Priest suicide
-
అర్చకుడి ఆత్మహత్యలో టీడీపీ నేతల హస్తం?
తూర్పుగోదావరి, మధురపూడి (రాజానగరం) : అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్యలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషించగా ఆయనను తప్పించేందుకు యత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కోరుకొండ మండలం కణుపూరులోని స్వయంభు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ అర్చకుడు మల్లికార్జున శర్మను తొలగించే యత్నాల్లో ఆయనను మానసికంగా వేధింపులకు గురి చేశారు. ఆయన నివసించే ఇంటి తాళాలు పగలుకొట్టి, ఇంట్లోని సామాన్లను పంచాయతీకి తీసుకురావడంలో ఆ నాయకుడు కీలకమైన పాత్ర పోషించారు. శర్మ తన ఆత్మహత్యకు కారకులుగా పేర్కొన్న జాబితాలో ఆయన పేరున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి సత్యనారాయణశర్మ పోలీసులకు ఇచ్చిన లిస్టులో కూడా ఆ ప్రజాప్రతినిధి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసులో ఆయన పేరు కనీసం ప్రస్తావనకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాల్ డేటా పరిశీలిస్తే కొత్తసమాచారం మృతుడి తండ్రి, ఆయనతో మాట్లాడిన వారి ఫోన్లోని కాల్లిస్టును పరిశీలిస్తే కొత్త సమాచారం లభ్యమవుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా శర్మతో సఖ్యతగా ఉంటున్నవారితో మాట్లాడితే కొత్త సమాచారం వస్తుందంటున్నారు. అధికార పార్టీ నేతను తప్పించే యత్నాలు అర్చకుడు మల్లికార్జున శర్మ ఆత్మహత్య కేసులో టీడీపీ నాయకుడు, ప్రజా ప్రతినిధిని తప్పించడం కోసం పై స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు నూతన పద్ధతులను అవలంబిస్తేనే నిజాలు బయటపడతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. శర్మను మానసికంగా క్షోభపెట్టిన, అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పడంలో కీలకపాత్ర పోషించిన వారిని పోలీసులు గుర్తించాల్సి ఉంది. -
వేదమంత్రాల సాక్షిగా అర్చకుడి ఆత్మార్పణం
రాజమహేంద్రవరం క్రైం: గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరపాలంటూ ధర్మకర్తల మండలి ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం, కణుపురు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో కొత్తలంక మల్లికార్జున శర్మ (30)అర్చకుడు. అతని తండ్రి సత్యనారాయణ శర్మ 40 ఏళ్లుగా ఇక్కడే అర్చకుడిగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటుండడంతో మల్లికార్జున శర్మ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే దేవాలయంలో గుప్త నిధులున్నాయనే వదంతులు రావడంతో దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లికార్జునశర్మపై తవ్వకాలకోసం ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అతను అంగీకరించకపోవడంతో ఆయన స్థానంలో మరో పూజారిని నియమించారు.ఈ నేపథ్యంలో మల్లికార్జున శర్మ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. తనపై జరిగిన వేధింపుల విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వేందుకు సహకరించాలని ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, కాగా తాను వేదమంత్రాలు వల్లెవేస్తూ మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.దీనిపై అర్చక సమాఖ్య ఆందోళన వ్యక్తంచేసింది. మల్లికార్జున శర్మ మృతదేహంతో తమ నిరసనను తెలిపింది. అర్చకులకు రక్షణ కల్పించాలని కోరింది. -
సెల్ఫీ వీడియో ..అర్చకుడి ఆత్మహత్య
-
అర్చకుడి సెల్ఫీ వీడియో కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. మూడు దశాబ్దాలకు పైగా అర్చకత్వం చేస్తున్న గుడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ మల్లిఖార్జున శర్మ మంగళవారం తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పాలకమండలి సభ్యులు పగబట్టి తనను విధుల నుంచి తొలగించారని శర్మ తెలిపాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శర్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. కోరుకొండ మండలంలోని కణపూరులో ఈ ఘటన జరిగింది. శర్మ శివాలయంలో అర్చకత్వం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. తన ఆత్మహత్యకు బాధ్యులైన వారి పేర్లను సెల్ఫీ వీడియోలో వెల్లడించిన శర్మ... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తన స్థానంలో వచ్చే మరో అర్చకుడికైనా ఇదే గతి పట్టొచ్చునని హెచ్చరించారు. గుప్త నిధులు తవ్వకాలు జరిపామని తనపై, తన కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దని పేర్కొంటూ.. సూసైడ్ నోట్లో సైతం పలువురి పేర్లు వెల్లడించాడు. అర్చకుల ధర్నా విజయవాడ: అర్చకుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాచౌక్లో నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించాలని, అర్చక సంక్షేమ నిధిని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈనామ్ భూముల్లో అర్చకులను పాసుపుస్తకాల్లో అనుభవదారులుగా నమోదు చేయాలని సూచించింది. అర్చకులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని, మల్లిఖార్జున శర్మ ఆత్మహత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. అర్చకుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేత మల్లాది విష్ణు, అఖిలభారత బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చెరుకుమళ్ల రఘురామయ్య మద్దతు ప్రకటించారు. -
ఆలయ పూజారి ఆత్మహత్య
రాయచోటి : ఆలయ పూజారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం మాధవరంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న కాలువపల్లి లక్ష్మీ నరసప్ప(65) ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రాయచోటి ఎస్సై శ్రీ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చే రుకొని దర్యాప్తు చేస్తున్నారు.