Narayana Institute
-
చైతన్య,నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్
-
విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్
-
నరకానికి నకళ్లు... నారాయణ విద్యాసంస్థలు
వామపక్షాలు కరపత్రాల ప్రచారం తిరుపతి కల్చరల్ : నరకానికి నకళ్లు నారాయణ విద్యాసంస్థలని, వాటిలో పిల్లలను చేర్పించవద్దని కోరుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఆ«ధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గురువారం కరపత్రాల ప్రచారం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ నేడు విద్యార్థులను మాయమాటలతో తమ కళాశాలలో చేర్చుకుని లక్షలాది రూపాయల ఫీజులు కట్టుకుని వారికి సౌకర్యాలు లేకుండా చేస్తోందన్నారు. అగ్గి పెట్టెల్లాంటి గదులు, అపార్ట్మెంట్ల లో చదువులు, సరిగా లేని మరుగుదొడ్లు, ఉడికీ ఉడకని అన్నం వంటి అసౌకర్యాలతో విద్యార్థులను క్షోభకు గురిచేస్తున్నారన్నారు. విద్యార్హత లేని లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తూ విశ్రాంతి లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని విమర్శించారు. నారాయణ సంస్థల్లో వరుస ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులు జయచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సాయిలక్ష్మి, సుబ్రమణ్యం, ఎన్డీ రవి, రజని, గురప్రసాద్, మంజుల, నాగభూషణమ్మ, రామకృష్ణమ్మ, శివ, చలపతి, కాళయ్య పాల్గొన్నారు. -
ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారమే: గంటా
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గంటా మంగళవారం స్పందించారు. నెల్లూరులోని నారాయణ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత అక్కడి అటెండర్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతందని, కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత బయటకు వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు. -
అక్కడ మా విద్యార్థులుండరు కదా!
పది ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి నారాయణ వింత వాదన సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఈ విషయాన్ని ఎలా కప్పిపుచ్చాలో తెలియక మంత్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నారు. మొదట అసలు ప్రశ్నపత్రం లీక్ కాలేదని దబాయించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనంతరం వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వస్తే మంత్రి నారాయణకేం సంబంధం అంటూ వితండవాదం చేస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో మా విద్యార్థులు పరీక్ష రాయరు కదా.. అక్కడ ప్రశ్నపత్రం లీకైతే మాకేం సంబంధం? అని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని, ఇప్పటికే విచారణ జరిపించాం.. అంటూ రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై నారాయణ, పల్లె మంగళవారం మీడియా పాయింట్లో మాట్లాడారు. -
లీకేజీలోనూ ‘నారాయణ’దే ఫస్ట్ ర్యాంకు
నారాయణ, గంటాను వెంటనే బర్తరఫ్ చేయండి: రోజా డిమాండ్ సాక్షి, అమరావతి: ఏటా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అంటూ గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థ.. విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నప్రతాల లీకేజీ వంటి అక్రమాల్లోనూ ఫస్ట్ ర్యాంకే సంపాదిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇష్టానుసారం విద్యా వ్యాపారం చేసుకోమని గంటా శ్రీనివాస్, నారాయణకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. దీంతో ఇద్దరు వియ్యంకులూ కలసి అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ర్యాంక్‌ల కోసం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసే అధికారం వారికి ఎవరిచ్చారని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నారాయణ, గంటాను మంత్రి పదవుల నుంచి తొలగించి, ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈవిధంగా చేయలేని పక్షంలో బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఒక్కరోజులో లక్ష!
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రహసనంగా ముగిసింది. గంపగుత్తగా ఓటర్ల నమోదు పెద్దఎత్తున జరిగింది. దాదాపు అన్ని డివిజన్లలోనూ ఇదే రీతిలో ఓటర్ల నమోదు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం విశాఖ ఆర్డీవో కార్యాలయంలో ఇదే రీతిలో ఓటర్ల నమోదుకు నారాయణ విద్యాసంస్థలతో కలిపి ఆళ్వార్‌దాస్ విద్యా సంస్థల యాజమాన్యం విఫలయత్నం చేయగా సీపీఎం నేతలు అడ్డుకుని వాటిని తగలబెట్టారు. అరుునప్పటికీ చివరిరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్ల నమోదుకు దరఖాస్తులందినట్టుగా అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల 1న ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలి ఎనికల్లో 1,61,374మంది ఓటుహక్కు నమోదు చేసుకోగా, గడిచిన పదేళ్లలో పెరిగిన పట్టభద్రుల సంఖ్యను బట్టి 2.50 లక్షలకు పైగా ఓట్లు నమోదవుతాయని అంచనా వేశారు. ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే వారి తరపున ఎవరో ఒకరు సమర్పించే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు గంపగుత్తగా ఓటర్ల నమోదుకు తెగపడ్డారుు. ఆళ్వార్‌దాస్ కళాశాల సెక్రటరీ రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్వార్దాస్తోపాటు మున్సిపల్ శాఖా మంత్రికి చెందిన ‘నారాయణ’ విద్యాసంస్థలు కూడా ఉత్తరాంధ్ర పరిధిలో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులను ఎన్నికల ఏజెంట్లుగా ఇంటింటికీ పంపి పట్టభద్రుల నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు పత్రాలను సేకరించారు. వీటిని చివరి రోజైన శనివారం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఆ విద్యాసంస్థలో 7 వేలమంది సిబ్బంది ఉన్నారట.. విశాఖ ఆర్డీవో కార్యాలయంలో కూడా ఇదే రీతిలో ఆళ్వార్‌దాస్ విద్యాసంస్థలు తమ లెటర్ హెడ్‌పై ‘మా సంస్థలకు చెందిన 7 వేల మంది సిబ్బంది ఓట్లను సమర్పిస్తున్నాం.. అంగీకరించాల్సింది’గా కోరారు. ఇంతలో వచ్చిన ఆర్డీవో వెంకటేశ్వర్లు దరఖాస్తులను పరిశీలించి తొలుత ఇన్ని వేల దరఖాస్తులను తీసుకోలేమని చెప్పారు. మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకురాగా, ఇంతలో అక్కడకు చేరుకున్న సీపీఎం నేతలు బల్క్ ఓటర్ల నమోదును అడ్డుకుని అధికారులను నిలదీశారు. కనీసం అభ్యర్థి, గెజిటెడ్ అధికారి సంతకాలు లేకపోగా, ఒక లెటర్ హెడ్‌పై ఇన్ని వేల దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఓటర్ల నమోదుకు సీపీఎం నేతలు బ్రేకులేయడంతో ఆళ్వార్‌దాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోక్‌నాధం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క గడువు ముగిసేనాటికి నమోదైన ఓటర్ల వివరాలను సోమవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ బాబూరావునాయుడు ప్రకటించారు. 4వ తేదీ వరకు 48 వేలే నమోదు... ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1న శ్రీకారం చుడితే తొలి పదిరోజులు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ తర్వాత 17వ తేదీ నాటికి 2,054 దరఖాస్తులొచ్చారుు. ఇక అక్టోబర్ 30 నాటికి ఆ సంఖ్య 31,011కు చేరింది. నవంబర్ 3వ తేదీ నాటికి 47 వేలకు చేరారుు. 4వ తేదీకి ఆ సంఖ్య 48,835కు చేరింది. ఓటర్ల నమోదుకు చివరి రోజైన ఐదవ తేదీ నాటికి ఆ సంఖ్య ఊహలకు అందని రీతిలో ఏకంగా 1.47,956కు చేరింది. అంటే చివరి రోజైన శనివారం ఒక్కరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్లు నమోదైనట్టు అధికారులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఓటర్ల నమోదులో అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకు కార్పొరేట్ సంస్థలకు అధికారులు దాసోహమైనట్టుగా ఆరోపణలు బలంగా విన్పిస్తున్నారుు. లేకుంటే చివరిరోజు ఏకంగా లక్ష ఓట్ల నమోదు ఏ విధంగా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అందిన దరఖాస్తుల్లో విశాఖ జిల్లా పరిధిలో 89,676, శ్రీకాకుళం జిల్లాలో 28,329, విజయనగరం జిల్లా పరిధిలో 29,951 ఉన్నారుు. డివిజన్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నారుు. -
నారాయణపై చర్యలేవీ
- వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలల బంద్ - ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఒంగోలు అర్బన్: నారాయణ విద్యా సంస్థల్లో గత రెండు నెలల్లో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ విద్యా సంస్థలపై చర్యలెందుకు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మణికంఠారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఒంగోలులోని కార్పొరేట్ జూనియర్ కళాశాల బంద్ నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థి సంఘాలైన పీడీఎస్యు, విద్యార్థి జేఏసీలు మద్దతు ప్రకటించాయి. ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు. అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. మణికంఠారెడ్డి మాట్లాడుతూ పదిమందికి పైగా నారాయణ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఆ కళాశాల యాజమాన్యాలను కొమ్ముకాస్తూ చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యేకి చెందిన కశాశాల్లో విద్యార్థిని సెలవు తీసుకొని ఇంటికి వెళ్లి దాదాపు 20 రోజుల తర్వాత ఇంటివద్ద ఆత్మహత్య చేసుకుంటే అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కుట్రలకి నిదర్శనమన్నారు. చిత్తశుద్ధి ఉంటే నారాయణ యాజమాన్యంపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థుల మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. బంద్‌లో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్యామ్, ధనుంజయ, జేఏసీ నాయకులు నాగరాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు యశ్వంత్, కార్యదర్శి శ్యామ్యేల్ పాల్గొన్నారు. -
‘నారాయణ’పై గరం గరం
జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఒంగోలు టౌన్ : నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి పి.నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు. గడిచిన 15 నెలల్లో నారాయణ కళాశాలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ మీదుగా నారాయణ దిష్టిబొమ్మతో ప్రదర్శనగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంగా ఏర్పడి అరగంటపాటు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ముందుగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్, నగర కార్యదర్శి పి.రాంబాబు, ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ.. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ధ్వజమెత్తారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేకే కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధర్యంలో దిష్టిబొమ్మ దహనం కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణ విద్యా సంస్థల దిష్టిబొమ్మ ద హనం చేశారు. గుర్తింపులేని నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని, నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు జీవన్, తరుణ్, పీవైఎల్ నాయకుడు నాగరాజు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. ఒంగోలు : కడప నారాయణలో విద్యార్థినుల మృతిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవార ం బంద్ నిర్వహించారు. స్థానిక మంగమూరు డొంకలోని ఓ ప్రైవేట్ కళాశాల సిబ్బందికి, ఏబీవీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కళాశాలకు సెలవు ప్రకటించడంతో ఏబీవీపీ విద్యార్థులు వెనుదిరిగారు. ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ.. కడపలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెప్పడం సిగ్గుచేటన్నారు. సెలవు దినాల్లో సైతం కాలేజీలు నిర్వహించడం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, రాజేష్, సుదీర్, మణి, అన్వేష్, నరసారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, హేమంత్, గణేష్, విజయ్ పాల్గొన్నారు.