మహారాణిపేట (విశాఖపట్నం) : ఈ నెల 21న శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖలో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ వీసీల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్సిటీల్లో ఒకే విధానం కోసం ఈ బిల్లును తీసుకురానున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో న్యాయమైన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు వర్సిటీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.