లీకేజీలోనూ ‘నారాయణ’దే ఫస్ట్‌ ర్యాంకు | Ysrcp MLA Roja comments on Minister Narayana and Ganta on question paper leakage issue | Sakshi
Sakshi News home page

లీకేజీలోనూ ‘నారాయణ’దే ఫస్ట్‌ ర్యాంకు

Published Wed, Mar 29 2017 2:25 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

లీకేజీలోనూ ‘నారాయణ’దే ఫస్ట్‌ ర్యాంకు - Sakshi

లీకేజీలోనూ ‘నారాయణ’దే ఫస్ట్‌ ర్యాంకు

నారాయణ, గంటాను వెంటనే బర్తరఫ్‌ చేయండి: రోజా డిమాండ్‌  

సాక్షి, అమరావతి: ఏటా ఫస్ట్‌ ర్యాంక్, సెకండ్‌ ర్యాంక్‌ అంటూ గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థ.. విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నప్రతాల లీకేజీ వంటి అక్రమాల్లోనూ ఫస్ట్‌ ర్యాంకే సంపాదిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇష్టానుసారం విద్యా వ్యాపారం చేసుకోమని గంటా శ్రీనివాస్, నారాయణకు సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. దీంతో ఇద్దరు వియ్యంకులూ కలసి అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ర్యాంక్‌ల కోసం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసే అధికారం వారికి ఎవరిచ్చారని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నారాయణ, గంటాను మంత్రి పదవుల నుంచి తొలగించి, ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈవిధంగా చేయలేని పక్షంలో బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement