టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్‌ ఎన్నిక | Tamil Nadu Election Results 2026: TVK Vijay Govt Formation News Updates | Sakshi
Sakshi News home page

టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్‌ ఎన్నిక

May 5 2026 9:18 AM | Updated on May 5 2026 8:53 PM

Tamil Nadu Election Results 2026: TVK Vijay Govt Formation News Updates

తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది విజయ్‌ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. 

తమిళనాట టీవీకే విజయ్‌ ప్రభంజనం.. లైవ్‌ అప్‌డేట్స్‌

  • టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌
  • తమిళనాడులో  కాంగ్రెస్‌ గెలిచిన సీట్లు ఐదు
  •  ప్రభు త్వ  ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకే
  • అందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్‌

మోదీ ట్వీట్‌కు ​ దన్యవాదాలు తెలిపిన విజయ్‌

ఇతర పార్టీలతో టీవీకే చర్చలు

  • రేపు గవర్నర్‌ను కలవనున్న టీవీకే చీఫ్‌ విజయ్‌
  • మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలు
  • తమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు

7న సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం?

  • టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్‌ భేటీ 
  • ఈ నెల 7న సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం? 
  • టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్‌ ఎన్నిక
  • ఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్‌
  • ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు 

స్టాలిన్‌ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్‌
ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్

తెరపైకి రిసార్ట్‌ రాజకీయం

  • తమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్‌ రాజకీయం
  • మల్లాపురంలోకి రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపు
  • ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయం
  • ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బస
  • మరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ను రెండు వారాల గడువు కోరిన విజయ్‌
  • అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకే
  • వెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపు
  • సమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్‌

విజయ్‌ విక్టరీపై ప్రేమలత విజయ్‌కాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • విజయ్‌ మా బిడ్డలాంటోడు
  • అందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదు
  • మొదటి నుంచి ఆయన కెప్టెన్‌(విజయ్‌కాంత్‌)తో ఉన్నారు
  • విజయ్‌ చక్కగా పాలించాలి
  • తమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకే

టీవీకే ఫ్లోర్‌ లీడర్‌గా విజయ్‌!

  • టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్‌ భేటీ
  • ఫ్లోర్‌ లీడర్‌గా విజయ్‌ ఎన్నిక
  • ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్‌
  • ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చ
  • తమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకే
  • కీలకంగా మారిన కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు

విజయ్‌ వదులుకునేది ఆ స్థానాన్నే?

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ ఘన విజయం
  • పోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్‌
  • పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్‌
  • తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయం
  • రెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితి
  • తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకునే యోచనలో విజయ్‌?
  • విజయ్‌ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠ

టీవీకే ఆఫీస్‌లో విజయ్‌

  • తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే
  • 108 స్థానాల్లో విజయ్‌ పార్టీ విక్టరీ
  • పోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్‌
  • నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్‌లో విజయ్‌ భేటీ (106+విజయ్‌+విజయ్‌)
  • ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభం

ఇవాళ అన్నాడీంకే కీలక సమావేశం

  • తమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే
  • నేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశం
  • గెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపు

టీవీకే కీలక ప్రకటన

  • ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్‌
  • నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకే
  • ఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలు
  • ఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్య
  • ఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు
  • ప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2,  వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశం
  • కొనసాగుతున్న టీవీకే కీలక సమావేశం
  • ఎమ్మెల్యేలతో విజయ్‌ భేటీ
  • మరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్‌
  • ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌ను రెండు వారాల గడువు కోరిన విజయ్‌

స్టాలిన్‌ రాజీనామా

  • తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్‌ రాజీనామా
  • రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపిన డీఎంకే అధినేత
  • ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్‌ 
  • పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్‌
  • ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్‌ ప్రకటన
  • ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడి
  • తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల్లో డీఎంకే ఓటమి
  • కొలతూర్‌లో ఓడిన ఎంకే స్టాలిన్‌
  • కాసేపట్లో స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే సమావేశం
  • ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం 

టీవీకే ఆఫీస్‌కు విజయ్‌

  • టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్‌
  • మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశం
  • శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం
  • ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు
  • కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్‌?
  • ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్‌
  • మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరం

విజయ్‌ ఆహ్వానిస్తే మద్దతిస్తాం

  • తమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • తమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలు
  • సీపీఐ రెండు, సీపీఎం 2
  • ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్‌ పార్టీల ఆసక్తి
  • విజయ్‌ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలు
  • ఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్‌ సంప్రదింపులు
  • డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రెడీ!
  • తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్‌ పార్టీగా విజయ్‌ టీవీకే
  • అధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్‌
  • ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలు

కీలకంగా ఆ పార్టీలు?

  • తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు
  • 108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే 
  • డీఎంకే 59,  ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికే
  • రెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరిన విజయ్‌ 
  • గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖ
  • కీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు
  • తమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు
  • ఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2,  వీసీకే 2,   డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలు
  • ఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1
  • కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలు

ఏం తేలుస్తారో?

  • టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడి
  • తమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్‌ వీరాభిమానులు
  • ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్
  • టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్

విజయ్‌ వెంట ఎవరెవరు?

  • ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం
  • లార్జెస్ట్‌ పార్టీగా విజయ్‌ టీవీకే
  • మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగు దూరం
  • విజయ్‌ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠ
  • అన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలు
  • నేడు గవర్నర్‌ను కలవనున్న విజయ్‌
  • ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!

ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి!

  • తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్‌నిధి స్టాలిన్‌
  • ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకే
  • మరికాసేపట్లో స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే సమావేశం
  • కొళత్తూర్‌లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్‌
  • చెపాక్‌లో తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌ విజయం
  • ప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్‌

కాంగ్రెస్‌తో సెంగోట్టయన్ చర్చలు!

  • తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలు
  • విజయ్‌ టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు?
  • ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీ
  • కాంగ్రెస్‌తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్‌ చర్చలు
  • ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన విజయ్‌

లోక్‌భవన్‌కు విజయ్‌?

  • తమిళనాడు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన టీవీకే అధినేత విజయ్‌
  • టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్‌
  • శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకే
  • సమావేశం తర్వాత నేరుగా లోక్‌భవన్‌కు దళపతి?
  • ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశం
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకే
  • తమిళనాడులో హంగ్‌
  • మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 10 సీట్లు తక్కువ!
  • ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్‌?
  • మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠ

నేడు టీవీకే కీలక సమావేశం

  • విజయ్‌ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశం
  • నెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్‌కు ఆహ్వానించిన విజయ్‌
  • ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశం
  • ఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్‌

విజయ్‌ నివాసం వద్ద కోలాహలం

  • చెన్నైలోని విజయ్‌ నివాసం వద్ద కోలాహలం
  • భారీగా పోలీసు భద్రత ఏర్పాటు
  • విజయ్‌ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులు
  • మరోవైపు.. విజయ్‌ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులు
  • విజయ్‌కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
  • టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలు

మొదలైన సంప్రదింపులు

  • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు
  • ఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులు
  • అందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?
  • ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
  • పీఎంకే నుంచి మరో నలుగురు
  • వామపక్షాల సంఖ్య 2,
  • ఐయూఎంఎల్ 2
  • విజయ్‌ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠ
  • అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చ

మరో 10 సీట్ల దూరంలో.. 

  • ఉత్కంఠగా తమిళనాడు రాజకీయం
  • సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే
  • 234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయం
  • డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ 118 
  • ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరం

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి👉.. విజయ్‌ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..

ఓటమిపై స్పందించిన స్టాలిన్‌

  • ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్‌
  • ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్‌
  • ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్‌
  • దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేత
  • కొలతూర్‌లో స్టాలిన్‌ ఓటమి
  • స్టాలిన్‌ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు 
  • విక్టరీ అనంతరం ‘ఫినిష్‌’ సంజ్ఞతో స్టాలిన్‌ను ఎద్దేవా చేసిన బాబు

విజయహో..

  • మార్పు నినాదంతో..  దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్‌
  • తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళం
  • డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకే
  • తొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు
  • 234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే 
  • పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్‌
  • డీఎంకే కూటమి దారుణ ఓటమి
  • డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ ఓటమి
  • మొత్తం మంత్రులంతా ఓటమి
  • మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమి
  • మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్‌
  • తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్‌

Advertisement
 
Advertisement
Advertisement