సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గంటా మంగళవారం స్పందించారు.
నెల్లూరులోని నారాయణ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత అక్కడి అటెండర్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతందని, కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత బయటకు వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు.
ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారమే: గంటా
Published Wed, Mar 29 2017 2:37 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM
Advertisement
Advertisement