TVK Vijay
-
విజయ్, ఉదయనిధికి బిగ్ రిలీఫ్..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌కు ఊరట లభించింది. వీరు ముగ్గురు ఎన్నికల అఫిడవిట్లలో తమ ఆస్తి వివరాలను దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.వివరాల మేరకు.. పెరంబూర్ నియోజకవర్గ ఓటరు విఘ్నేష్ దాఖలు దాఖలు చేసిన పిటిషన్లో సీఎం విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో వేర్వేరు ఆస్తి వివరాలను చూపించారని ఆరోపించారు. పెరంబూర్‌లో రూ. 115 కోట్లుగా చూపిన ఆస్తులను, తిరుచ్చి ఈస్ట్‌లో రూ. 220 కోట్లుగా పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారాలపై ఐటీ శాఖ, ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరారు. అలాగే, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారని పేర్కొంటూ ఓటరు కుమారవేల్ పిటిషన్ వేశారు. మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ గత లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పుడు భిన్నమైన వివరాలు సమర్పించారని గౌతమ్ శివ అనే ఓటరు పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం వివరణ..ఈ మూడు వేర్వేరు పిటిషన్లు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్మురుగన్ ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ వాదనలు వినిపించారు. సీఎం విజయ్ రెండు నియోజకవర్గాల్లోనూ పేర్కొన్న ఆస్తి విలువలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో కేవలం ఎన్నికల పిటిషన్ మాత్రమే వేయడానికి చట్టంలో వీలుంటుందన్నారు. ఇప్పటికే ఇలాంటి పలు పిటిషన్లను కోర్టులు కొట్టివేసాయని వివరించారు. ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సీఎం విజయ్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
తమిళ పాలిటిక్స్.. స్టాలిన్‌కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళానాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్‌లు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా డీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. దీంతో తమిళనాట కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే అనే విధంగా పొలిటికల్ హీట్ పెరిగింది. విజయ్ నాయకత్వానికే ప్రజల మొగ్గుఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన 27 నెలల్లోనే 108 స్థానాలు గెలుచుకుని తమిళగ వెట్రి కళగం(టీవీకే) చరిత్ర సృష్టించిందని మంత్రులు పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సీఎం కావాలన్నదే తమిళనాడు ప్రజల తీర్పు అని వారు స్పష్టం చేశారు. టీవీకేకు మెజారిటీకి 10 సీట్లు తక్కువైనప్పటికీ, అన్నాడీఎంకే మద్దతుతో సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లౌకిక విలువల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని కొనియాడారు. అధికారంలో వాటా.. ఇదే నిజమైన కూటమి ధర్మం అని వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 సీట్లున్న కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు విజయ్ ఇచ్చారని, అలాగే వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకోలేదని విమర్శించారు.బీజేపీ కుట్రను అడ్డుకున్నాం..ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పన్నిన కుట్రకు డీఎంకే కూడా సహకరించిందని, అయితే లౌకిక శక్తులు బలంగా నిలబడటం వల్ల ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే, డీఎంకే అధికారిక పత్రిక ’మురసోలి’లో కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని కించపరుస్తూ రాస్తున్న వ్యాసాలపై మండిపడ్డారు. తమకు కూడా తిట్టడం తెలుసనని, అయితే, తమ నాయకులు తమకు రాజకీయం నేర్పారన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఒకవేళ తాము హద్దులు దాటితే డీఎంకే తట్టుకోలేదని హెచ్చరించారు. మైనారిటీలు, దళితులు డీఎంకేకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అది వదిలేసి మిత్రపక్షాలపై పడి ఏడిస్తే, వచ్చే ఎన్నికల్లో తమరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.పుదుచ్చేరిలోనూ పొత్తే.. ఇదిలా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్మద్దతు కీలకంగా మారిందన్నారు. -
అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి మరణం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.జూన్ 14న బిహార్ రాష్ట్రం బిబిన్ మంజికి చెందిన అభియోగి అనే 19ఏళ్ల వలస కార్మికుడు చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి అత్యవసర చికిత్స నిమిత్తం గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. జూన్ 15 ఉదయం బాలిక తీవ్ర గాయాలతో మరణించింది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన అభియోగిని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.విజయ్ ప్రభుత్వానికి డిమాండ్ఆ ఘటనపై స్పందించిన అన్నామలై.. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రశంసించారు. అయినప్పటికీ, ఇలాంటి నేరాలను ముందుగానే నివారించడంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. ఉద్యోగాల కోసం వలస రావడం సహజమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల రికార్డులు సరైన విధంగా నిర్వహిస్తుందా, యజమానులు, కాంట్రాక్టర్లు వారి వివరాలను అధికారులకు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. వలస కార్మికుల వివరాలు, వారి స్వస్థలం, పని చేసే ప్రదేశం, నివాసం, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు వంటి సమాచారం సేకరించి, ట్రాక్ చేసి, పర్యవేక్షించే విధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లవల్లే దారుణాలు అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలను ఎక్స్ వేదికగా ఉదహరించారు. ‘ జూన్ నెల ప్రారంభంలో చెన్నైలో ఒక వృద్ధ మహిళ నుండి బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించిన ఉత్తర భారత రాష్ట్రానికి చెందిన యువకుడు అరెస్టయ్యాడు. గత నెలలో, తాంబరం వద్ద యువతిపై లైంగిక వేధింపులు, తిరువల్లూరు సమీపంలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి, చెన్నై వెలాచేరి బస్ స్టాండ్ దగ్గర 61 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచారం, చెన్నై వెలాచేరిలో మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపుల కేసులో 15 ఏళ్ల బాలుడితో పాటు ముగ్గురు ఉత్తర భారత కార్మికుల అరెస్టు, చెన్నై మదురవోయల్ ప్రాంతంలో తెల్లవారుజామున ఇంటి ముందు కోలమ్ వేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఈ సంఘటనల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువకులు అరెస్టు కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని అన్నామలై పేర్కొన్నారు. திருவள்ளூர் மாவட்டம் கும்மிடிப்பூண்டி அருகே, 3 வயது பெண் குழந்தை பாலியல் தாக்குதலுக்குள்ளாகி, சிகிச்சை பலனின்றி உயிரிழந்த செய்தி, மிகுந்த அதிர்ச்சியும், வருத்தமுமளிக்கிறது.இந்தக் குற்றத்தில் தொடர்புடைய வடமாநிலத்தைச் சேர்ந்த ஒரு நபர் கைது செய்யப்பட்டிருக்கிறார். அதே போல,…— K.Annamalai (@annamalai_k) June 15, 2026 తనదైన మార్క్ పాలిటిక్స్‌కు అన్నామలై తాజా వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాజీ బీజేపీ నేత ద్రావిడ సిద్ధాంతాలు, ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనదైన మార్క్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.తమిళనాడు రాజకీయాలు తమిళ గుర్తింపు, భాష, ద్రావిడ సిద్ధాంతం, ప్రాంతీయం, ఉత్తర భారత వ్యతిరేక వాదనల చుట్టూ తిరుగుతున్నాయి. ఇదే సిద్ధాంతం ఆధారంగా ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు ఆరు దశాబ్దాలుగా శక్తివంతమైన రాజకీయాలే చేశాయి. ఇప్పుడు తమిళనాడు మాజీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ఇదే పంథాలో సరికొత్త రాజకీయానికి తెరతీశారు. ద్రావిడ పార్టీలను వారి విభజనాత్మక రాజకీయాలపై విమర్శిస్తూ, ఇప్పుడు ఉత్తర భారత వ్యతిరేక వాదనను కొత్త కోణంలో ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తున్నారు.గుమ్మిడిపూండి ఘటనలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి,మరణంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఉత్తర భారత కార్మికుల నేరాలలో పెరుగుతున్న ప్రమేయం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించినప్పటికీ, నేరాలను ముందుగానే నివారించే విధానాలు అవసరమని సూచించారు. తద్వారా మిగిలిన ద్రావిడ పార్టీల తరహా ఉత్తర భారత వ్యతిరేక వాదనను భాష, సంస్కృతి, ప్రాంతీయం ఆధారంగా కాకుండా పాలన, భద్రత, వలస కార్మికుల నియంత్రణ అంశాలపై దృష్టి పెట్టి, కొత్త రాజకీయాలకు తెరతీశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. -
బిస్కెట్స్ ఆశ చూపి పసిబిడ్డపై పైశాచికం చేసినవాడిపై విజయ్ సంచలన నిర్ణయం
-
22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్‌కి చెందిన చాలామంది విజయ్‌ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్‌తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్‌ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్‌ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్‌తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by SIMRAN (@actorsimranofficial) -
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా
-
‘కుక్క’ వ్యాఖ్యలపై దుమారం.. స్పందించిన లారెన్స్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మధ్య నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి దారితీసింది. అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతుండగా.. ఆయన చేసిన "కుక్క" పోలిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇటీవల మీడియాతో మాట్లాడిన లారెన్స్.. కొత్త ఇంటికి మారినప్పుడు ఆ పరిసరాలు, అక్కడి పరిస్థితులు, అక్కడ తిరిగే కుక్కల అలవాట్లు కూడా తెలుసుకోవడానికి సమయం పడుతుందని ఉదాహరణ చెప్పారు. అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ప్రజలను ఉద్దేశించి చేసినట్లుగా అర్థం చేసుకోవడంతో వివాదం చెలరేగింది.దీనిపై ఎక్స్‌లో స్పందించిన లారెన్స్.. తాను ప్రజలను ఎప్పుడూ తన తల్లితో సమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. "నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఉదాహరణ చెప్పాను. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పూర్తి వీడియో చూడకుండా వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. తన మాటల అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.Hi everyone,I would like to clarify a misunderstanding regarding my recent press meeting.I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading. All I… pic.twitter.com/576GhWsI61— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026అయితే వివరణ ఇచ్చినప్పటికీ.. లారెన్స్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగలేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకపోయినా, ఆయన ఉపయోగించిన ఉపమానం అనవసర వివాదానికి తావిచ్చిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వ్యాఖ్యలను సందర్భంతో పాటు చూడాలని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. దీంతో "కుక్క" వ్యాఖ్యల వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఇటీవల ఆయన ప్రకటించారు. అందుకు తన తల్లి అంగీకరించారనని.. ప్రజలు డిసైడ్ చేయడమే ఆలస్యమని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విజయ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో టీవీకేలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
విజయ్.. అధికార మత్తులో మర్చిపోయారా?: స్టాలిన్
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్‌సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎం విజయ్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే తమరు ఢిల్లీ వెళ్లారా?, బీజేపీని గట్టిగా విమర్శిస్తే తమరి కుర్చీకి ముప్పు వస్తుందని భయపడుతున్నారా? అంటూ స్టాలిన్ ప్రశ్నలు సంధించారు.డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డీఎంకే ద్రావిడ మోడల్ పాలన మహిళల సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్నారు. అయితే, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విద్యుత్ కోతలు, రైతుల రుణాల మాఫీ నాటకాలతో.. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా.? అని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన సీఎం విజయ్.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో టీవీకే నిర్వాహకులే నిందితులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు టీవీకే నుంచి మహిళలకు రక్షణ కావాలని ప్రజలు కోరే పరిస్థితి వచ్చిందన్నారు.డీఎంకే బ్లూప్రింట్ కాపీ కొట్టారు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం విజయ్ హాజరు కావడంపై స్టాలిన్ స్పందించారు. ఇందులో సీఎం ప్రసంగం అంతా గతంలో డీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్ర హక్కుల కోసం తాము రూపొందించిన పాలసీ నోట్ లాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర హక్కుల విషయంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వేసిన బ్లూప్రింట్ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను గతంలో 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్తే.. విజయ్ మాత్రం కాస్తమెరుగు దిద్ది మార్చి 2036 నాటికి ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని మాట్లాడారని గుర్తు చేశారు. ఏదేమైనా అందుకు నా అభినందనలు అని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు పిలుపు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే.. ఇరుపక్షాలు ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నాయని ఎగతాళి చేసిన విజయ్, ఇప్పుడు నిబంధనలు లేకుండా నిధులు ఇవ్వాలని అదే ఢిల్లీ పెద్దలను కోరి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నింటినీ డీఎంకే మహిళా విభాగం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ స్థాపకుడు కరుణానిధి చెప్పినట్లుగా పార్టీ అనేది తల, అధికారం అనేది కిరీటం అని , అయితే, తల ఉంటే కిరీటాన్ని ఎప్పుడైనా ధరించవచ్చు అని గుర్తు చేస్తూ, డీఎంకే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీకి జిరాక్స్ కాపీలా విజయ్ పాలన.. సీఎం విజయ్ ప్రస్తుతం బట్టల షాపింగ్ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వంపై తనకే నమ్మకం లేక, మొదట అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారన్నారు. ఇప్పుడు వారితో రాజీనామాలు చేయించి వెంటనే తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న దాన్నే ఇక్కడ విజయ్ చేస్తున్నారని, విజయ్ పూర్తిగా బీజేపీకి జెరాక్స్ కాపీలా వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. -
డ్రైవర్‌గా మారిన సీఎం విజయ్.. 130 కిలోమీటర్లు స్వయంగా డ్రైవింగ్!
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చాడు స్టార్ హీరో విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలీలో పరిపాలన సాగిస్తున్నాడు. హీరోగా ఉన్నప్పుడే ఆయన చాలా సింపుల్ లైఫ్‌ని లీడ్ చేసేవాడు. స్టార్ అనే గర్వం ఎక్కడ చూపించేవాడు కాదు. ఇక సీఎం అయిన తర్వాత ఆయనలో మరింత మార్పు వచ్చింది. ఎక్కడ కూడా అధికార గర్వం కనిపించడం లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆయన ప్రణాళికలు ఉంటున్నాయి. తాజాగా ఆయన కర్ణాటక కొల్లూరులోని శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్‌లో తాను ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు.సీఎం విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. He Himself drives His own convoy for more than 130+KM's From Kollur to Mangaluru Airport🥶🙌🫡🔥🦁@CMOTamilnadu Na Loves Driving❤️#Jananayagan @TVKVijayHQ pic.twitter.com/PkyyYU2OIW— MR.BK👺 (@_kishore__vj) June 12, 2026Most Valuable Driver 🔥🔥🔥#CMJosephVijay #TVKVijay pic.twitter.com/eAPer8fCvQ— Swara TVK ❤️💛 (@SwaraVijay_) June 12, 2026 -
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
రాజకీయాల్లో గెలవాలంటే కేవలం ప్రజాబలం మాత్రమే కాదు.. తమ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లే ‘బలం’ కూడా అవసరమే. అందుకే డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను అన్‌లిమిటెడ్‌గా వాడేసుకుంటున్నాయి పార్టీలు. అలాగే.. పార్టీలకు అనుకూలంగా పేపర్లు, టీవీ చానెల్స్ ఉండటం కొత్త విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ గెలుపులో మీడియా కంటే.. సోషల్ మీడియానే అధిక పాత్ర పోషించింది. అందుకు కారణం.. అప్పటి అధికార, ప్రతిపక్షాల చేతుల్లోనే మీడియా చానెల్స్, పేపర్లు మొత్తం ఉండడం. ఆ సమయంలో ఆయన ఈ పరిస్థితిని పార్టీ మీటింగ్‌లోనూ ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు తన టీవీకే పార్టీ తరఫున కొత్త వార్తా చానెల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. జూన్ 22న ‘వెట్రి న్యూస్’ అనే న్యూస్ చానెల్ సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందట. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. తమిళగ వెట్రి కగళం అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అర్థం. విజయ్ తన పేరులోని విజయాన్ని పార్టీకి పెట్టారు. ఇప్పుడు చానెల్‌కు కూడా వెట్రి(విజయం) అనే ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ప్రముఖ ఇన్ఫ్లున్సెయర్, పొలిటికల్ అనలిస్ట్‌గా పేరుగాంచిన మణికందన్ భాస్కరన్ తన bbtrackermanix ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం ప్రకటించారు. దీంతో టీవీకే వర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మీడియా మధ్య ఉన్న అనుబంధం దేశంలో.. తమిళనాడులో కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా రాజకీయాలు, మీడియా రంగం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలు మీడియా వేదికలను వినియోగించుకోవడం సాధారణంగా మారిపోయింది.తమిళనాడులో అధికార డీఎంకేకు మద్దతుగా భావించే మీడియా సంస్థల్లో ప్రముఖంగా సన్ టీవీ గ్రూప్ పేరు వినిపిస్తుంది. డీఎంకే తొలి కుటుంబంతో సన్ గ్రూప్‌కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అనుబంధంగా జయ టీవీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానెల్ కీలక పాత్ర పోషించింది. అలాగే విజయ్‌కాంత్ పార్టీ కోసం కెప్టెన్ అనే ఓ చానెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతెందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) నేత టీవీవీ దినకరన్‌కు అనుకూలంగా జయా న్యూస్, ఇతర మీడియా వేదికలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అధికారాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా తన ముద్ర వేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ సందేశాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘వెట్రి న్యూస్’ వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ పూర్తిస్థాయి వార్తా సంస్థగా పనిచేస్తుందా? లేదంటే పార్టీ అనుకూల వేదికగా నిలుస్తుందా? అన్నది ప్రారంభం తర్వాతే స్పష్టత రానుంది. వెట్రి న్యూస్ చానెల్ యాజమాని ఎవరు?.. దాని వెనుక ఏ సంస్థ అయినా స్పాన్సర్షిప్ ఉండనుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్‌కు అత్యంత ఆప్తుడైన ఓ వ్యాపారవేత్త ఈ చానెల్‌ను టేకప్ చేస్తారని.. డీఎంకే హయాంలో వివాదాస్పదుడిగా పేరుగాంచిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ ఆ చానెల్‌ను హ్యాండిల్ చేయబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ విభాగాల కోసం జర్నలిస్టులు, వీడియోగ్రాఫర్లు, జిల్లా రిపోర్టర్లు, న్యూస్ ఎడిటర్లు తదితర పోస్టులకు నియామక ప్రకటనలు కూడా వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇటు ఛానెల్ ప్రారంభంపై తమిళగ వెట్రి కళగం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. -
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్‌కు సమర్పించాయి.తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.కనిమొళి, ఉదయనిధి: ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.సోఫా మోడల్ ప్రభుత్వం.. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశి్నస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకు? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్‌లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు. -
రాజకీయాల్లోకి లారెన్స్.. కీలక ప్రకటన
ప్రముఖ నటుడు రాఘవా లారెన్స్ ఎట్టకేలకు ఊహాగానాలపై స్పందించారు. గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని.. ఫలానా పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఇంకొంత కాలం సస్పెన్స్‌ను కొనసాగించాలనే ఆయన నిర్ణయించారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేదానిని లారెన్స్ ప్రశ్నార్థకంగా వదిలేశారు. ఈ అంశాన్ని ప్రజలే నిర్ణయించాలంటూ ఎక్స్ ఖాతాలో తాజాగా ఆయనో వీడియో రిలీజ్ చేశారు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడైన లారెన్స్.. అటు సమాజ సేవతోనూ మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై కుతూహలం నెలకొంది. ఈ ప్రచారం స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని.. పదవి కోసమో లేదంటే డబ్బు కోసం రాజకీయాలను ఆశ్రయించడం లేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. అయితే తనకు నమ్మకమైన, సన్నిహిత వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. అతనికి అండగా నిలిచి, వ్యక్తిగతంగా చేస్తున్న సమాజ సేవను మరింత పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచన మాత్రమే తనకు ఉందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలపై తానే ఓ కీలక ప్రకటన చేస్తానని లారెన్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అయితే దర్శక దిగ్గజం భారతీరాజా మృతితో ఆ ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో ఓ వీడియో రిలీజ్ చేశారిప్పుడు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని, లేకుంటే లేదని తేల్చేశారు. ప్రజాశీర్వాదంతోనే.. తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన కామెంట్ సెక్షన్లో పలువురు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఆయన ట్వీట్ సారాంశం.. Do your duty sincerely, without expecting anything in return.After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026ఫలితాలపై ఆశలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు 'వద్దు' అంటే నేను రాజకీయాల్లోకి రాను.. సమాజ సేవనే కొనసాగిస్తాను. 'అవును' అంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు, ఎవరితో కలిసి నా రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందో త్వరలో వెల్లడిస్తాను.అయితే.. లారెన్స్ కేవలం నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాతగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చిన్న డ్యాన్సర్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. నటుడిగా, తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. అనంతరం హీరోగా మారి ముని, కాంచన, కాంచన-2, కాంచన-3 వంటి హారర్-కామెడీ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా కాంచన సిరీస్‌తో దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తల్లి పేరిట దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లారెన్స్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే లారెన్స్ సేవా కార్యక్రమాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. దీంతో లారెన్స్ టీవీకే పార్టీలో చేరతారని, విజయ్ రాజీనామాతో(రెండింటిలో ఒకటి రాజీనామా చేయాల్సిన పరిస్థితిలో) ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీవీకే పార్టీ ఇప్పటిదాకా ఓ స్పష్టమైన ప్రకటన చేయలేదు. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారుసమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. -
'భారతీ రాజా మరణం.. రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం'
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్‌లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. Hi everyone, I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026 -
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్‌ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్‌ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్‌లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
-
ప్రజ్ఞానంద తో చెస్ ఆడిన CM విజయ్
-
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్‌కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్‌కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్‌పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
తొలి క్యాబినేట్ భేటీలోనే దుమ్మురేగొట్టిన విజయ్
చైన్నై: తమిళనాడు సీఎం విజయ్ తొలి క్యాబినేట్ భేటీలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో నిధుల లీకేజీలు, అనధికారిక వసూళ్లు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. టాస్మాక్ కార్యకలాపాల ద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 102 కోట్లు అనధికారికంగా "పార్టీ ఫండ్" రూపంలో పక్కదారి పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి విజయ్‌కు అధికారులు వివరించారు. గత ఐదేళ్లలో దాదాపు రూ.1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్లించబడ్డాయని అంచనా వేస్తున్నారు. దీంతో టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌లలో చాలా కాలంగా నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ విషయమై తమిళనాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ " అవినీతి ద్వారా వచ్చే ఆదాయం మా ప్రభుత్వానికి అవసరం లేదు. లీకేజీలను వెంటనే అరికట్టండి, ప్రజల సొమ్మును తిరిగి ఖజానాకు చేర్చండి." అని మంత్రికి చెప్పినట్లు తెలిపారు. ఒక సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సాధారణ మద్యం కేస్‌పై దాదాపు రూ. 90, బీర్ కేస్‌పై దాదాపు రూ. 40, మరియు వైన్ కేస్‌పై రూ. 20 చొప్పున రాజకీయ లేదా మంత్రిత్వ నిధుల కోసం అనధికారికంగా వసూలు చేసి మళ్లించేవారని తెలుస్తోంది. ఈ వసూళ్లు వేర్‌హౌస్‌లు, రవాణా, రిటైల్ దుకాణాల వ్యాప్తంగా జరిగేవని అధికారులు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 88 లక్షల మంది వినియోగదారులు టాస్మాక్ ద్వారా మద్యం కొనుగోలు చేస్తుండగా.. నెలకు కనీసం రూ. 102 కోట్లు అనధికారిక మార్గాల్లోకి వెళ్తున్నట్లు అంతర్గత అంచనాలు చెప్తున్నాయి.ఈ బాటిల్ రిటర్న్ వసూళ్లలో జరుగుతున్న అక్రమాల వల్ల మాత్రమే ప్రతి నెలా దాదాపు రూ. 300 కోట్ల అవినీతి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లీకేజీలను అరికట్టడానికి ఆ రూ. 10 డిపాజిట్‌ను నేరుగా ఎమ్ఆర్పీ ధరలోనే కలపడం లేదా డిజిటల్ రీఫండ్ విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూన్ చివరి నాటికి ఖాళీ బాటిళ్ల సేకరణ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని మంత్రి విఘ్నేష్ స్పష్టం చేశారు.717 టాస్మాక్ దుకాణాల మూసివేతముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో రాష్ట్రవ్యాప్తంగా 717 టాస్మాక్ రిటైల్ దుకాణాలను మూసివేయడం ఒకటి. ఈ షాపులను మూసివేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ. 8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆదాయం తగ్గినప్పటికీ, ఆ నష్టాన్ని పూడ్చడానికి మద్యం ధరలను పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్‌కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
దూసుకుపోతున్న అన్నామలై కొత్త ఉద్యమం.. అంతా జెన్ Z మాయ
బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్‌లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్‌గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్సైట్లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.జెన్ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.వైఖరిని చెప్పేసిన ప్రసంగం ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.జాతీయవాదం+తమిళ గుర్తింపు అన్నామలై టీమ్‌లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.విజయ్‌కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్సైట్లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్ తెలిపాయి.తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది. -
నా గర్భస్రావానికి సీఎం విజయ్ నే కారణం
-
విజయ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సీఎం అయినా తీరని కష్టాలు
-
డీఎంకే అవుట్.. టీవీకే ఇన్: రౌత్ వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ సందర్భంగా రౌత్.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది. -
విజయ్ చివరి సినిమా.. రిలీజ్ కానట్లేనా?
విజయ్ ముఖ్యమంత్రి కాకముందు నటించిన చివరి చిత్రం జననాయకన్. పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమిత బైజు కీలక పాత్రను పోషించారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీ ఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం జననాయకన్. ఈ చిత్రం జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల కాలేదు. కారణాలేమైనా ఆ చిత్రం చిక్కు ముడి వీడలేదు. విజయ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో జననాయకన్ చిత్రానికి మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. చిత్ర నిర్మాత కూడా జననాయకన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు సరికదా, చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ సంస్థ చిత్ర ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సమస్య మరింత జటిలమైంది. మరోపక్క జననాయకన్ చిత్రం వ్యవహారంలో ముఖ్యమంత్రి విజయ్‌ని మౌనం పాటించాల్సిదిగా కేంద్ర ప్రభుత్వం ఆ దేశించిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లలో నిర్లిప్తత నెల కొంది. ఈ విషయం ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లిందని, ఆయన డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకున్న అడ్వాన్న్స్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరుస్తుందా ? ఇక జననాయకన్ను తెరపై చూసే అవకా శం లేదా ? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జననాయకన్ చిత్రానికి దారేది అనే ప్రశ్న ఎదురవుతోంది. -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
సీఎం విజయ్ తొలి కేబినెట్ మీటింగ్
-
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్‌తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక!
తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.ఇక సీఎం విజయ్ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్‌ను విజయ్‌కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్‌కు గుడ్‌న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
తమిళనాట భారీ ట్విస్ట్.. విజయ్, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్మీట్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎం విజయ్‌పై ఘాటు వ్యాఖ్యలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్‌స్ట్రాగామ్, రీల్స్‌లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.సొంత ఆలోచన లేదుప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్‌కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్‌కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు. -
విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!
సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం విజయ్ తిరుచ్చి పర్యటనలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ ఎ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలోని అన్నా అరివాలయ మంగళవారం పార్టీ సీనియర్‌నేత ఆర్ఎస్ భారతీతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి విజయ్ వైఖరిని, పరిపాలనా పరిణితిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చూస్తే విచారంగా, అలసటతో, తడబాటుగా, నిస్సహాయతతో కనిపించే సీఎం విజయ్.. తిరుచ్చి సభకు వెళ్లేసరికి అంత ఉత్సాహంగా, వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలిగారు? ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు?‘ అని రాజా ప్రశ్నించారు. మోదీ ముందు ఎందుకు నోరు విప్పలేదు: తాను కూర్చున్న సీఎం పదవికి తగినట్లు కాకుండా, తన స్థాయిని తగ్గించుకుని విజయ్ సినిమా డైలాగులు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు కేవలం 10 నిమిషాలే కదా సమయం ఇచ్చారు... ’విజయ్ బ్రో’.. అప్పుడు ప్రధాని ముందు మీ శౌర్యం ఏమైంది?, అక్కడ ఎందుకు మాట్లాడకుండా వచ్చారు?, వచ్చాక కనీసం ప్రెస్‌మీట్ కూడా పెట్టకుండా ఎందుకు వెళ్లిపోయారు? అని రాజా నిలదీశారు. పాలనపై అవగాహన లేదు రైతుల సమస్యలు, ఎన్నికల మేనిఫెస్టోపై విజయ్ ప్రభుత్వాన్ని రాజా తప్పుపట్టారు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలు లేకుండా పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదన్న కనీసం ఈ ప్రాథమిక విషయం కూడా తెలియకుండానే 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారా? అని ప్రశ్నించారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఈ విషయాల్లో టీవీకే ప్రభుత్వం తన స్టాండ్ ఏంటో చెప్పడం లేదని మండి పడ్డారు.స్టాలిన్ సీఎంగా ఉన్నంత వరకే మేఘదాతు సమస్య, విజయ్ ఒక లెక్కే కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ అంటుంటే.. దానికి తమరి ప్రభుత్వం ఎందుకు బదులివ్వడం లేదు? అని ప్రశ్నించారు.నిద్ర పట్టడం లేదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే ఇప్పటికీ స్టాలిన్ కారణం అంటున్నారని మండి పడ్డారు. విజయ్ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది, రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. మనం అసలు ఎటు వైపు వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు, డీఎంకే ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని హితవు పలికారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటమి ఊహాగానాలపై స్పందిస్తూ, పార్టీలోని రెండు, మూడో శ్రేణి నాయకులు ఏవైనా మాట్లాడి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కానీ తమ పార్టీ అధినేత తుది నిర్ణయం ఏంటి? తాము అధికారికంగా ఎగ్జిక్యూటివ్ లేదా జనరల్ కౌన్సిల్ సమావేశాలు పెట్టి తీర్మానాలు చేశామా? లేదు కదా‘ అని స్పష్టం చేశారు. వీసీకే తిరుమాపై అమితమైన ప్రేమ ఉందని, ప్రేమ ఉన్నచోటే కోపం వస్తుంది. కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులపై తమకు అంతగా కోపం రాదు. ఇది కేవలం ఒకే కూటమిలోని సోదరుల మధ్య వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదం మాత్రమే. ఇది శాశ్వతం కాదు అని ఆ. రాజా తేల్చిచెప్పారు. -
విజయ్‌కు గట్టి పోటీ! అతడి ఎంట్రీతో సంచలనం తప్పదా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీజేపీకి అన్నామలై గుడ్‌బై చెప్పారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, డీఎంకే–అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలు ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.డీఎంకే–అన్నాడీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్‌గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ముఖ్యంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం విజయ్ నాయకత్వం ఒకవైపు చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్న అన్నామలై పేరు మరింత బలంగా వినిపిస్తోంది.అన్నామలై బీజేపీని వీడుతున్నారన్న వార్తలను కేవలం సంస్థాగత మార్పుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్, ప్రత్యక్ష విమర్శల ధోరణి ఆయనను తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముఖంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించకపోయినా, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆకర్షణను పూర్తిగా తక్కువ అంచనా వేయలేమన్న చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ ఆయన్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.ఇక సీఎం విజయ్ విషయానికి వస్తే.. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ నిర్మాణ బలం, అనుభవం వంటి అంశాల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోటును ప్రత్యర్థులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే భవిష్యత్ రాజకీయ సమీకరణాన్ని నిర్ణయించనుంది.ఈ నేపథ్యంలో అన్నామలై పాత్రపై చర్చ మరింత కీలకంగా మారింది. ఆయన బీజేపీలోనే కొనసాగి పార్టీని బలోపేతం చేస్తారా? లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే కూటములకు ప్రత్యక్ష సవాల్‌గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాలకంటే కూడా ఆయనకు ఉన్న ఇమేజ్, యువతలో ప్రభావం ఆయనను ఒక “పొలిటికల్ ఫోర్స్”గా చూస్తున్న వాదన బలపడుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో “సీఎం విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ సవాలుగా ఎవరు ఎదుగుతారు?” అనే ప్రశ్నే తమిళనాట కీలకంగా మారింది. ఈ కోణంలో చూస్తే అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి తమిళ రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. ఒకవైపు సీఎం విజయ్ కొత్త ప్రభుత్వం, మరోవైపు డీఎంకే–అన్నాడీఎంకే సంప్రదాయ ప్రతిపక్ష బలాలు, మధ్యలో అన్నామలై వంటి కొత్త ముఖం రాజకీయ సమీకరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాట అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అన్నదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
బ్లాక్ అండ్ వైట్ సూట్ అందుకే: ఎం విజయ్
తిరుచ్చి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నలుపు-తెలుపు సూట్‌లోనే కనబడుతున్నారు జోసఫ్ విజయ్. ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వస్త్రధారణకు భిన్నంగా మోడ్రన్‌గా కనిపించడంతో జనమంతా ఆసక్తికరంగా ఆయనను గమనిస్తున్నారు. సీఎం విజయ్ వస్త్రధారణపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. కొంతమంది నాయకులు విజయ్ వస్త్రధారణపై విమర్శలు కూడా చేశారు. తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.తిరుచ్చి సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోట్ సూట్ వేసుకోవడం పైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు, మనం సూటుకోటు వేసుకోకూడదా? కేవలం అణచివేసే శక్తులు, అధికారం చెలాయించే వారే సూటుకోటు వేసుకోవాలా? అయినా నేనేమైనా రంగురంగుల సూట్లు వేసుకుంటున్నానా? నా మనసు లాగే కేవలం రెండు రంగులు.. నలుపు, తెలుపు మాత్రమే ధరిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారికి ఒకటే విన్నపం.. దయచేసి మీ విమర్శలు ఆపకండి. అవే నాకు మరింత శక్తినిస్తాయి. మీరు విమర్శలు చేస్తూనే ఉండండి, నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలు తన ఎదుగులకు దోహదపడతాయన్నారు.ఇప్పుడు వార్తలు చూస్తున్నారుఇదివరకు కాలక్షేపం కోసం సోషల్ మీడియాలో ‘రీల్స్’ చూసే జెనరేషన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూస్ ఛానళ్లు చూస్తోందని విజయ్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ‘జెన్–జీ’ ఆసక్తి కనబరుస్తోందన్నారు. వారి కోసం ప్రతిపక్షాలు తమ ప్రెస్నోట్లను తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతోందని, వారిని తక్కువ చేసి చూడొద్దని విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారని చెప్పారు.#WATCH | “ஏன் நம்ம கோட் சூட் எல்லாம் போடக் கூடாதா?”திருச்சியில் முதலமைச்சர் விஜய் பேச்சு#SunNews | #TVKVijay | #Trichy pic.twitter.com/27QCiWxJx9— Sun News (@sunnewstamil) June 1, 2026 -
డీఎంకే గుర్తుపై పోటీ చేయడం దురదృష్టకరం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల విజయం అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ డీఎంకే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే ఎంపీ దురై వైకో స్వయంగా పలకడం చర్చకు దారి తీసింది. అంతే కాదు, డీఎంకే చిహ్నంపై తాము పోటీ చేయడం దురదృష్టకరం అని ఆవేదనతో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్‌కు తిరుచ్చి లోక్‌సభ సభ్యుడైన దురై వైకో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.విజయ్ సీఎం అయిన తర్వాత ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోను నేరుగా కలిసి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దురై వైకో వరుసగా విజయ్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సీఎం విజయ్‌కు ఆహా్వనం పలికినానంతరం దురై వైకో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ గారు తొలిసారి తిరుచ్చి వచ్చారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ఎంపీగా ఆయనకు స్వాగతం పలకడం నా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిని అధికారికంగా కలిసి తిరుచ్చి లోక్‌సభ పరిధిలోని పెండింగ్ డిమాండ్లపై వినతిపత్రం సమరి్పస్తానని పేర్కొన్నారు. అలాగే, తిరుచ్చి ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణకు కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిశానని తెలిపారు. సాంకేతిక కారణాల వల్లే.. పొత్తులు, అసెంబ్లీ సమీకరణాలపై చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ ఎండీఎంకే ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన ఉదయసూర్యుడు గుర్తుపై పోటీ చేసి గెలిచారన్నారు. ఆ సాంకేతిక కారణం వల్లే ఈరోజు తాము అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి నేరుగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే, గతంలో తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు వంటి ఇతర ప్రజాస్వామ్య శక్తులు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పారీ్టగా గెలిపించారని, ఆ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలన్నారు. భవిష్యత్తులో ఎండీఎంకే ఏ కూటమిలో ఉండాలో అన్న విషయంగా జూన్ 27వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
తిరుచ్చి ప్రాణసమానం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ పెరంబదూరు, తిరుచ్చి ఈస్ట్లలో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం చైన్నె నుంచి తిరుచ్చికి వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఎం విజయ్‌కు అధికారులు, టీవీకే ముఖ్య నేతలు, మంత్రలు ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి సభ జరిగే జోసెఫ్ కాలేజీ మైదానం వరకు 10 కిలోమీటర్ల మేర ప్రజలు, టీవీకే శ్రేణులు బ్రహ్మాండమైన రోడ్ షోతో సీఎం విజయ్‌కు స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ఎంపిక చేసిన 5 వేల మందిని ఈ సభకు అనుమతించారు. అయినప్పటికీ ఆ సంఖ్యను దాటిమహిళలు తరలి రావడం విశేషం. సభలో మంత్రులు ఆనంద్, రమేష్, రాజ్ మోహన్, మాజీ మంత్రి కు.ప.కృష్ణన్ ప్రసంగించారు. చివరగా సీఎం విజయ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆవేశ పూరితంగా తనదైన శైలిలో ప్రసంగించారు.ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అంశాలను నమ్మొద్దు..ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనడానికి తాను ప్రయత్నిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను సీఎం విజయ్ పూర్తిగా కొట్టిపారేశారు. తాను భేరసారాలకు పాల్పడుతున్నానని.. కొందరు పనిగట్టుకుని తప్పుడు కథలు అల్లుతున్నారని మండి పడ్డారు. నిజానికి ఒక తీరని శక్తి (డీఎంకే), తీరిపోయిన శక్తి (అన్నాడీఎంకే) కలిసి, దొడ్డి దారిలో అధికారం కోసం భేరసారాలు సాగించి, కూటమి కట్టి మళ్లీ అధికారాన్ని దోచుకోవాలని కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎందుకంటే, త్వరితగతిన టీవీకే పూర్తిస్థాయి మెజారిటీతో స్థిరపడితే పప్పులు ఉడకవని వారి భయం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో 50, 60 ఏళ్లుగా ఉన్న కులం, మతం, డబ్బు పంపిణీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. టీవీకేకు పూర్తి స్థాయిలో మరి కొంత మెజారిటీ ఇచ్చి ఉండే బాగుండేదని ఈసందర్భంగా మైనారిటీ అన్న అంశంపై వ్యాఖ్యలు చేశారు.స్టాలిన్ వర్సెస్ విజయ్..తమిళనాడు భవిష్యత్తు ఎటువైపు అనేది తేలిపోయిందంటూ ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చిన ఈ విజయ్ వైపా? లేదా మన ప్రజా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్న స్టాలిన్ వైపా? అనేది స్పష్టమైందన్నారు. డీఎంకే తమను ఎంత అవమానిస్తే తమకు అంత మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నివారాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం విజయ్ ఈసందర్భంగా గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు. ఇందులో మొదటి 100 యూనిట్లు ఉచితం అన్న పథకం డీఎంకే ఇచ్చింది కాదని, గతంలో దివంగత సీఎం జయలలిత ఇచ్చిన పథకం అని గుర్తు చేశారు. దానికి అదనంగా మరో 100 యూనిట్లు కలిపి 200 యూనిట్లు తాము చేశామన్నారు. మహిళలకు, కుటుంబాలకు శాపంగా మారిన టాస్మాక్ మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేస్తున్నామన్నారు. అలాగే రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ రుణాలను వీలైనంత మేరకు మాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అగాథంలోకి నెట్టి, అన్ని తలుపులు మూసేసి వెళ్లిందిదని, దాన్ని చక్కదిద్దడానికి సమయం పడుతుందన్నారు.శాంతిభద్రతలపై స్పందనరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్న ఆరోపణలపై సీఎం స్పందిస్తూ.. ‘గత స్టాలిన్ మోడల్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి వీధికి, ఊరికి గంజాయి, డ్రగ్స్ సంస్కృతిని వ్యాపింపజేశారన్నారు. దాన్ని అప్పుడే అణచివేసి ఉంటే, ఈరోజు మహిళలపై ఇన్ని నేరాలు జరిగేవి కావు అని పేర్కొన్నారు. పాపాలన్నీ వారు చేసి, ఇప్పుడు పగటి వేషాలు వేస్తూ నిందలు తన మీద వేస్తున్నారన్నారు. మహిళల భద్రత కోసం ’సింగపెన్’ వంటి బలమైన విభాగాలను బలోపేతం చేశామని, సమర్థులైన పోలీస్ అధికారులను నియమించామని స్పష్టం చేశారు.చివరగా, తాను ఇచ్చిన మాట ప్రకారం అవినీతి, లంచం లేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని, ద్రవిడ సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, రాష్ట్ర హక్కులు, నదీ జలాల హక్కులు, లౌకికవాద విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో స్థానిక నియోజకవర్గం కుటుంబం నుంచే ఒకరిని అభ్యర్థిగా నిలబెడతానని, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన తిరుచ్చి ప్రజలను కోరారు. -
సీఎం విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ రహస్యం బయట పడింది
సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్‌ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
నన్ను గెలవలేవ్ అన్నారు సీఎంగా మీ ముందుకొచ్చా
-
విజయ్ ర్యాలీకి పోటెత్తిన జనం
-
సీఎం విజయ్ లేటెస్ట్ విజువల్స్
-
40 మంది ఐఏఎస్‌ల బదిలీ
తిరువొత్తియూరు: తమిళనాడు ప్రభుత్వం 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, చెన్నై కలె క్టర్‌తో సహా మరికొంతమంది ఐఏఎస్ అధికారుల ను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు.. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కిర్లోష్ కుమార్, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సామాజిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ శరణ్య అరి, పెరంబలూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. పెరంబలూరు జిల్లా కలెక్టర్ మృణాళిని, అరియలూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. చెంగల్పట్టు జిల్లా మాజీ కలెక్టర్ మాలతి హెలెన్, చెన్నై జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. కో యంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివగురు ప్రభాకరన్, రామనాథపురం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. కవిత, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్)గా బదిలీ అయ్యారు. ప్రభుత్వ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ వీరప్రతాప్ సింగ్, తిరుచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవరాజ్ కుమార్, మదురై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ డిప్యూటీ కమిషనర్ (నార్త్) కట్టా రవి తేజ, కోయంబత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. -
అవినీతికి సింహస్వప్నం.. ‘లేడీ సింగం’ చిత్రా బదిలీ
సాక్షి, చెన్నై: మదురై నగర పాలక సంస్థ (కార్పొరేషన్) చరిత్రలో అత్యంత నిజాయితీ కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్న కమిషనర్ చిత్రా బదిలీ అయ్యారు. కార్పొరేషన్లో భారీ స్థాయిలో జరిగిన ఆస్తి పన్ను (ప్రాపర్టీ టాక్స్) కుంభకోణాన్ని వెలికితీసి, అసిస్టెంట్ కమిషనర్ నుండి బిల్ కలెక్టర్ల వరకు ఏకంగా 28 మంది సిబ్బందిని సస్పెండ్ చేసి సంచలనం సృష్టించిన ఆమెను ప్రభుత్వం బదిలీ చేయడంతో మదురై వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చెన్నై కార్పొరేషన్ నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. అవినీతిపై ’చిత్రా’స్త్రం.. మదురై కార్పొరేషన్‌కు 71వ కమిషనర్‌గా, అలాగే తొలి మహిళా కమిషనర్‌గా చిత్రా 2025 ఫిబ్రవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె వచ్చే నాటికి కార్పొరేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అంతకుముందు 2021 నుండి 2025 వరకు కేవలం నాలుగేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారారంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన చిత్రా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే కార్పొరేషన్ రూపురేఖలను మార్చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితమైన ఆస్తి పన్ను అవినీతిపై గట్టి నిఘా పెట్టి, నిరూపించడమే కాకుండా పోలీసు విచారణకు ఆదేశించారు. ఈ విప్లవాత్మక చర్యే చివరకు మదురై మేయర్, ఐదుగురు జోనల్ చైర్మన్ల పదవులు ఊడిపోవడానికి ముఖ్య కారణమైంది. కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం కమిషనర్ చిత్రా తనదైన శైలిలో సంస్కరణలు చేపట్టారు. మదురై ప్రగతికి బాట వేయడమే కాకుండా పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచే కార్యక్రమాలు విస్తృతం చేసిన చిత్రాను కొత్త ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వంలో భాగంగా మదురై నుండి చెన్నైకు స్థాన చలనం కల్పించారు. అయితే, మదురై వాసులు ఈ బదిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. -
అన్నామలై కొత్త పార్టీ?
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్దఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారి తీసింది. అయితే, తమిళనాడులో బీజేపి బలోపేతానికి కృషి చేసి అన్నామలైను అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ, ఆయనకు ఇంత వరకు బీజేపీలో గానీ, కేంద్రంలోని ఎలాంటి పదవీ అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సైత దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ‘మా నాయకుడా. ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరమంతటా అన్నామలైకు మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు.. ‘మా నాయకా, ముందుకొచ్చి నాయకత్వం వహించండి..రా.. నాయకత్వం వహించు‘ అనే నినాదాలను ముద్రించడం చర్చకు దారి తీసింది.BIG NEWS - Annamalai to launch People’s Movement in Tamil Nadu.It won't be a political party. He will enrol like-minded people and build a strong volunteer base as per reports.Your thoughts?pic.twitter.com/eekuEIb1rK— News Algebra (@NewsAlgebraIND) May 31, 2026 -
విజయ్‌ని అడిగితే.. డిప్యూటీ సీఎం ఇచ్చేవారు: ప్రేమలత
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పళనిస్వామి తీరుపై ఫైర్2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫస్ట్ టైమ్ ప్రజల్లోకి విజయ్.. రేపు తిరుచ్చిలో పర్యటన
సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు. చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్‌లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. -
విజయ్‌కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్‌పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. -
REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే
-
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్‌లోనే చదువుకున్నారు. విజయ్‌కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్‌ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తమిళనాడు కాంగ్రెస్‌లో భారీ ట్విస్ట్..
సాక్షి, చైన్నె: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు కాంగ్రెస్(టీఎన్‌సీసీ)లో రచ్చకెక్కింది. ఎన్నికలలో సీట్ల కేటాయింపులో భారీ స్కాం జరిగినట్టుగా ఆమె కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే ప్రారంభం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు చోట్ల మాత్రమే గెలిచింది. కూటమితో సీట్ల పందేరం అన్నది పెద్ద వివాదం నడుమే జరిగింది. డీఎంకే అధికారం కోల్పోవడంతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పక్షాన కాంగ్రెస్ చేరింది. ఈ కేబినెట్లో రెండు మంత్రి పదవులు సైతం దక్కించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఎంపీ జ్యోతిమణి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. ఆమె ఎక్స్ పేజీలో అన్ని వివరాలను ప్రకటించారు.కమిటీ ఏర్పాటుపై అభ్యంతరం.. టికెట్ల కేటాయింపుపై అసలు విచారణ జరపకుండా, కేవలం ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే విచారించడానికి కమిటీని వేయడం అనేది తప్పు చేసిన వారిని కాపాడడానికి చేసిన ఏర్పాటు మాత్రమేనని ధ్వజమెత్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలోనే జరిగిందని, ఆ కమిటీపై ఉన్న ఆరోపణలను కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాత్రమే విచారించగలదన్నారు.సర్వేల పేరిట భారీ అవినీతిఅసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని వివరించారు. ముందే కొందరు అభ్యర్థులను ఖరారు చేసి, ఆ తర్వాత వారికి అనుకూలమైన నియోజకవర్గాలను కూటమి నుంచి అడిగి తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సర్వేల పేరుతో పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని, గెలిచే అవకాశం ఉన్న నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారని వివరించారు. కొత్తవారికి, అసలు గెలుపు అవకాశాలు లేని చాలామందికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది పార్టీని వీడారని, ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? దేని ఆధారంగా ఇచ్చారు? తప్పు చేసిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు.పార్టీ సంస్కరణల కోసం పిలుపు ఈ దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ నుంచి కాపాడాల్సిన చారిత్రక బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతున్నారని పేర్కొంటూ, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఇలాంటి తప్పులు క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయని, చాలాచోట్ల ఇది పార్టీ ఓటమికి కూడా కారణమవుతోందన్నారు. అయితే, విచారణ జరపడానికి బదులు తప్పు చేసిన వారిని కాపాడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు అభ్యర్థుల ఎంపికను తాను చాలా దగ్గర నుంచి చూశానని, ఇంత బహిరంగంగా తప్పులు జరగడం పార్టీ భవిష్యత్తుకు పెద్ద మైనస్ అవుతుందని హెచ్చరించారు. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి గెలవాలంటే జిల్లా, ప్రాంతీయ స్థాయి నాయకుల, కార్యకర్తల గళానికి విలువ ఇవ్వాలని సూచించారు. పార్టీ పారదర్శకంగా పనిచేయాలని, అందువల్ల కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికల సంస్కరణలు తమిళనాడు నుంచే మొదలవ్వాలని కోరారు. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థుల ఎంపికపై జోతిమణి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడడం చర్చకు దారి తీసింది. -
సీఎం విజయ్ టీమ్‌లోకి పవర్ఫుల్ పోలీస్ బాస్..!
సాక్షి, చెన్నై: తమిళనాడు పోలీస్ విభాగానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం కొత్త డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను, ఇప్పటివరకు తమిళనాడు డీజీపీగా ఉన్న సందీప్‌రాయ్ రాథోడ్ స్థానంలో నియమించారు. క్లీన్ ఇమేజ్ అధికారి మహేష్కుమార్అగర్వాల్ తమిళనాడు పోలీస్ సర్వీసులో ఎంతో అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ అధికారి. ఆయన 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. స్వస్థలం పంజాబ్ రాష్ట్రం. తండ్రి లాయర్ కావడంతో ఆయన కూడా లా చదివారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో తేని, తూత్తుకుడి జిల్లాల ఎస్పీగా, చెన్నై బ్రాడ్ వే డిప్యూటీ కమిషనర్‌గా, చెన్నై ట్రాఫిక్ సౌత్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. సీబీఐలో సేవలు డెప్యుటేషన్‌పై తన సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు వెళ్లి, అక్కడ ఏడేళ్లు సీబీఐ అధికారిగా పనిచేశారు. పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో పనిచేశారు. ఐజీగా పదోన్నతి పొందినానంతరం తమిళనాడుకు తిరిగివచ్చిన ఆయన సీబీసీఐడీలో పనిచేశారు. తర్వాత మదురై పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నై సౌత్ జోన్ అడిషనల్ కమిషనర్‌గా, ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీపీగా పనిచేశారు. 2020లో చెన్నైకి అత్యంత పిన్న వయసు్కడైన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి అప్పట్లో రికార్డు సృష్టించారు. -
రీల్స్‌తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కొత్త తరం మంత్రులు
సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంచుకున్న సరికొత్త డిజిటల్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, త్వరితగతిన లభించే అనుమతులపై ఆమె ఇన్‌స్ట్రాగామ్ ’రీల్స్’ రూపంలో ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై నెటిజన్ల నుండి ఒకవైపు భారీగా ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని రీల్స్ , డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల వేదికగా ఆకర్షించిందన్నది జగమెరిగిన సత్యం. తాజాగా అధికారంలోకి వచ్చినానంతరం కూడా రీల్స్ హోరెతుత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మంత్రి మంత్రి కీర్తన తన రీల్స్ వీడియోలో ‘తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు.. ఆ భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఫైళ్లు , అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండే పాత పద్ధతులను ఎవరూ ఇష్టపడరు. ఆ లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థను వేగవంతం చేయడానికే సీఎం విజయ్ తనను ఈ స్థానంలో నియమించారు’ అని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం 21 రోజుల్లోనే అత్యంత వేగంగా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ప్రకటలించారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడులో పెట్టు బడులు పెట్టండి‘ అని ఆమె ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే ’రీల్స్’ , చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజలను ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న కీర్తన, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అదే సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా యువతను, ఆధునిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో మంత్రి రీల్స్ చేయడం అభినందనీయమని, ఇది పారదర్శకతను పెంచుతుందని ఒక వర్గం మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ , దేశీయ దిగ్గజ సంస్థల నుండి కోట్లాది రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక సమావేశాలు కాకుండా, ఇలా ’రీల్స్’ ద్వారా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను తగ్గిస్తుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక మంత్రి పారిశ్రామిక విధానాలను వివరించడానికి రీల్స్ రూపంలో ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపినట్లైంది. View this post on Instagram A post shared by Virudhai Magal Keerthana (@virudhai_magal_keerthana) -
టీవీకేలో చేరుతారా? లేక రాజకీయాలకు విరామమా?
సాక్షి, చెన్నై: ప్రస్తుత రాజకీయ పరిణామాలు? మనం ఏం చేయాలి? అనే విషయాలపై తనకు ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, భావాలను అడిగి తెలుసుకుంటున్నానని అన్నాడీఎంకే సీనియర్ నేత సీ విజయ భాస్కర్ ప్రకటించారు. వారి నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయ భవిష్యత్తుపై తన తదుపరి అడుగు ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పుదుక్కోట్టై జిల్లా విరాలిమలైలోని తన నివాసంలో విజయభాస్కర్ గురువారం తన ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పళనిస్వామితో రాజీపై అసంతృప్తి? పార్టీ మరింత బలహీనపడకుండా చూసేందుకు బుధవారం తిరుగుబాటు వర్గానికి చెందిన కీలక నేతలు ఎస్.పి. వేలుమణి నేతృత్వంలో పలువురు నేతలు చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని పళనిస్వామి నివాసానికి వెళ్లి రాయబార చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఇరు వర్గాలు సచివాలయానికి వెళ్లి, పరస్పరం ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత వేటు లేఖలను ఉపసంహరించుకున్నారు. అలాగే అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని, విప్‌గా అగ్రి కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్లు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు లేఖలు అందించారు.అయితే, ఈ రాజీ ప్రక్రియలో సి.వి. షణ్ముగం పాల్గొనలేదు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు , మద్దతు దారులతో మంతనాలలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సి. విజయభాస్కర్ స్పీకర్‌ను కలవడానికి వచ్చినప్పటికీ, పళనిస్వామిని వ్యక్తిగతంగా కలవకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుచరుల ముందు 3 ప్రత్యామ్నాయాలు ఈ నేపథ్యంలోనే విజయభాస్కర్ విరాలిమలైలో తన మద్దతుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్యంగా మూడు ప్రతిపాదనలను అనుచరుల ముందు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అన్నాడీఎంకేలో కొనసాగాలా? లేదా, విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరాలా? లేదా ప్రస్తుతానికి రాజకీయాల నుంచే తప్పుకోవాలా? అన్న మూడు అంశాల ఆధారంగా ఈ మంతనాలు జరుగుతుండటం గమనార్హం. ప్రజల తీర్పు ప్రకారమే నిర్ణయం సమావేశం అనంతరం విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తన తదుపరి అడుగు ఎలా ఉండాలనే దానిపై విజయానికి శ్రమించిన పార్టీ నిర్వాహకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నానని తెలిపారు. తనను గెలిపించిన దేవుళ్లు అయిన నియోజకవర్గ ప్రజల మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. -
చివరకు మిగిలింది రూ.140 మాత్రమే!
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం.. ఎన్నికల్లో ఘన విజయం.. ఆయన చుట్టూ ప్రజాదరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మళ్లీ కదిలిస్తోంది. యువతలో కనిపిస్తున్న మద్దతు, మార్పు కోరుకునే వాతావరణం నేపథ్యంలో ఒక పాత చరిత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కామరాజ్ ఓటమి. ఒకప్పుడు అపార ప్రజాదరణ కలిగిన మహానేత కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సందర్భమది.. కామరాజ్ జీవితం భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. చిన్న వయసులోనే విద్యను వదిలేసినా, ఆయన ప్రజల మధ్యే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. గ్రామాలు, ప్రజల అవసరాలు, సమస్యలు.. ఇవే ఆయన పాలనకు మార్గదర్శకాలు అయ్యాయి. మాటల కంటే పనితోనే రాజకీయాన్ని నడిపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలా ఆయనకు “తమిళనాడులోని ప్రతీ గ్రామాన్ని రెండుసార్లు సందర్శించిన నేత” అనే ముద్ర కూడా ఉంది. 1953–64 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తమిళనాడులో విద్యా విప్లవానికి బాటలు వేశారు. వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, పేదలకు ఉచిత విద్యను విస్తరించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర సామాజిక రూపురేఖలను మార్చేశాయి. గ్రామీణ విద్యుతీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, రవాణా అభివృద్ధి.. ఇవన్నీ ఆయన పాలనలో వేగంగా విస్తరించాయి. రాజకీయంగా కాకుండా పాలనాపరంగా ఆయనను “బిల్డర్ ఆఫ్ తమిళనాడు”గా చూస్తారు.అయితే ఇదే ప్రజాదరణ ఆయనకు రాజకీయ రక్షణ ఇవ్వలేదు. ద్రావిడ రాజకీయాల ఉధృతి, ఐడెంటిటీ పాలిటిక్స్, సినిమా ప్రభావం వంటి అంశాలను ఆయన తక్కువ అంచనా వేశారని విశ్లేషకులు చెబుతారు. డీఎంకే ఎదుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరికి 1967లో తన సొంత ప్రాంతంలోనే ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతే ప్రజల తీర్పుతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పులు, ఇందిరాగాంధీ కొత్త రాజకీయ శైలి, జనాకర్షణ రాజకీయాలు ఆయన ప్రభావాన్ని తగ్గించాయి. చివరికి ఆయన రాజకీయ ప్రయాణం ఒక “మౌన ముగింపు”కు చేరింది.అయితే ఆయన మరణానంతరం ఆయన జీవితం మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. అత్యంత సరళ జీవితం గడిపిన ఆయన వద్ద కేవలం రూ.140 మాత్రమే మిగిలాయి. అదీ ఆయన పడుకునే దిండులో దొరికాయి. ఖాదీ దుస్తులు, కొన్ని పుస్తకాలు, రెండు జతల చెప్పులు.. ఆయన చివరి గుర్తులుగా మిగిలాయి. కానీ ఆయన నిర్మించిన విద్యా వ్యవస్థ, పాలనా మౌలిక వసతులు మాత్రం ఇప్పటికీ తమిళనాడును నడిపిస్తున్నాయి.ఇప్పుడీ చరిత్ర మళ్లీ ఎందుకు గుర్తొస్తోంది అంటే.. తమిళనాడులో విజయ్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చలే కారణం. సినిమా ప్రభావం, యువత ఆకర్షణ, మార్పు.. ఇవి కొత్త రాజకీయ శక్తిగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డబ్బు ప్రభావం తగ్గి, భావోద్వేగ ఓటింగ్ పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తి తండ్రి) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన భావన ఒకటే.. ప్రజల తీర్పును ఎవరూ శాశ్వతంగా అంచనా వేయలేరు. “కామరాజ్ లాంటి మహానేతనే ప్రజలు ఒకప్పుడు ఓడించారు. ఇది ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపించే ఉదాహరణ. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. విజయ్ విజయం నాకు వ్యక్తిగతంగా ఆనందం కలిగిస్తోంది. కానీ చివరికి నిర్ణయం తీసుకునేది ప్రజలే” అని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కనిపించే “నాయకత్వ మార్పుల చక్రాన్ని” మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు కామరాజ్ లాంటి ప్రజా సేవా ప్రతీకలు ఓటమిని ఎదుర్కొన్న చరిత్ర, మరోవైపు కొత్త తరంలో సినీ ప్రభావంతో ఎదుగుతున్న రాజకీయ ఆకర్షణ.. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఇప్పుడు ఒకే చర్చలో కలుస్తున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రజల తీర్పు నిజంగా స్థిరమైన విలువలపై ఆధారపడుతుందా? లేదంటే ప్రతి తరం తన అవసరాలు, భావోద్వేగాలు, ఆశల ప్రకారం కొత్త నాయకులను ఎంచుకుంటుందా? అని. -
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్‌తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్‌కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్‌కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్‌లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
12ఏళ్ల తర్వాత మోదీని కలిసిన CM విజయ్
-
మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు)
-
పవన్‌పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్‌ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్‌గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్‌లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
సూపర్ కాంబో: మోదీ, సురేష్ గోపీలతో విజయ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండాసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యతప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్‌కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్‌లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్‌కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్‌ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్‌పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పారీ్టలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్ బీ? ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్‌కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
విజయ్ సర్కార్‌కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్‌లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్‌ను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్‌కు లేఖ కూడా రాశారు.స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు. -
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
-
అక్కగా సీఎం విజయ్‌ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు. -
విజయ్ సంచలన నిర్ణయం తమిళ్ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్
-
అన్నాడీఎంకే సంక్షోభంలో కీలక మలుపు
అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల అనంతరం పార్టీ లోపల మొదలైన విభేదాలు ఇప్పుడు రాజీ, పునఃసమీకరణల దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో “తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం” అంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన రెబల్ శిబిరం కూడా వెనక్కి తగ్గే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల స్పీకర్‌ను కలిసిన ఈపీఎస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అలాగే టీవీకేలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారడం మొదలైంది. రెబల్ వర్గంలో సంఖ్యా బలం క్రమంగా తగ్గిపోవడం, పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ వైపు మొగ్గు చూపడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది.ఎన్నికల తర్వాత సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ్‌భాస్కర్ నేతృత్వంలో ఏర్పడిన రెబల్ వర్గం మొదట తమ బలం 30 మంది ఎమ్మెల్యేలని ప్రకటించింది. అయితే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలనిరూపణ సమయానికి ఆ సంఖ్య 25కు చేరింది. ఇప్పుడు వరుస పరిణామాల తర్వాత ఆ సంఖ్య 16కి పడిపోయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెబల్ వర్గ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.బలపరీక్ష సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి రెబల్స్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మద్దతుకు ప్రతిఫలంగా కేబినెట్లో కీలక మంత్రి పదవులు దక్కుతాయని ఆ వర్గం ఆశించినట్లు తెలుస్తోంది. కానీ టీవీకే మిత్రపక్షాల అభ్యంతరాలతో అది జరగలేదు. అయితే రాజకీయ ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. భవిష్యత్‌లో పార్టీలో స్థానం, పదవుల పునరుద్ధరణ, రాజకీయ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ శిబిరం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పటికే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈపీఎస్‌కు చేరువవుతున్నారు. మరోవైపు టీవీకే వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికారికంగా విజయ్ శిబిరంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరికి భవిష్యత్ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున అవకాశాలు ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య ఈపీఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట కఠిన వైఖరి తీసుకున్న ఆయన.. ఇప్పుడు రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్స్‌పై చర్యల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా అసంతృప్త వర్గాలను తిరిగి పార్టీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరోసారి ఏకీకృతం కావచ్చన్న చర్చ మొదలైంది.అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీలో 144-22 తేడాతో విజయ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. కాబట్టి రెబల్స్ మద్దతు ఉపసంహరించుకున్నా(మ్యాజిక్ ఫిగర్ 118) ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే… అన్నాడీఎంకేలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతోంది. రెబల్ వర్గం బలహీనపడుతుండగా, ఈపీఎస్ మళ్లీ పార్టీపై పట్టు బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ లెక్కలు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
విజయ్ సర్కార్ ఎఫెక్ట్.. 162 మంది న్యాయవాదుల రాజీనామా
సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విభాగాల్లో ప్రక్షాళన ఊపందుకుంది. ఇందులో భాగంగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె హైకోర్టు, , హైకోర్టు మదురై బెంచ్‌లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలుఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. డీఎంకే లీగల్ వింగ్‌కు చెందిన ఈ న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వ న్యాయవాదులను నియమించేంత వరకు విధుల్లో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాదుల నియామక ప్రక్రియ తుది దశకు చేరడంతో, వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. స్టేట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎడ్విన్ ప్రభాకర్‌తో పాటుగా మద్రాసు హైకోర్టులో 24 మంది న్యాయవాదులు, 36 మంది అదనపు న్యాయవాదులు, మరో 54 ప్రత్యేక న్యాయవాదులు రాజీనామాలు ఆమోదించారు. అలాగే, హైకోర్టు మదురై బెంచ్ ప్రభుత్వ ప్లీడర్ పి. తిలక్‌కుమార్‌తో పాటుగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు 9 మంది, అదనపు న్యాయవాదులు 16 మంది, ఇతర న్యాయవాదులు 21 మంది ఈ జాబితాలో ఉన్నారు.కొత్త నియామకాలపై ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా.. కొత్త ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోనే ఈ స్థానాల్లో నియమించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదులలో ఆసక్తి నెలకొంది. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్‌లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్‌కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
సీఎం విజయ్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
-
అన్నాడీఎంకేకు బిగ్ షాక్ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే లోకి జంప్
-
సైలెంట్‌గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్‌నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్‌ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్‌గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. -
ఇది తమిళనాడా లేదా యూపీనా..?
తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు. వరుస నేరాల తో విమర్శల దాడి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్‌లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు. సీఎం నియోజకవర్గంలోనే అరాచకం స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. -
‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్ టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కొన్ని పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కోరారని విమర్శించారు.“అదే కాకుండా, ‘పుష్ప’ సినిమా శైలిలో సోఫా చేతిలో పట్టుకుని వెళ్లినట్టు.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నించారు. ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇదేనా నిజాయితీగల రాజకీయ నాయకుడి ప్రవర్తన అని ప్రశ్నిస్తున్నారు” అని పేర్కొన్నారు. కాగా, పుష్ప సినిమాలో సోఫాల్లో హీరో డబ్బుల కట్టలు పంపుతాడు.తమిళనాడులో ఈ ఘటనను “ముందే పన్నిన కుట్ర”గా ఈపీఎస్ పేర్కొన్నారు. రాజీనామాలు, టీవీకేలో చేరికలు సచివాలయం లోపలే సమన్వయంతో జరిగాయని పళనిస్వామి ఆరోపించారు. “సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాజీనామా లేఖలు ఆమోదిస్తుండగా, ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు ఇచ్చారు” అని చెప్పారు. దీంతో ఇది ముందే పన్నిన కుట్ర అని, బేరసారాల రాజకీయాలు బయటపడ్డాయని ఈపీఎస్ అన్నారు.ఇలాంటి మోసపూరిత చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్తవని, ఎన్నో ద్రోహాలు, వెన్నెపోట్లను ఏఐఏడీఎంకే ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. విజయ్‌పై ఈపీఎస్ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. “సినిమా ప్రముఖుడి గుర్తును” ప్రజలు తిరస్కరించడంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని అన్నారు. టీవీకే విజిల్ గుర్తును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణిస్తున్న వారికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.అన్నాడీఎంకేలో విభేదాలు మరింత తీవ్రంఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలు మరో ఎదురుదెబ్బగా మారాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం పళనిస్వామికి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణికి మద్దతు ఇస్తోంది.రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలలో ఉన్నారు. అయితే, మరో పరిణామంలో, తిరుగుబాటు వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు. దీంతో ఈపీఎస్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 27కి పెరిగింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తర్వాత స్పీకర్‌ను కలిసి, పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని లేఖ ఇచ్చారు.నిబంధనల ప్రకారమే..: స్పీకర్ బేరసారాల జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. తన బాధ్యత రాజీనామా లేఖలు అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడటమేనని చెప్పారు. “సమర్పించిన లేఖలు నిబంధనలకు సరిపోతున్నాయా లేదా మాత్రమే నేను పరిశీలించగలను. బయట ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను” అని విలేకరులతో చెప్పారు.రాజీనామాలు ఆమోదం పొందడంతో, మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో గెలిచి తర్వాత విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో కూడా ఉపఎన్నిక జరగనుంది.తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, టీవీకేలో చేరడంతో దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో 234 సభ్యుల అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కి తగ్గింది. మే 13న విశ్వాస పరీక్షలో సి.జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ కూడా ఉన్నారు.శరవేగంగా బేరసారాలు: స్టాలిన్డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దీనిపై మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. శరవేగంగా బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొదట మిత్రపక్షాల మద్దతు కోరిన టీవీకే తర్వాత ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకేలోని కొంతమందితో చర్చలు జరిపిందని, చివరకు కొంతమంది అన్నాడీడీఎంకే సభ్యుల రాజీనామాలు చేయించి, వారినే సచివాలయ ప్రాంగణంలో తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు. ఇలాంటి అవమానకర దృశ్యాలు చూడటానికే ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని స్టాలిన్ అన్నారు.టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌పై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకతంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని కపటత్వంగా ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. ఈ ఫిరాయింపులపై “ఆయా రామ్, గయా రామ్” అన్న వ్యాఖ్య చేశారు. -
ప్రెస్మీట్లో పగలబడి నవ్విన పోలీస్ అధికారిని ఎవరంటే?
సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. Am told that CM has taken action over the insensitive video of police officers laughing before briefing the media on such a serious case.But it turns out no action has been taken yet.I deleted my earlier tweet in which I thanked the CM.Didn’t expect CM Vijay to stay silent… pic.twitter.com/vmLURRYV5Z— Lala (@FabulasGuy) May 25, 2026 ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్మీట్లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. கடுங்குற்றச் செயல்களில் ஈடுபடுவோர் மீது உடனடியாக வழக்குப் பதிவு செய்து, விரைவாக விசாரணை நடத்தி, சட்டத்தின் கீழ் கடுமையான தண்டனை பெற்றுத்தர வேண்டும் என தமிழ்நாடு முதலமைச்சர் விஜய் அவர்கள் உத்தரவிட்டுள்ளார்#TVKVijayHQ #CMJosephVijay pic.twitter.com/zryLbTeHjc— CM Joseph Vijay (@CMJosephVijayHq) May 25, 2026 -
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయ్ కుమార్ రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా లేఖలు అందించారు. రాజీనామా అనంతరం,తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (హైవేలు, భవనాలు, మైనర్ పోర్టులు) మంత్రి అధవ్ అర్జున్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అధికారం చేపట్టిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ విశ్వాస తీర్మానంలో అన్నాడీఎంకేలోని వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చారు. ఆ 25 మందిలో ఇవాళ అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మే 13 టీవీకే ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో గెలవడానికి వేలుమణి శిబిరం 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే కన్వినర్ ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇచ్చిన ఈ 25 మందిని పార్టీ పదవుల నుండి తొలగించాలని కోరుతూ స్పీకర్‌కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెట్టారు. ఈ వరుస పరిణామాలతో వేలుమణి వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ శిబిరంలో చేరగా.. మరికొంత మంది అంతర్గతంగా టీవీకే వైపు మొగ్గు చూపారు. సత్యభామ, మరగాథం, జయ్ కుమార్‌తో పాటు మరికొంత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
విజయ్‌తో దోస్తీ.. ఉదయనిధి అది గుర్తుంచుకుంటే మంచిది
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం తర్వాత ఏర్పడిన అంతర్గత విబేధాలు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బహిరంగంగా మాటలు విసురుకునే స్థాయికి చేరుకున్నాయి. విజయ్ ఫ్యాక్టర్ కారణంగా డీఎంకే–కాంగ్రెస్ మధ్య ఉన్న దీర్ఘకాలిక పొత్తు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.కాంగ్రెస్‌ను ఇకపై నమ్మం.. అంటూ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాలుగా ఆ పార్టీ తమపైనే ఆధారపడిందని.. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని .. అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని.. ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని.. కాంగ్రెస్‌ను ఇకపై దగ్గరికి రానివ్వకూడదంటూ తీవ్రంగా మాట్లాడారాయన. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీఎంకేకు కష్టకాలంలోనూ కాంగ్రెస్ అండగా నిలిచిందని, పొత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీపైనే అనవసర వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారాయన.‘‘కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ కూటమి కోసం పనిచేసింది. డీఎంకేతో ఉన్న భాగస్వామ్యం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయంగా అనవసర ఉద్రిక్తతలను పెంచుతాయి’’ అని ఉదయనిధికి మాణికం ఠాగూర్ హెచ్చరికలు జారీ చేశారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడడంతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ప్రకటించింది. ఆపై విజయ్ కేబినెట్లో రెండు స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామాలన్నీ డీఎంకేకు కోపం తెప్పించాయి. కాంగ్రెస్‌పై వెన్నుపోటు రాజకీయమంటూ బహిరంగ విమర్శలకు దిగింది. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ కూడా డీఎంకేకు కౌంటర్ ఇవ్వసాగింది.ఈలోపు.. తామింక ఇండియా కూటమిలో లేమని, లోక్‌సభలో తమ ఎంపీల సిట్టింగ్ విషయంలో పునరాలోచన చేయాలంటూ డీఎంకే నేత కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు డీఎంకే లేఖ రాశారు. దీంతో తమిళనాడు పరిణామాలు.. దేశ రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.ఇద్దరికీ ఇద్దరూ అండగానే!కేంద్ర రాజకీయాల్లో యూపీఏ ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్‌కు డీఎంకే బలమైన మద్దతుగా నిలిచింది. ఆ దోస్తీతోనే ఇటు తమిళనాడులోనూ కాంగ్రెస్ విజయాలకు కారణమవుతూ వచ్చింది. అలాగే డీఎంకేకు కష్టకాలంలో కాంగ్రెస్ అండగా నిలిచిందన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలకు రాజకీయంగా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1990ల చివరి నుంచి తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తమిళనాడులో గణనీయమైన సీట్లు రావడానికి కూటమి కీలకంగా నిలిచింది. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయంలో డీఎంకే ఓటు బ్యాంక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో డీఎంకే కీలక మిత్రపక్షంగా వ్యవహరించింది. కేంద్ర మంత్రివర్గంలో కూడా డీఎంకేకు ప్రాధాన్యత దక్కింది. బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో రెండు పార్టీలు చాలాకాలం కలిసి పనిచేశాయి. అందుకే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు కేవలం తాజా రాజకీయ రగడగానే కాకుండా.. రెండు దశాబ్దాల రాజకీయ భాగస్వామ్యంలో ఏర్పడిన పెద్ద చీలికగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
వారితో జాగ్రత్త.. విజయ్‌కు తమిళిసై హెచ్చరిక
సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్‌కు అలవాటేనని, జాగ్రత్తగా ఉండాలని సీఎం విజయ్‌కు బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఆదివారం చైన్నెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందన్నారు. తమ విజయాల్లో డీఎంకే పాత్ర ఏమీ లేదని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు.దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్లూ తమతో ఉన్న డీఎంకేకే వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ.. రేపు సీఎం విజయ్‌కు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడదని హెచ్చరించారు.అన్నాడీఎంకే విషయంలో త్వరలో నిర్ణయం..మరోవైపు.. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలనే విషయంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ.. రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తనకు వినతిపత్రాలు సమర్పించాయన్నారు.ఆ వినతిపత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోందన్నారు. తనపై ఆరోపణలు చేసే వారికి కూడా అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో, తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తాననని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుందని స్పీకర్ వివరించారు. -
ట్రోలింగ్ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన
సాక్షి, చైన్నె: ‘నేను సహజంగా నవ్విన నవ్వును కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... దానికి రాజకీయ రంగు పూసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా కలచివేసింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ వివరణను పోస్ట్ చేశారు.ట్రోలింగ్ చేయడం సరికాదుపరిశ్రమల శాఖ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్మీట్లో విలేకరుల ప్రశ్నలు–సమాధానాలు ముగిసిన తరుణంలో తాను సహజంగా నవ్వాననని, అది ఏ ఒక్క ప్రశ్నకో లేదా రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఘటనకో వ్యతిరేకంగా చేసిన ప్రతిబింబం కాదన్నారు. అయితే తన తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్‌ను తప్పుగా చిత్రీకరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నెగిటివ్‌గా ప్రచారం చేయడం బాధాకరం అని మంత్రి కీర్తనా పేర్కొన్నారు. இவர்கள் எல்லாம் மனிதர்களா...பத்து வயது சிறுமி பாலியல் வன்கொடுமைக்கு ஆளாக்கப்பட்டு மிகக் கொடூரமாக கொலை செய்யப்பட்டது தொடர்பாக செய்தியாளர்கள் கேள்வி கேட்டால் அமைச்சர் @Keerthana4VNR வுக்கு சிரிப்பு வருகிறது 🤬🤬🤬 pic.twitter.com/eALA6Cx8IV— Sivan - DMK (@SSivanDMK) May 24, 2026ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడులకు దిగడం , సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ట్రోలింగ్ చేయడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే కావచ్చని, అయితే, ఒకరి వ్యక్తిగత క్షణాలను అస్త్రంగా మార్చుకుని నిజాన్ని వక్రీకరించడం సమాజానికి ఆరోగ్యకరమైన పద్ధతి కాదని హితవు పలికారు.தொழில்துறை தொடர்பான அறிமுகக் கூட்டத்தை முடித்து பத்திரிகையாளர்களை சந்தித்து வெளியே வந்தபோது, கேள்வி-பதில்கள் முடிந்த தருணத்தில் இயல்பாக நான் சிரித்தேன். அது எந்தக் கேள்விக்கும் அல்லது சம்பவத்திற்கும் எதிரான பிரதிபலிப்பல்ல. ஆனால் அந்த உடல் மொழியை தவறாகப் புரிந்து கொண்டு, அரசியல்…— Virudhai Magal Keerthana (@Keerthana4VNR) May 24, 2026మరోవైపు.. మైనర్ హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్మీట్లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్లో నవ్వులాటలు సాగిస్తూ.. మీడియా ముందే నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.Insensitive 🤦🤦🤦 pic.twitter.com/xiMg9toeb7— Rajasekar (@sekartweets) May 24, 2026అసలు ఏం జరిగింది?కోయంబత్తూర్‌లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. -
అందుకే విజయ్ గెలిచారు: స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని స్టాలిన్ ఒక రాజకీయ పవనంగా కాకుండా 'సినిమా సునామీ'గా అభివర్ణించారు. ఓటర్లు రాజకీయ విశ్వాసంతో కాకుండా, ఒక ప్రముఖ సినీ నటుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజయ్‌కు మద్దతు ఇచ్చారని ఆయన వాదించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘తమ అభిమాన నటుడు విజయ్ ఒక పార్టీని ప్రారంభించాడనే ఉత్సాహంతో ప్రజలు ఓటు వేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆటబొమ్మపై వారికి ఆసక్తి పోతుంది. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్లే, ఓటర్లు చివరికి మళ్లీ డీఎంకే కోసం వెతుకుతారు’ అని జోస్యం చెప్పారు.అలాగే, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. విజయ్ పార్టీ సొంతంగా 118 సీట్ల మెజారిటీ మార్కును దాటడంలో విఫలమైంది. వారు కనీసం మెజారిటీ కూడా సాధించలేకపోయారు. తమిళనాడు ప్రభుత్వం మా దయ వల్లే మనుగడ సాగిస్తోంది. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా అది కూలిపోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు’ అంటూ బాంబు పేల్చారు.#WATCH | "நிச்சயமாக இது 5 ஆண்டு காலம் நடைபெறக்கூடிய ஆட்சி அல்ல.. ஜனநாயகத்தில் இந்த தீர்ப்பு சினிமா கவர்ச்சிக்கு சாதகமாக அமைந்திருக்கிறது என்பதே உண்மை.."-திமுக இளைஞரணி அமைப்பாளர் கூட்டத்தில் திமுக தலைவர் மு.க.ஸ்டாலின் பேச்சு#SunNews | #MKStalin | #DMK pic.twitter.com/cGwa5sDeg4— Sun News (@sunnewstamil) May 24, 2026ఇదే సమయంలో అన్నాడీఎంకే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవన్నీ విఫలమయ్యాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరాయని ఆయన పేర్కొన్నారు.ఇక, ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 మంది సభ్యులున్న సభలో మెజారిటీ మార్కుకు అది కొద్దిలో ఆగిపోయింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేశాయి. అయితే, ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయ్‌కు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకేకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈసారి ఆ పార్టీ కేవలం 59 స్థానాలకే పరిమితమైంది. స్టాలిన్ స్వయంగా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. -
‘వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు’
చెన్నై: తమిళగ వెట్రి కజగం (టీవీకే)కి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే నేత, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే క్యాడర్ అండతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వంతో సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు కనీస కృతజ్ఞత, మర్యాద" లేదంటూ డీఎంకే యువజన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు."కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకోవడానికి డీఎంకే క్యాడరే కారణం. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారు. కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం వారు మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పారిపోయారు. వాళ్లను ఎప్పటికీ మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. అతి త్వరలోనే తమిళనాడు ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు" అంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. "దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని నేను అనుకునేవాడిని. కానీ భారత్‌లో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇప్పుడు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారు" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) ఓటర్లకు రాజకీయంగా అవగాహన కల్పించాలని, కుటుంబాలు, తొలిసారి ఓటు వేసే వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని డీఎంకే యువజన విభాగం కార్యకర్తలను ఉదయనిధి స్టాలిన్ కోరారు. -
సీఎం విజయ్ కి తొలి సవాల్.. కోయంబత్తూరు ఘటన కలకలం
-
’వద్దే వద్దు’.. త్రిషాకు సీఎం విజయ్ చెక్..!
సాక్షి, చెన్నై : రాజ్యసభ, అసెంబ్లీ ఎప ఎన్నికలపై టీవీకే అధినేత, సీఎం విజయ్ దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాలను గుప్పెట్లోకి తెచ్చుకునే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. అధికార పగ్గాలతో చరిత్ర సృష్టించిన తమ పార్టీ, రాజ్యసభలోనూ అడుగు పెట్టేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే, తిరుచ్చి తూర్పులో జరగనున్న ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది. రాజ్యసభ గెలుపు సమీకరణాలు ఇవే.. అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యమైంది. జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలెట్టారు. సాధారణంగా తమిళనాడు నుండి ఓ రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో, గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు (అంటే 117 ఓట్లు) అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. (ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది).ప్రస్తుతం అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, వీసీకే , సీపీఎం,సీపీఐల మద్దతు ఇస్తే టీవీకే అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే కానుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు కూడా విజయ్ పారీ్టకే ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఈస్థానం కైవసానికి విజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్‌లోని తన మిత్రుడు ప్రవీణ్ చవ్రర్తికి సీటు ఇస్తే కూటమి పార్టీలలో ఏదేని విబేధాలు తలెత్త వచ్చు అని భావిస్తున్నారు. దీంతో టీవీకేకు చెందిన ఒక ముఖ్య నేతను లేదా తమకు వెన్నంటి ప్రోత్సహం ఇచ్చిన అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఓ ముఖ్య ప్రముఖుడ్ని రాజ్యసభకు పంపించేందుకు విజయ్ కసరత్తులు చేపట్టినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికపై ఉత్కంఠ మరోవైపు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఎంకే తరపున ఇక్కడ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పోటీ చేయవచ్చ అనే సంకేతాల నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. తొలుత లాల్గుడిలో ఓడిన కూపా కృష్ణన్ పేరు వినిపించినా ఆయనకు బోర్డు పదవి దక్కింది. సినీ నటి త్రిషా పేరిట పోటీ అంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా మాజీ ఐఏఎస్ అధికారులపై విజయ్ దృష్టి పెట్టి ఉన్నారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం పోటీకి నిరాకరించిన పక్షంలో మరో ఐఏఎస్ అధికారి పోటీలో పెట్టేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం. -
విజయ్ మాస్టర్ ప్లాన్.. కర్ణాటకలో టీవీకే ఎంట్రీ?
తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల్లో భారీ విజయంతో టీవీకే విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లోకి టీవీకే ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి విజయ్ నేతృత్వంలోని టీవీకే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో టీవీకే గేమ్ ప్లాన్ ఏంటంటే..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తమిళనాడుకు బయట కూడా పార్టీ విస్తరణపై విజయ్ ఫోకస్ చేశారని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై టీవీకే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బరిలోకి దిగాలనే టీవీకే ప్లాన్ చేస్తోంది. బెంగళూరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కొత్త రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 50 వార్డుల్లో పోటీ చేసి తన బలం పరీక్షించుకోవాలని యోచిస్తోంది. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద మద్దతు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక స్థాయిలో విజయాలు సాధిస్తే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీవీకే అడుగుపెట్టే అవకాశం ఉంది.TVK might contest Bengaluru Local Polls in Karnataka as per Asianet. pic.twitter.com/RSYX5fSRYw— News Algebra (@NewsAlgebraIND) May 23, 2026కర్ణాటకలో టీవీకేకు అవకాశాలు..1. బలంతమిళ ఓటర్ల ఆధారం: బెంగళూరులో సుమారు 15–20 లక్షల తమిళ మాట్లాడే ప్రజలు ఉన్నారని అంచనా. వీరిని లక్ష్యంగా చేసుకోవడం టీవీకే ప్రధాన వ్యూహం.విజయ్ అభిమాన సంఘాలు: బెంగళూరులో విజయ్‌కు పెద్ద అభిమాన వర్గం ఉంది. అభిమాన సంఘాలు ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. వీరిని అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా టీవీకేకు బలమైన గ్రాస్‌రూట్ నెట్వర్క్ లభిస్తుంది.2. సవాళ్లుస్థానిక సమస్యలు: బెంగళూరులో నీటి సమస్య, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు వంటి స్థానిక అంశాలపై స్పష్టమైన అజెండా లేకపోతే టీవీకేకు పెద్ద పార్టీలతో పోటీ కష్టమవుతుంది.ప్రతిష్టాత్మక పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బలమైన స్థావరాన్ని కలిగి ఉన్నాయి. టీవీకేకు మొదటి దశలో వార్డుల స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రాంతీయ గుర్తింపు: టీవీకే తమిళనాడు ఆధారిత పార్టీ కావడంతో, కర్ణాటకలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం లేదు.టీవీకే బలం..ప్రాంతాలు: శివాజి నగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజిపుర, మడివాల, శాంతినగర్ వంటి వార్డుల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువ.ఓటు బ్యాంక్: ఈ ఓటర్లు సాధారణంగా కాంగ్రెస్ లేదా జేడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. టీవీకే ప్రవేశం వల్ల ఈ ఓటు బ్యాంక్ విభజించే అవకాశం ఉంది.ప్రాంతీయ విస్తరణ: తమిళనాడు, పుదుచ్చేరి తర్వాత, కర్ణాటకలో కూడా తన ప్రభావాన్ని విస్తరించడం.అయితే, ఇప్పటివరకు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యక్ష ఎంట్రీపై టీవీకే అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటకలో టీవీకే.. తమిళ ఓటర్ల ఆధారం మరియు విజయ్ ప్రజాదరణను బలంగా ఉపయోగించుకుంటే, స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ, స్థానిక సమస్యలపై స్పష్టమైన అజెండా లేకపోతే, పెద్ద పార్టీలతో పోటీ చేయడం కష్టతరం అవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకే పోటీ చేస్తుందా? ఒకవేళ బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
విజయ్ ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం
సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్: జూన్ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, విజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. -
సోషల్ మీడియాలో రచ్చ.. స్టాలిన్ హెచ్చరిక
సాక్షి, చైన్నె: వీసీకే, ఐయూఎంఎల్‌లు టీవీకే కూటమి ప్రభుత్వంలో చేరడంపై డీఎంకే శ్రేణులు ఎవరూ కఠిన పదజాలంతో విమర్శలు చేయవద్దని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు నూతన మంత్రులుగా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన వీసీకే ఎమ్మెల్యే వన్నియరసు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యే షాజహాన్న్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, డీఎంకే కూటమిని వీడి వీసీకే, ఐయూఎంఎల్‌లు టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం డీఎంకే వర్గాలలో ఆగ్రహాన్ని రేపాయి. టీవీకే కేబినెట్లో వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు చేరుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే డీఎంకే ఎంపీ ఎ.రాజా ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. ఇందులో పైకి ఎదగడానికి నిచ్చెనగా ఉపయోగపడిన వారు, సమాజంలోని మూఢత్వాన్ని, కుల వివక్షను అంతమొందించాల్సిన ’చిరుత పులులు’ (వీసీకే పార్టీ చిహ్నాన్ని ఉద్దేశించి), కేవలం ఒక విజిల్’ శబ్దానికి లొంగిపోయి మద్దతు ఇస్తున్నాయంటే, పెళ్లి చేసుకున్న భర్తను పక్కనబెట్టి, వేరే చోటు వెతుక్కున్నట్లే..పెరియార్ సిద్ధాంతాల ప్రకారం సరైన సమయం కోసం వేచి చూద్దాం, కానీ పోరాడుతూనే ఉంటాం. విజయం మనదే అని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహానికి దారితీసింది. అత్యంత అభ్యంతరకరమైన పదజాలంతో ఈ ట్వీట్ ఉందంటూ నెటిజన్లు, ఇతర రాజకీయ నాయకులు రాజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదం ముదరడంతో ఆయన ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించారు. ఆయన మరో ట్వీట్ చేస్తూ ‘నా ఇంటి పెరట్లోని కొబ్బరి చెట్టు అవతలి వైపునకు వంగి, ఎదురింటి వారికి కొబ్బరి నీళ్లు అందిస్తే... సాహిత్యంలో దాన్ని ముడత్తెంగు’ (వంగిన కొబ్బరి చెట్టు) అంటారు! కానీ రాజకీయాల్లో దీనికి ఏం పేరు పెట్టాలి? వర్ధిల్లాలి తమిళం అని పేర్కొన్నారు. ఈ రెండో ట్వీట్ కూడా ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. రాజా చేసిన ఈ రెండు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేసే పనిలో పడ్డారు. తొలి ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో డీఎంకే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అదే సమయంలో డీఎంకే, వీసీకే వర్గాల మధ్యమాటల తూటాలు పేలడం ఉధృతమైన నేపథ్యంలోనే, పరిస్థితి మరింత చేయి దాటకుండా ఉండేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రెండు పార్టీలను సిద్ధాంత మిత్రులుగా అభివర్ణిస్తూ, తమ పార్టీ శ్రేణులకు సంయమనం హెచ్చరిక జారీ చేశారు.స్టాలిన్ ట్వీట్లో హెచ్చరికలుఈ మేరకు స్టాలిన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన మన సిద్ధాంతపరమైన మిత్రులు వన్నియరసు, షాజహాన్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. తమ రాజకీయ నిర్ణయాలను తామే నిర్దేశించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకై నా ఉంటుందని, కాబట్టి డీఎంకే కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడా ఈ తరుణంలో ఇతరులను నొప్పించేలా, బాధించేలా కఠినమైన మాటలు మాట్లాడకూడదని విజ్ఞప్తిచేశారు. మంచిని అభినందిస్తూ, లోపాలను ఎత్తిచూపే ఒక బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం పనిచేద్దాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
హామీని నిలబెట్టుకున్న విజయ్.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తనకు సలహాలు అందించేందుకు ఇద్దరు ప్రత్యేక సలహాదారులను నియమించారు. వీరిలో ఒకరు ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి ఉన్నారు. సీఎం విజయ్ తన రాజకీయ సలహాదారుగా ఆయన్ను నియమించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం గెలుపు వ్యూహాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. ప్రముఖ సలహాదారు విష్ణు రెడ్డిని ఇతర ప్రభుత్వ, పాలనాపరమైన విషయాల కోసం సలహాదారుడిగా నియమించుకున్నారు. కాగా, జ్యోతిష్కుడు, టీవీకే అధికార ప్రతినిధి రతన్ పండిట్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నిపుణులను అధికారికంగా రంగంలోకి దిగారు.వచ్చే వారం ఢిల్లీకి సీఎం విజయ్తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదటిసారిగా వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు, మేఘాదాతు ఆనకట్ట వివాదంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా విజయ్ కలవనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ. 65 లక్షల ఆర్థిక సహాయంతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్’ విగ్రహాన్ని సీఎం విజయ్ ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు.సీఎంఓ ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీలు విడుదలముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజల వినతిపత్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సచివాలయానికి రాకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించేందుకు అధికారిక ఈ–మెయిల్ ఐడీలను ప్రభుత్వం విడుదల చేసింది.హామీని నిలబెట్టుకున్నసీఎం విజయ్చెప్పింది చేస్తాడు.. చేసింది చెబుతాడు’ అనే నినాదంతో సీఎం విజయ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం తమిళనాడులో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ మహానాడులో తాము అధికారంలోకి వస్తే మిత్రపక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యం (సంకీర్ణ ప్రభుత్వం) కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే, తాజాగా వీసీకే నాయకుడు వన్నియరసు, ఐయూఎంఎల్ నాయకుడు షాజహాన్‌లను క్యాబినెట్ మంత్రులుగా చేర్చుకుని, తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ సర్వాధికారాల సంస్కృతిని మార్చి, సరికొత్త విప్లవాత్మక సంకీర్ణ యుగానికి విజయ్ తెరలేపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ పోస్టు వైరల్‌గా మారింది.620 అమ్మ క్యాంటీన్ల’ పునరుద్ధరణకు ఆదేశంపేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో ప్రారంభించబడిన అమ్మ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలోని 383 అమ్మ క్యాంటీన్లు,ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 237 అమ్మ క్యాంటీన్లను అత్యుత్తమ వసతులతో పునర్నిర్మించి, పేదలకు నిరంతరాయంగా తక్కువ ధరకే ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు -
స్టైలిష్ అవతార్‌లో సీఎం విజయ్.. ఉప్పొంగిన అభిమానం (చిత్రాలు)
-
స్టాలిన్-పళనిది కలేనా?
ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్ ఆరోపించారు. అయితే.. విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్‌రాజ్ ఖండించారు. “ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్‌రాజ్ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్‌నేషన్-వన్ ఎలక్షన్, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.ఇదిలా ఉంటే.. విజయ్ తన కేబినెట్ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్బో క్యాబినెట్’ను విజయ్ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తమిళనాడులో నిన్న సెమ్మలై.. నేడు ధనపాల్
సాక్షి, చెన్నై : మాజీ మంత్రి, సీనియర్ నేత సెమ్మలై బాటలో బరువెక్కిన హృదయంతో వైదొలుగుతున్నానని మాజీ స్పీకర్, సీనియర్ నేత పి. ధనపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. పార్టీలోని తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత, తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పి. ధనపాల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ధనపాల్ అన్నాడీంకే ప్రభుత్వ హయాంలో 2012–2016 , 2016–2021 మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాల పాటు స్పీకర్‌గా సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన 1977, 1980, 1984, 2001 ఎన్నికలలో సంఖగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 జయలలిత క్యాబినెట్లో ఆహార, సహకార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011లో రాశిపురం, 2016లో అవినాశి నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఆయనకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు.రాజీనామా అనంతరం ధనపాల్ వ్యాఖ్యలు.. పార్టీకి రాజీనామా చేసినానంతరం ధనపాల్ ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. నేను సైకిల్‌పై తిరుగుతూ, రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఈ రోజు ముక్కలైపోవడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అందరినీ విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు కూడా తాజాగా పార్టీని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని, ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించిన తీవ్ర డిప్రెషన్ (మానసిక వేదన) వల్లే తాను అన్నాడీఎంకేకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.కాగా, తన కుమారుడు లోకేష్ తమిళసెల్వన్ టీవీకేలో చేరి, రాసిపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడని, కేబినెట్ విస్తరణలో అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం సీనియర్ నేత సెమ్మలై పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బాటలో ధనపాల్ అడుగులు వేయడంతో అన్నాడీఎంకే నుంచి మరెంత మంది సీనియర్లు మున్ముందు తప్పుకోనున్నారో అన్న చర్చ ఊపందుకుంది. -
విజయ్ సర్కార్ దూకుడు.. వెలుగులోకి భారీ స్కాం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఇంధన వనరులు, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ నేతృత్వంలో తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వరుస సమీక్షలలో భారీ స్కాం బయటపడింది. తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఇటీవల జరిపిన నిధుల కేటాయింపులు, కొన్ని ప్రాజెక్టుల ఆమోదాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అత్యంత అత్యవసరంగా కొన్ని సంస్థలకు అనుమతులు, నిధుల కేటాయింపులు మంజూరు చేసినట్లు మంత్రి జరిపిన విచారణలో తేలింది.ఇద్దరు కీలక అధికారుల సస్పెండ్ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో, శాఖాపరమైన నిష్పాక్షిక విచారణకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు , పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా ఇద్దరు అగ్ర శ్రేణి అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఎం విజయ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారులలలో వి. కాసి – చీఫ్ ఫైనాన్షియల్ కంట్రోలర్ (రెవెన్యూ) , పి. చంద్రశేఖరన్ – చీఫ్ ఇంజనీర్ (సాంప్రదాయేతర ఇంధన వనరులు) ఉన్నారు. పరిపాలనాపరమైన దుర్వినియోగం, విధుల్లో అలసత్వం , నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిద్దరిపై ఈ వేటు పడింది.రిటైర్డ్ డైరెక్టర్ పెన్షన్ బెనిఫిట్స్ నిలిపివేత ఈ అవినీతి ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ రిటైర్డ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్. మంగళనాథన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ప్రభుత్వం కోరడా ఝుళిపించింది. ఆయనకు అందాల్సిన అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన సదరు అధికారులందరిపై విద్యుత్ బోర్డు నిబంధనల ప్రకారం శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.అధికార పగ్గాలుచేపట్టగానే, అవినీతిని నిర్మూలిస్తామన్న విజయ్ ప్రభుత్వం తాజాగా భారీ స్కాంను గుర్తించి ఇద్దరు కీలక అధికారులపై వేటు వేయడం ఇతర అధికారుల గుండెల్లో గుబులు రేకెత్తించింది. -
ఆసక్తికరం.. తమిళనాడు మంత్రుల నేపథ్యం!
సాక్షి, చెన్నై: సీఎం విజయ్ కేబినెట్లో కొత్తగా అడుగు పెట్టిన 23 మందిలో పలువురికి సంబంధించిన విద్యా ప్రయాణం, రాజకీయ అనుభవం తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విజయ్ మక్కల్ ఇయక్కం నుంచే రాజకీయాలలోకి రాగా, మరి కొందరు వైద్యులు, న్యాయవాదులుగా, ఇంకొందరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఎన్. మరియా విల్సన్: తమిళనాడులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, దివంగత ‘జేప్పియార్’ అల్లుడు (జేప్పియార్ కుమార్తె రెజినా భర్త). జేప్పియార్ రెమిబాయ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీహెచ్డీ పూర్తి చేశారు.ఏ. శ్రీనాథ్ : సీఎం విజయ్ అత్యంత ఆప్తమిత్రుడు. 1992లో విజయ్ కథానాయకుడిగా పరిచయమైన ’నాళైయ తీర్పు’ చిత్రం ద్వారానే శ్రీనాథ్ కూడా సినీరంగంలోకి ప్రవేశించారు. విజయ్‌తో కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఎన్నికల్లో సీనియర్ డీఎంకె మంత్రి గీతా జీవన్‌ను తూత్తుకుడిలో ఓడించి సంచలనం సృష్టించారు. 52 ఏళ్ల శ్రీనాథ్ 12వ తరగతి చదివారు.ఎస్. కమలి : రాసిపురం ప్రాంతానికి చెందిన ఈమె కేంద్ర మంత్రి ఎల్. మురుగన్‌ను ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కేబినెట్లో అత్యంత పిన్న వయసు్కరాలైన మంత్రి ఈమె. 28 ఏళ్ల వయస్సులో మంత్రి అయిన కమలి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేశారు.సి. విజయలక్ష్మి: టీవీకే పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు. అన్నాడీఎంకే సీనియర్ నేత పి. తంగమణిని ఓడించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వయం ఉపాధి (సొంత బిజినెస్) చేసేవారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు. డి. లోకేష్ తమిళసెల్వన్: అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పి. ధనపాల్ కుమారుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో నీలగిరి నుండి అన్నాడీఎంకే తరపున పోటీ చేశారు. తర్వాత టీవీకేలో చేరి, డీఎంకే మంత్రి మదివేందన్ను ఓడించారు. లయోలా కాలేజ్ నుండి బీకామ్, ఢిల్లీ ఐఐపీఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పి. విశ్వనాథన్ (కాంగ్రెస్): చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఈయన 2009–2014 మధ్య కాంచీపురం ఎంపీగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో సాధారణ (జనరల్) స్థానంలో పోటీ చేసి గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ అభ్యర్థి ఈయనే కావడం విశేషం. మద్రాస్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు.ఆర్. కుమార్ : ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన, ఇటీవల ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు నుండి బిజినెస్ లీడర్íÙప్ కోర్సు చేశారు.విజయ్ తమిళన్ పార్తీబన్ : విజయ్ అభిమాన సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా ఎదిగిన లాయలిస్ట్. సేలం పాత బస్టాండ్ వద్ద చిన్న మొబైల్ షాప్ నడుపుకునే స్థాయి నుండి నేడు పెద్ద షోరూమ్ అధినేతగా ఎదిగారు. విజయ్, బుస్సీ ఆనంద్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఈయన 12వ తరగతి వరకు చదివారు.ఎస్. రాజేష్ కుమార్ (కాంగ్రెస్): కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత. కన్యాకుమారి జిల్లా కిళ్లీయూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. న్యాయశాస్త్రం చదివారు.డి. శరత్‌కుమార్: డీఎంకే కోటగా భావించే తాంబరంలో ఆ పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. కృతికా దేవిని 35,621 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. గతంలో సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. జైన్ కాలేజీ నుండి బీబీఏ పూర్తి చేసిన యువ ఎమ్మెల్యే.ఆర్.వి. రంజిత్ కుమార్ : కాంచీపురం ఎమ్మెల్యే, వయసు 50 ఏళ్లు. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.బి రాజ్‌కుమార్ : వయసు 46 ఏళ్లు. మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా. రియల్ ఎస్టేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.బి. మదన్ రాజా: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సొంత వ్యాపారాలు ఉన్నాయి. విఘ్నేష్ : వయసు 38 ఏళ్లు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సీసీటీవీ కెమెరాల వ్యాపారం చేసేవారు. గత 15 ఏళ్లుగా విజయ్ మక్కల్ ఇయక్కంలో పనిచేస్తున్నారు.వి. సంపత్‌కుమార్: కోయంబత్తూర్ నార్త్‌లో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ను ఓడించి సంచలనం çసృష్టించారు. అన్నామలై వర్సిటీ నుండి ఎంబీఏ (డిస్టెన్స్) చేశారు.రాజీవి : వయసు 33 ఏళ్లు. వృత్తిరీత్యా డాక్టర్ (వైద్యుడు). టీవీకే యువ మంత్రుల్లో ఒకరు.గాంధీరాజ్: వయసు 52 ఏళ్లు. 12వ తరగతి చదివారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు.జెగదీశ్వరి.కె : గ్రాడ్యుయేట్. జర్నలిజం, మీడియా రంగంలో అనుభవం ఉంది. ఆర్. రమేష్ : 10వ తరగతి చదివారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి.తెన్నరసు.కె : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, విజయ్ వీరాభిమానిగా ఉంటూ వచ్చారు.మహమ్మద్ ఫర్వాజ్.జె : ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ విజయ్ అభిమానిగా ఉంటూ వచ్చారు.సామాజిక సమతుల్యత:కమలి, విస్వనాథన్, రాజ్‌మోహన్, లోకేష్ తమిళసెల్వన్, తెన్నరసు, గాంధీరాజ్, మదన్రాజాలు షెడ్యూల్ కులాలకు చెందిన నేతలు మంత్రులు కావడం విశేషం.మహిళా శక్తిగా: ఎస్. కమలి, సి. విజయలక్ష్మి, కీర్తన, జగదీశ్వరి కేబినెట్లో ఉన్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు, యువకులకు, విద్యాధికులకు, సామాజిక సమీకరణాలకు సీఎం విజయ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. -
విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం.. చివర్లో ట్విస్టు!
చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్‌ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్ దక్కింది. ఫలితంగా కాంగ్రెస్ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. అయితే మంత్రిగా ఎస్ రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్‌కుమార్‌కు గుర్తు చేశారు. VIDEO | Tamil Nadu Cabinet expansion: During the swearing-in ceremony, Congress MLA Rajesh Kumar, while taking oath as minister, hailed Kamaraj, Rajiv Gandhi and Rahul Gandhi; Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar remarked, "Not part of the oath."(Full video available… pic.twitter.com/dT7TkpcxY5— Press Trust of India (@PTI_News) May 21, 2026 -
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ దుందుభి మోగించారు. విజయ్ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంల్, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గ విస్తరణలో వ్యూహంవిజయ్ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.వీసీకే, ఐయూఎంల్ వైఖరివీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్‌ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు.. వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.విజయ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు. -
తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందికి తన కేబినెట్లో స్థానం కల్పించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరితో గర్నవర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా చేరిన మంత్రులతో తమిళనాడు కేబినెట్లోని సభ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్తరణ జరడంతో ఇంతకుముందు ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం విజయ్ కూడా తన దగ్గరున్న కొన్ని శాఖలకు కొత్త మంత్రులకు బదిలీ చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగానే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కుమార్‌కు ఈ శాఖను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖను కూడా ఆయనకే అప్పగించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొందనున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు కీలక శాఖలుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేశ్‌కుమార్, పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం దక్కింది. రాజేశ్‌కుమార్ పర్యాటక శాఖ, విశ్వనాథన్‌కు ఉన్నతవిద్య శాఖ కేటాయించారు. ఇది ఊహించలేదు: ఐయూఎంఎల్తమను మంత్రి వర్గంలో చేరమని సీఎం విజయ్ ఆహ్వానిస్తారని ఊహించలేదని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మంత్రి పదవుల కోసం తాము అడగలేదని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ పాలన వస్తుందని, తద్వారా బీజేపీ పెత్తనం చెలాయిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్‌కు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం వెల్లడించలేదు.చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం! -
మరో వివాదంలో సీఎం విజయ్
-
59 ఏళ్ల నిరీక్షణకు ముగింపు విజయ్ కేబినెట్లోకి కాంగ్రెస్
-
సీఎం విజయ్ ఆర్మీ ప్రమాణస్వీకారం
-
అన్నాDMK నేతలకు బిగ్ షాక్.. విజయ్ సంచలన నిర్ణయం
-
రూ.2,500 రూపాయలు ఎప్పుడు వస్తాయి..
చెన్నై: తన మనవడు, మనవరాలు చెప్పినందుకే టీవీకే పార్టీకి ఓటు చేశామని రూ. 2,500 ఎప్పుడు వస్తాయని ఒక మహిళ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శివగంగ జిల్లాలోని మనమదురై ప్రభుత్వ ఆసుపత్రిని టీవీకే ఎమ్మెల్యే ఇలంగోవన్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రాథమిక సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన పరిశీలించారు. ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తనిఖీ సమయంలో, మునియమ్మల్ అనే ఒక రోగి ఎమ్మెల్యేను ఇలా అడిగారు, ‘నా మనవడు, మనవరాలు అందరూ మీకు ఓటు వేయమని నన్ను అడిగారు. అందుకే మీకు ఓటు వేశాము. మేము కూడా మీరు రూ. 2,500 ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నాం అని అడిగారు.’ దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే ఇలంగోవన్, ‘ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,500 కంటే కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్యం’ అని చెప్పారు. ఇది విని మునియమ్మాల్ నిరాశ చెందారు. -
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు. ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్‌భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నిరాశే.. ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది. -
సెక్రటేరియట్ కు వెళ్లిన సీఎం విజయ్.. మంత్రి ఆధవ్ అర్జునకు ప్రత్యేక శుభాకాంక్షలు
-
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్‌తో మొదలు పెడదాం. అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్లను చూపించి ప్రచారం చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా.. విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా? ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్‌ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్‌కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. -
విజయ్ గవర్నెన్స్ ఫాక్ట్ చెక్.. 108 సీట్లు..1000 అబద్దాలు ?
-
సీఎం విజయ్ యూటర్న్
-
వైద్య సేవల జీపును నడిపి- చెక్ చేసిన సీఎం విజయ్
-
వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ
సాక్షి, చెన్నై : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వివాదం ఏమిటంటే..? ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ: ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు. -
పార్టీలో చేరిన రోజే టికెట్.. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన..!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, ఎన్నికల మేనేజ్మెంట్ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున, సీనియర్ నేత సెంగోట్టయన్ సహా మొత్తం 9 మంది మంత్రులుగా సోమవారం వారి వారి ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలలో మంగళవారం నుంచి సమీక్షలు, సమావేశాలపై దృష్టి పెట్టారు. కాగా త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందిని తెలిసింది. ఇందులో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకూ అమాత్యయోగం దక్కనుందని సమాచారం.సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశంకల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ.. ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) – గ్రామీణాభివృద్ధి – జలవనరుల శాఖ : 61 ఏళ్ల ఆనంద్ పుదుచ్చేరికి చెందినవారు. 2006లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బుస్సీ ఆనంద్‌గా గుర్తింపు పొందారు. తొలుత విజయ్ అభిమాన సంఘాల్లో చేరి, ఆ తర్వాత విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, ఆపై విజయ్‌కు అత్యంత ఆప్తుడిగా మారారు. టీవీకే పార్టీలో అత్యంత కీలకమైన (రెండవ పెద్ద) నేతగా ఉంటూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీని ద్వారా పుదుచ్చేరి, తమిళనాడు.. రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆధవ్ అర్జున – పబ్లిక్ వర్క్స్ – క్రీడా శాఖ: తిరుచ్చికి చెందిన 43 ఏళ్ల ఆధవ్ అర్జున రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్. లాటరీ మారి్టన్ అల్లుడైన ఈయన, గతంలో ప్రశాంత్ కిశోర్‌తో కలిసి డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ’వాయిస్ ఆఫ్ కామన్స్’ అనే సొంత వ్యూహ సంస్థను స్థాపించారు. వీసీకే పారీ్టలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసి, అనంతరం టీవీకేలో చేరి విజయ్ నమ్మకస్థుడిగా మారారు. చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కే.ఏ. సెంగోట్టయన్ (ఆర్థికశాఖ): మంత్రివర్గంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత సెంకోట్టయన్ (77). ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన ఈయన, 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించినప్పటి నుండి ఆ పారీ్టలో ఉన్నారు. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి ఏకంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గాల్లో రవాణా, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచిచన గోబి చెట్టి పాళయంలో మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు. వెంకటరమణన్(ఆహారం, ఫౌరసరఫరాల శాఖ): మైలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెంకటరమణన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ , న్యాయవాది. విజయ్‌కు సుదీర్ఘకాలంగా అత్యంత సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం టీవీకే పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు మంత్రివర్గంలో చాలా కాలం తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చోటు దక్కడం గమనార్హం. రాజ్ మోహన్ – పాఠశాల విద్యాశాఖ: చెన్నై విరుగంబాక్కంకు చెందిన రాజ్ మోహన్ (39) జర్నలిజం గ్రాడ్యుయేట్. విజయ్ టీవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక అంశాలపై మాట్లాడుతూ పాపులర్ అయ్యారు. యాంకర్, నటుడు, వక్త అయిన ఈయన, 2023లో ’బాబా బ్లాక్ షీప్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. టీవీకేలో చేరిన ఈయనకు పాలసీ ప్రొపగండా సెక్రటరీ పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో ఎగ్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డాక్టర్ అరుణ్‌రాజ్ ( ఆరోగ్య శాఖమంత్రి) : నామక్కల్ కుమారమంగళానికి చెందిన 46 ఏళ్ల అరుణ్‌రాజ్ మాజీ ఐఆర్ఎస్ అధికారి, వెద్యుడు. 2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన, సివిల్ సరీ్వసెస్ పాసైన తర్వాత కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో (ఐఆర్ఎస్) పనిచేశారు. 2025లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీలో పాలసీ ప్రొపగండా జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్‌కు పరిపాలనా పరమైన కీలక సలహాలు అందిస్తున్నారు.సి.టి.ఆర్. నిర్మల్ కుమార్(విద్యుత్, న్యాయ మంత్రి) ఉసిలంపట్టికి చెందిన నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అలాగే క్రిమినాలజీ పోలీస్ అడ్మిని్రస్టేషన్లో పీజీ చేశారు. తొలుత ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అన్నామలైతో విభేదాలతో 2023లో అన్నాడీఎంకేలో చేరి ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2025లో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ, మీడియాలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ మంత్రి అయ్యారు. కీర్తన – పరిశ్రమల శాఖ: కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్. గతంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ’ఐప్యాక్’ సంస్థలో పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత డీఎంకేకు చెందిన ’పెన్’ సంస్థలోనూ పనిచేశారు. 2025లో అక్కడి నుండి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో..ఈ ఏడాది మార్చి 28న టీవీకేలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆమెకు టికెట్ దక్కడం, విజయం సాధించి ఇప్పుడు ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొత్త తరం వారికి అవకాశం కల్పించినట్టుగా తమకుకూడా మంత్రి ఛాన్స్ వస్తుదన్న ఆశతో అనేక మంది పట్టభద్రులైన సామాన్య ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండటం విశేషం.టి.కె. ప్రభు(ఖనిజ వనరులు): సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన టి.కె. ప్రభు వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో తమిళనాడు కాంగ్రెస్ ఐటీ వింగ్‌లో కీలక నేతగా ఉండేవారు. ఇన్‌స్ట్రాగామ్ రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ప్రభు, టీవీకే స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఈ ఎన్నికల్లో కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్‌ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు. -
CM విజయ్ VS కోలీవుడ్
-
విజయ్ కి CPM మద్దతు రద్దు! ఇరకాటంలో TVK
-
విజయ్‌కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్‌లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..!
-
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్‌తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్‌తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్‌ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్‌గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్‌గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్‌గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్‌గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్‌తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్‌గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
తమిళ రాజకీయాల్లో దుమారం.. చిక్కుల్లో విజయ్..
-
సీఎం విజయ్‌కు సరికొత్త తలపోటు
తమిళనాడు సీఎం విజయ్ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్‌ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందివిజయ్ నివాళులు.. కాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది. ఇది కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే నివాళి కాదుఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.విజయ్‌కు సరికొత్త తలపోటుసీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్‌తో అందులోనూ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ, తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026 -
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
-
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
-
సనాతన ధర్మంపై టీవీకే ఎమ్మెల్యే యూటర్న్
-
విజయ్ సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చు
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని.. తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని ఆయన పిలుపు ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని.. డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ మళ్లీ ప్రజల విశ్వాసాన్ని కచ్చితంగా గెలుచుకుంటాం అని స్టాలిన్ అన్నారు.అందుకే స్టాలిన్ కామెంట్లు!తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, అన్నాడీఎంకే రెబల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిత్రపక్షాల మద్దతు ఉపసంహరణ, లేదంటో విజయ్‌కు మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చని స్టాలిన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన పై వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే ఎన్నికల ఓటమి కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి, పార్టీ బలహీనతలను గుర్తించనుంది. తద్వారా మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఏం చేయాలో స్టాలిన్ వ్యూహ రచన చేస్తారని సమాచారం. అలాగే సోషల్ మీడియాలోనూ డీఎంకే వీక్‌గా ఉందని.. దానిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చేతిలో ఓటమి పాలైన కొన్ని రోజుల తర్వాత, డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్.. బూత్ ఏజెంట్లను కూడా సరిగ్గా నియమించుకోకుండా, కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారా పిల్లలను ప్రభావితం చేసి ముఖ్యమంత్రి అయ్యారని స్టాలిన్ విమర్శించారు.VIDEO | Thanjavur, Tamil Nadu: DMK chief MK Stalin says, "TVK leader Vijay became CM by influencing children through Instagram, without even appointing booth agents properly."(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HhI7ofAjeY— Press Trust of India (@PTI_News) May 18, 2026'డిజిటల్ సునామీ'తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఒక సభలో స్టాలిన్ మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల ద్వారా పెద్దలను ప్రభావితం చేసిన టీవీకే విజయం సాధించిందన్నారు. ఇన్‌స్టా ఆధారిత ప్రచారం, పిల్లలు టీవీకేకు అనుకూలంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో డీఎంకే విఫలమైందన్నారు. తంజావూరులో ఒక వివాహవేడుకకు హాజరైన ఆయన మాట్లాడారు. ‘సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం, వారి తల్లులు, తాతలు, పెద్దలను ప్రభావితం చేయడానికి పిల్లలతో ప్రచారం చేయించడం వంటివి ఉద్దేశపూర్వకంగానే చేశారు. దాన్ని మేం గ్రహించలేకపోయాం. ఇకపై ఇలాంటి చర్యలను ఓడించడానికి పార్టీ వ్యూహాలను రూపొందిస్తుంది’అని చెప్పారు. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశఅధికారం కోల్పోయినప్పటికీ డీఎంకే రాజకీయంగా ప్రాసంగికంగానే ఉందన్నారు. డీఎంకే పాలనలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించడాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిపాలనను ఇప్పటికీ తమ పార్టీ విధానాలే ప్రభావితం చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎన్నికల ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, ఓటమి తరువాత సమయంలో డీఎంకే ఫీనిక్స్ పక్షిలా పుంజుకుంటుందని అన్నారు. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్అధికార కూటమి వ్యాపింపజేస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ కార్యకర్తలను కోరారు. పాలనకు డీఎంకే ఆటంకం కలిగించదని హామీ ఇస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను కూడా పంచుకున్నారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారు పరిపాలిస్తున్నంత కాలం ఇబ్బంది పెట్టం. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందారోపణలు చేస్తే, వివరణలు ఇస్తాం. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే, నిజాన్ని బయటపెడతాం’అని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిరోజూ హత్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోషులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడి, శాంతిభద్రతలను పరిరక్షించడం పరిపాలనలో ప్రాథమిక కర్తవ్యం. ఈ వాస్తవాన్ని టీవీకే ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి గ్రహించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్కాగా ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 104 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేయగా, డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
‘అమ్మ క్యాంటీన్ల’పై సీఎం విజయ్ ఫోకస్
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
విజయ్ కు చిరంజీవి ఫోన్.. పవన్ సీరియస్?
-
పళనిస్వామికి భారీ షాక్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహణకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం బృందం సిద్ధమైంది. ఇందు కోసం 1000 మంది సభ్యుల చేత సంతకాలు చేయించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే సర్వసభ్య సమావేశం విషయంగా ఎవ్వరూ సంతకాలు చేయవద్దని సభ్యులకు పళనిస్వామి సూచించారు.వివరాల మేరకు.. అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం శిబిరాల మధ్య వివాదం ముదిరింది. పళనిస్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గద్దె దించడం లక్ష్యంగా ఎస్పీ వేలుమణి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. అన్నాడీఎంకేలో 1,800 మంది మేరకు సర్వ సభ్య సభ్యులు ఉన్నారు. వీరిలో 1000 మందిని తమ వైపునకు ఎస్పీ వేలుమణి శిబిరం తిప్పుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరితో సంతకాలు చేయించి, సర్వ సభ్య సమావేశం లక్ష్యంగా పట్టుబట్టే పనిలో పడ్డారు. పార్టీపరంగా తమతో ఉన్న 28 జిల్లాల కార్యదర్శుల ద్వారా మిగిలిన జిల్లాల కార్యదర్శులకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.సంతకాలు చేయవద్దు పార్టీ సర్వ సభ్య సభ్యులకు పళనిస్వామి సూచనలు చేస్తూ ఆదివారం ప్రకటన చేశారు. సర్వ సభ్య సమావేశం పేరిట సంతకాలు చేయవద్దని, పార్టీని సర్వనాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల చర్యలకు చెక్ పెట్టేవిధంగా చట్ట పరమైన పోరాటానికి సైతం పళనిస్వామి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకునేందుకు సీఎం విజయ్ కుట్రలు చేస్తున్నారని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన పక్షంలో సీబీఐ విచారణ కోరుతామని హెచ్చరించారు. -
విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
సాక్షి, చెన్నై: అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకుండానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, టీవీకే (TVK) కూటమి ప్రభుత్వంపై సీనియర్ డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది."మా తలైవరే తదుపరి ముఖ్యమంత్రి. మరో నాలుగు లేదా ఆరు నెలల్లో మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, టీవీకే పార్టీ గానీ, లేదా ఆధవ్ అర్జున గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీవీకే, డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ... అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, విల్లివాక్కం నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.ఈ ప్రభుత్వం మహా అయితే మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందంటూ జోస్యం చెప్పారు. గత ఏప్రిల్ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనవిజయం సాధించకముందు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.అంతేకాదు ‘‘నీకు నిజంగా దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్, నేను కూడా చేస్తాను. మనమిద్దరం తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ, ఇక్కడ మేము ఎవరినైనా ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ అర్జునకు సవాల్ విసిరారు.కాగా తిరుచెందూర్ నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన మొదట 2001లో డీఎంకే బద్ధశత్రువైన ఏఐఏడీఎంకే (AIADMK) తరపున ఇక్కడి నుండి గెలిచారు. ఆ తర్వాత 2009లో డీఎంకేలో చేరి, అప్పటి నుండి ఈ స్థానాన్ని తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని దశాబ్దాలలోనే విజయ్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, గత 62 ఏళ్లుగా తమిళనాడును మారుమార్చిపాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు.తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో మాజీ డీఎంకే నాయకుడు, ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వి.ఎస్. బాబు చేతిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగిన తీవ్ర రాజకీయ డ్రామా అనంతరం కాంగ్రెస్, రెండు లెఫ్ట్ పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మద్దతుతో టీవీకే మెజారిటీ మార్కును దాటింది. దీంతో ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144-22 ఓట్ల తేడాతో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అగ్రపీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పాలన, నియామకాలు, పరిపాలనాపరమైన నిర్ణయాలపై డీఎంకే నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. -
సీఎం విజయ్, రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందన ఇదే..
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే విమర్శలు చేయడం లేదా అంచనా వేయడం సరి కాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. మదురై విమానాశ్రయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలని ఆయన కోరారు.రెండు రోజుల్లో చెబితే అది జోస్యం అవుతుంది..సీఎం విజయ్ పాలన ఎలా ఉందనే ప్రశ్నపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. ‘విజయ్ ముఖ్యమంత్రి అయి రెండు రోజులే అవుతోంది. అప్పుడే ఆయన పాలన ఎలా ఉందో చెప్పమంటే అది జోస్యం చెప్పినట్లే అవుతుందని చమత్కరించారు. ఆరు రోజుల్లోనో, పదిహేను రోజుల్లోనో ప్రభుత్వ పనితీరుపై సమీక్షలు చేయడం కూడా అంతే అని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడటానికి, వారి విధానాలు అమలు కావడానికి కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ పేర్కొన్నారు.ప్రజలు నమ్మి ఓటేశారు.. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడంపై స్పందిస్తూ... కొత్తవాళ్లు చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే రాజకీయాలకు ఇది కొత్తేమీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బాధ్యతలు స్వీకరించిన వారంతా కొత్తవారేనని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటేశారు కాబట్టి, ఆ పాలన సజావుగా సాగుతుందా లేదా అనేది గమనించాలన్నారు. తాము కూడా దాన్నే గమనిస్తున్నాం అని చెప్పారు.తమిళనాట పుడితే అది ద్రావిడ పార్టీనే తమిళనాడు రాజకీయ సిద్ధాంతాలపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తన ఉద్దేశం ప్రకారం.. తమిళనాడులో తమిళం మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని ప్రారంభిస్తే, అది కచ్చితంగా ద్రావిడ పార్టీనే అవుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. నూతన విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయాలని ఎవరూ బలవంత పెట్టలేరని స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య కేవలం పోటీ మాత్రమే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల (ఒకవేళ కమల్ సీఎం అయినా తనకు అసూయ ఉండదన్న వ్యాఖ్యల) ప్రస్తావన రాగా, కమల్ హాసన్ వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను, రజనీకాంత్ ఎప్పుడూ ఒకరిని చూసి ఒకరం అసూయ పడలేదన్నారు. అయితే, తమ మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదన్నారు. తాము సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పోటీ పడ్డాం.. ఒకవేళ మేం క్రికెట్ ఆడి ఉన్నా సరే, ఇలాగే పోటీ పడేవాళ్లం తప్ప అసూయ పడేవాళ్లం కాదన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడే మార్కులు వేయకుండా, కొంతకాలం వేచి చూడాలనే రజినీకాంత్ అభిప్రాయాన్ని కమల్ హాసన్ కూడా సమర్థించడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సింహం సింగిల్.. వెనక్కి తగ్గినా రజినీకాంత్.. జీర్ణించుకోలేకపోతున్న పవన్ !
-
రెండు పెద్ద పార్టీల మధ్య గెలవడం గ్రేట్.. విజయ్ ని ఆకాశానికెత్తిన రజినీ
-
టీడీపీ పల్లకీ మోయడం కాదు.. TVK విజయ్ ని చూసి నేర్చుకో
-
అన్నాడీఎంకేలో సంక్షోభం.. పళనిస్వామి కొత్త స్కెచ్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళని స్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళని స్వామి పేరును తొలగించి, తనపేరును వేసుకున్నారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే.ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళణి స్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు.ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది.ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇది వరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే, తాజాగా ఆయన పేరు ను తొలగించి తన పేరును ఎస్పీవేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తనగుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమని మరి కొద్ది రోజులలో పార్టీని కూడా కైవశం చేసుకోవడం ఖాయం అని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరఫున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్ప టికే వినతిపత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే, కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్‌ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళణిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం.ఇక, ఎస్పీ వేలుమణి బృందం అయితే, పార్టీ ఫిరాయింపు ల నిరోధక చట్టం నుండి తప్పించుకుని, అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల మద్ద తు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32కు పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.పళణి స్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతా లు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, ఇరు శిబిరాల్లో ఈ వివాదం భగ్గుమంటోంది. విల్లుపురంలో సీవీషణ్ముం, పళని స్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. -
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు. -
సీఎం విజయ్ను కలిసిన కమల హాసన్.. కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్‌ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன். தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது. பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026 -
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎవరెవరికి ఏయే శాఖలు? శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.ఆర్ నిర్మల్‌కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.రాజ్‌మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. -
బాబోయ్ నన్ను వదిలేయండి.! విజయ్ దెబ్బకి పవన్ కి చుక్కలు..!
-
ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు కదా..! ట్రోల్స్ పై పవన్ రియాక్షన్
-
విజయ్ సీఎం.. పవన్ ఏడుపు.. పిచ్చెక్కిపోతున్న జనసేన నేతలు
-
బ్రిటీష్‌కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్‌లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్‌తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్‌ను ముగించాలంటూ విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్‌కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్‌గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్‌గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్‌కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్‌కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్‌లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్‌నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన రిక్వెస్ట్‌తో ఆమె వార్తల్లో నిలిచింది. -
విజయ్‌తో పోలిక.. ట్రోలింగ్‌పై స్పందించిన పవన్
సాక్షి, అమరావతి: ‘‘తమిళనాడు ఎన్నికలొచ్చి ఆయన ముఖ్యమంత్రి కావడం ఏమోగానీ అందరూ నన్ను చంపేస్తున్నారు.. ఊళ్లో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్టు ఉంది. చాలా మంది ఏపీలో అలా చేసి ఉండాలని నాకు మెసేజ్ పంపిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టలేదు.’ అంటూ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తూ నడుస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరని కార్యకర్తలకు వివరించారు. 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఏమైంది? రెండు చోట్ల ఓడించారు కదా అని పేర్కొన్నారు. ‘‘తమిళనాడుతో మనకు పోలికేంటి? నిజంగా నాకు పదవే ప్రాధాన్యం అనుకుంటే, 2008లో, 2014లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. ఒక పార్టీని నడపాలంటే ఎంత సత్తా ఉండాలి? అన్నీ నిర్ణయించుకుని ఒక దశాబ్దం నలుగుతానని నిలబడ్డా’ అంటూ పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. Contesting alone sounds easy after Vijay’s win, but I’ve already experienced how tough solo politics is in Andhra. - AP Deputy CM Pawan Kalyan pic.twitter.com/PxlKaqL2aj— South Matters (@SouthMatters) May 15, 2026ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉన్నా.. ‘‘పొత్తులో సమస్యలు ఉన్నాయి. ఆయన(చంద్రబాబు)తో చాలా అంశాల్లో విభేదించొచ్చు. ఒంటరిగా వెళ్లే చాన్స్ ఉంది. కానీ ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఒక కీలక పరిస్థితి. చాలా ఆలోచించే పొత్తు నిర్ణయం తీసుకున్నా. పదవులు, వీటన్నింటి కంటే ప్రజల సుస్థిరతే ముఖ్యమనుకున్నా. పొత్తులో మీకు ఉన్న ఇబ్బందులను నేను అర్థం చేసుకోగలను. వాటిని పార్టీ సరిదిద్దుతుంది. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయను. మీ గౌరవానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఇబ్బందులున్నా.. మనమంతా బలమైన కూటమి వెంట వెళ్లాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. కూటమి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.’ అంటూ పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. నా కోసం ఎదురు దాడి చేయండి ‘సమసమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మాట్లాడితే వంగవీటి రంగా గురించి మాట్లాడతారు. ఆ రోజు ఆయనకు ఇబ్బంది, ప్రాణహాని ఉందని అంటే ఆయన చుట్టూ దడికట్టలేకపోయారు. మనిషి బతికి ఉన్నప్పుడు రక్షించుకోలేకపోయారు. నేను ఒక కులం కోసమే పని చేసి, ఆ కులం అంతా ఓట్లు వేస్తే రెండు చోట్ల నేను ఓడిపోకూడదు కదా?. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ఎదురు దాడి చేయండి. నేను ఒక కులం కోసం పనిచేయడానికి రాలేదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో పార్టీ పాలక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ సమావేశాల్లో నేను స్వయంగా పాల్గొంటా. తొలుత 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. పార్టీ శ్రేణులతో మాట్లాడతా’ అంటూ పవన్ వివరించారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం విజయ్ సమావేశం
-
ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.డీఎంకేలో భారీ మార్పులుడీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్ ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.ఓటమికి నేనే బాధ్యుడిని..పార్టీ ఓటమిపై స్టాలిన్ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్‌గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్‌గా మారుతోంది. విజయ్ సర్కార్‌కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్‌కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్‌కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్‌గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్‌ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్‌ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్‌కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్‌ను తమిళన్కు ముందు.. తమిళ్‌కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్‌ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్‌ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
CM విజయ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్


