న్యూఢిల్లీ : రాష్ట్ర రాజకీయాలతో హస్తిన మరోసారి వేడెక్కింది. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్రపతి పాలనా లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా అనే దానిపై చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను కలిశారు.
ఇక హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్ వరుసపెట్టి కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ప్రణబ్తో కేసీఆర్ సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
హస్తినలో నేతల హడావుడి, మంతనాలు
Published Mon, Feb 24 2014 1:16 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement