జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మూడు దశాబ్దాలకు పైగా అర్చకత్వం చేస్తున్న గుడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ మల్లిఖార్జున శర్మ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పాలకమండలి సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తొలగించారని శర్మ తెలిపాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శర్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. కోరుకొండ మండలంలోని కణపూర్‌లో ఈ ఘటన జరిగింది. శర్మ శివాలయంలో అర్చకత్వం చేస్తున్నారు.