సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది | CM Chandrababu comments on Visakha land scam | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది

Published Tue, Jun 20 2017 1:20 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది - Sakshi

సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది

విశాఖ భూకుంభకోణంపై సీఎం

సాక్షి, అమరావతి: సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే 20 ఏళ్లు పడుతుంది, ఆధారాలు ఉంటే తీసుకురండి... మరుసటి రోజే చర్యలు తీసుకుంటామని విశాఖ భూ కుంభకో ణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ కోరారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా పై విధంగా స్పందించారు.

ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరి వద్ద ఏ ఆధారాలు ఉన్నా వాటిని వెంటనే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 24 ప్రాజెక్టులను వచ్చే మార్చిలోపులో పూర్తిచేస్తామన్నారు. స్మార్ట్‌ వాటర్‌గ్రిడ్‌ తయారు చేయడం లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షం విమర్శలకు భయపడి ఉంటే గోదావరి నీళ్ళు కృష్ణాకు తెచ్చేవాళ్ళం కాదన్నారు. పులిచింతల ప్రాజెక్టును ఆగస్టులో జాతికి అంకితం చేస్తామని చెబుతూ మొత్తం 24 ప్రాజెక్టులను ఎప్పుడు ప్రారంభించేది వివరించారు. కైజాలా యాప్‌ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల ఫొటోలు తీసి పంపిస్తే అటువంటి వారికి అవార్డులు ఇవ్వాని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement