనేయ, శేష, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ, హంస, ఆందోళికా, గజ, హంస, కల్పవృక్ష, ముత్యాలపందిరి ఉంటాయి. ఇటువంటి వాహనాలసంఖ్య దాదాపు ఇరవైకి పైగా ఉంది. వాహనాలను దర్శించి.. భక్తిని అలవర్చుకుని..ఈ మానవజన్మను చరితార్థం చేసుకుందాం. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కూలుతున్న త్రిలింగేశ్వరాలయం
గోదావరిఖనిటౌన్(రామగుండం): శివశివ ఏమి త్రిలింగేశ్వరాలయ దుస్థితి. తెలంగాణ ప్రాంతంలోనే అతి పురాతనమైన కట్టడాల్లో ప్రత్యేకస్థానం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం లోని త్రిలింగేశ్వరాలయం. కాకతీయులు 12 శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. గతంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ ఆలయం కొంతకాలంక్రితం మూ త పడింది. గ్రామస్తుల చొరవతో పదేళ్లక్రితం పున: ప్రారంభమైంది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తాత్కాలిక పనులు చేపట్టి ఆలయంలో తిరిగి పూజలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆలయంలో భాగమైన భీమన్న ఆలయం పూర్తిగా కూలిపోయింది. ఆలయం కూలి వారం రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సందర్శించలేదు. ఇప్పటికి ఎ లాంటి చర్యలు జరపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పురాతన ఆలయ సంపదను కాపాడుకోవాలని కోరతున్నారు. ఎండోమెంట్ అధికారులు, పాలకులు చొరవ తీసుకొని తిరిగి పున:నిర్మించాలని కోరుతున్నారు. పర్యటన తప్ప చేసిందేమీ లేదు గతంలో రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ విశాలాచ్చి జనగామ త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి త్రీడి విధానంతో పున: నిర్మించి ప్రత్యేకత చాటుతామని చెప్పి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురాతన కట్టడాలకు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతీ కట్టడానికి నంబర్లు వేశా రు. కొన్ని కట్టడాలు తొలగించి ఆలయ ప్రాంగణం లో పెట్టారు. కొంతకాలంగా ఆదరణ లేక కొన్ని విగ్రహాలు ఆరుబయటే ఉంటున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఇతర సంస్థల సహకారంతో పూర్వ వైభవం తీసుకొస్తామని డైరెక్టర్ విశాలాచ్చి, ఇతర అధికారులు హామీఇచ్చారు. ఆలయంలో మరుగుదొడ్లు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, బాత్ రూంలు, కల్యాణ మందిరం, పార్కింగ్ స్థలం, ఇతర సౌకర్యా లు లేవు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆలయ నిర్మాణంకోసం కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
అద్భుత క్షేత్రంగా శివాలయం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న శివాలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటోంది. యాదగిరికొండపై ఎకరం స్థలంలో శివాలయాన్ని నభూతోనభవిష్యత్ అన్న రీతిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయం చుట్టూ ప్రాకారం పూర్తి చేశారు. ప్రాకార గోడలపై అందమైన పువ్వుల డిజైన్లతోపాటు శిల్పాలను అమర్చారు. నవ నందులు, శివుడికి ప్రతి రూపాలు, అమ్మవారి అష్టలక్ష్మి శిల్పాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునే విధంగా పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ముఖ మండపాన్ని నిర్మిస్తున్నా రు. అదే విధంగా మరకత లింగాన్ని ప్రతిష్ట చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యేలా పనులను వేగవంతం చేశారు. గతంలో ఉన్న ఆలయం కంటే భిన్నంగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదగిరికొండపై 14 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా శివాలయాన్ని గతంలో కంటే భిన్నంగా నిర్మిస్తున్నారు. కాకతీయులు, చోళుల కాలంనాటి నిర్మాణ రీతులను ప్రామాణికంగా తీసు కుని అందుకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా భక్తులకు అన్ని వసతుల ను ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న çవిశాలమైన స్థలంలో స్వామివారి పూజకు కావాల్సిన బిల్వం, మారేడు వృక్షాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు రూ.300 కోట్ల ప్రణాళికతో ఆలయ పనులు కొనసాగుతున్నాయి. -
తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం
న్యూఢిల్లీ: ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ చరిత్రపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్దే కొత్త వాదనకు తెరతీశారు. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో పేర్కొన్నారని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్‌మహల్‌గా మారిందని వివరించారు. ఇకనైనా మేల్కోకుంటే మన ఇళ్లు కూడా మసీదులుగా మారుతాయని, రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను తాకే వ్యక్తి చేతుల్ని నరికేసేలా చరిత్రను రాయాలని సూచించారు. -
సెల్ఫీ వీడియో ..అర్చకుడి ఆత్మహత్య
-
అర్చకుడి సెల్ఫీ వీడియో కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మూడు దశాబ్దాలకు పైగా అర్చకత్వం చేస్తున్న గుడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ మల్లిఖార్జున శర్మ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పాలకమండలి సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తొలగించారని శర్మ తెలిపాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శర్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. కోరుకొండ మండలంలోని కణపూరులో ఈ ఘటన జరిగింది. శర్మ శివాలయంలో అర్చకత్వం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. తన ఆత్మహత్యకు బాధ్యులైన వారి పేర్లను సెల్ఫీ వీడియోలో వెల్లడించిన శర్మ... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తన స్థానంలో వచ్చే మరో అర్చకుడికైనా ఇదే గతి పట్టొచ్చునని హెచ్చరించారు. గుప్త నిధులు తవ్వకాలు జరిపామని తనపై, తన కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని పేర్కొంటూ.. సూసైడ్ నోట్లో సైతం పలువురి పేర్లు వెల్లడించాడు. అర్చకుల ధర్నా విజయవాడ: అర్చకుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాచౌక్‌లో నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని, అర్చక సంక్షేమ నిధిని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈనామ్ భూముల్లో అర్చకులను పాసుపుస్తకాల్లో అనుభవదారులుగా నమోదు చేయాలని సూచించింది. అర్చకులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని, మల్లిఖార్జున శర్మ ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. అర్చకుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు, అఖిలభారత బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చెరుకుమళ్ల రఘురామయ్య మద్దతు ప్రకటించారు. -
గుప్త నిధుల కోసం శివాలయం ధ్వంసం
కర్నూలు, బూడిదపాడు(గూడూరు): మండలం పరిధిలోని పాత బూడిదపాడులో ఉన్న పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం గురువారం రాత్రి దుండగలు విఫలయత్నం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. కొంతమంది దుండగులు పాత బూడిదపాడులోని శివాలయం గర్భగుడి తలుపులు తొలగించి లోపల శివలింగాన్ని, పాశాన్ని గడ్డపారలతో పెకిలించారు. అనంతరం తవ్వకాలకు వీలుపడకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం పూజారి తిమ్మరాజు ఆలయానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి నిధులు చోరీకి గురికాలేదని వివరించారు. -
ఆలయానికి పొలం దానం చేసిన ముస్లిం
సాక్షి, న్యూఢిల్లీ : భిన్న మతాలున్న సమాజంలో ఆ మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు కొనసాగాలంటే అందుకు ప్రతి ఒక్కరి కృషి, సాయం ఎంతో అవసరం. పైగా మత విధ్వేశాలు రగులుతున్న సమయంలో అది మరీ అవసరం. కేరళలోని మల్లప్పురం జిల్లా చంతన్గొట్టుపురం గ్రామంలో కుందాడ శివాలయం ఉంది. అయితే శివాలయానికి అవసరమైన కోనేరు మాత్రం లేదు. ఆలయానికి అది తవ్వేంత స్థలం కూడా లేదు. పక్కనే నంబియార్తోడి ఆలీ ముస్లింకు 4.7 ఎకరాల పొలం ఉంది. అందులో కోనేరులాగా ఉపయోగపడే చిన్న కుంట ఉంది. దాన్ని కొనేందుకు అడగాలని శివాలయం కమిటీ నిర్ణయించింది. అసలే ముస్లిం, ఆలయానికంటే స్థలం అమ్ముతాడో, లేదోనని ముందుగా సంశయించింది. ముందయితే అడుగుదామని అడిగింది. వారు అనుమానించినట్లే ముస్లిం స్థలాన్ని అమ్మనన్నాడు. అయితే మొత్తం స్థలం కాకుండా కుంట ప్రాంతాన్ని, ఆలయం నుంచి అక్కడికి వెళ్లివచ్చేందుకు అవసరమైన దారిని ఉచితంగా ఇస్తానని చెప్పారు. అలాగే ఆ మేరకు ఆలయ కమిటీకి ఆ స్థలాన్ని ఉచితంగా రిజిస్టర్ చేసి ఇచ్చారు. మొన్న శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం కమిటీ వారు ఆ ముస్లిం వ్యక్తిని పిలిపించి ఉచితరీతిన సన్మానించారు. ఆయన వినతిపై ఆయన ఫొటోను మాత్రం ఆలయ కమిటీ విడుదల చేయలేదు. మనుషుల్లో కూడా మహానుభావులుంటారంటే ఇలాంటివారేనేమో!