వైభవంగా శివాలయ ప్రతిష్ఠ | richely celebrate shivalaya prathistha | Sakshi
Sakshi News home page

వైభవంగా శివాలయ ప్రతిష్ఠ

Published Sun, Aug 7 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

వైభవంగా శివాలయ ప్రతిష్ఠ

వైభవంగా శివాలయ ప్రతిష్ఠ

మట్టపల్లి (మఠంపల్లి): మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పార్వతీ రామలింగేశ్వరాలయం విగ్రహ ప్రతిష్ఠలు, జీవధ్వజ ప్రతిష్టాపనను వేద పండితులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, గర్తన్యాసం, బీజవ్యాపం, రత్నవ్యాపం నిర్వహించారు. ఉదయం గం.9.32ని.లకు యంత్రస్థాపన, బింబస్థాపన, కలాన్యాసంతో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను నిర్వహించారు. అదేవిధంగా హోమాలు, దృష్టి కుంభం, దేమదర్శనం, బింబదర్శనం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం నిర్వహించారు. సాయంత్రం శ్రీగంగా పార్వతీసమేత శ్రీరామలింగే శ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ ఎంపీ లక్ష్మణరావు, యజ్ఞకర్తలు సోమయాజుల లక్ష్మీనర్సింహశాస్త్రి, కల్వకొలను పురుషోత్తమశర్మ, మార్తి దుర్గాప్రసాద్‌ శర్మ, సోమయాజుల సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనర్సింహమూర్తి, శివరామకృష్ణ శర్మ, నాగభూషణశర్మ, సుబ్బారావుశాస్త్రి, సత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement