రేపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
విడుదల చేయనున్న మంత్రి గంటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1వ తేదీనుంచి టెన్త్ పరీక్షలను మార్చి 14వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు షెడ్యూళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు జరిగేలానే ఏపీలోనూ షెడ్యూల్ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నారుు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ముందు భావించినా ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌లో నియమించాలని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది.