Intermediate examination
-
ఇంటర్ ఇంగ్లిష్–2 పరీక్షలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. మొత్తం 6 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తించారు. వాటివల్ల పరీక్ష కేంద్రాల్లో గందరగోళానికి గురి కావాల్సి వచ్చిందని అనేక మంది విద్యార్థులు వాపోయారు. 5, 7, 10, 12, 14, 17 నంబరు ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని, దీంతో 15 మార్కుల వరకు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో 14వ ప్రశ్నను అసంపూర్తిగా ఇవ్వగా.. మిగతా ప్రశ్నల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ప్రశ్నపత్రం ప్రింట్ చేసిన తరువాత ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం, తప్పులను సరిదిద్దడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని లెక్చరర్లు పేర్కొంటున్నారు. అయితే ఈ తప్పులకు బాధ్యత బోర్డుదే అయినందున విద్యార్థులు నష్టపోకుండా మార్కులు కలపాలని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీష్ డిమాండ్ చేశారు. ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే మార్కులిస్తాం: బోర్డు కార్యదర్శి ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులపై ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పందించారు. 14వ ప్రశ్న అసంపూర్తిగా ఉన్నందున ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని వెల్లడించారు. అచ్చు తప్పుల విషయంలో ఉదయం 9:45 గంటలకే అన్ని పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి సరి చేయించామన్నారు. తప్పులతో ప్రశ్నపత్రాలను రూపొందించిన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఇవీ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులు.. ►14వ ప్రశ్నలో ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఫారం ఇచ్చారు. అందులో అకౌంట్ నంబరు, పేరు, అమౌంట్ ఇచ్చారు. అయితే అందులో డేట్, బ్రాంచి వివరాలు, మొబైల్ నంబరు ఆప్షన్, సంతకం లేకుండా అసంపూర్ణంగా ప్రశ్నను ఇచ్చారు. ఆ తరువాత బోర్డు నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇన్విజిలేటర్లు అది కోఠి బ్రాంచ్ అని చెప్పారు. దీంతో విద్యార్థులు మరింత గందరగోళానికి గురయ్యారు. ఇది 4 మార్కుల ప్రశ్న కాగా, జవాబులు రాయాల్సిన ఖాళీలు 10 ఇచ్చారు. కానీ ప్రశ్నకు పక్కన మాత్రం 8 రాయాలని, ఒక్కో ఖాళీ నింపితే అర మార్కు చొప్పున ఇస్తామని ఉంది. ►ఇక 4 మార్కులు కలిగిన 5వ ప్రశ్నకు why అని ఉండాల్సిన చోట What అని వచ్చింది. ►4 మార్కులు కలిగిన 17వ ప్రశ్నలో felicitationకి బదులుగా felicilation అని తప్పుగా పడింది. ►7వ ప్రశ్న రెండో పేరాలో discipline అని ఇవ్వడానికి బదులుగా disipline అని ఇచ్చారు. అదే తప్పు రిపీట్ కూడా అయ్యింది. ►10వ ప్రశ్నలో a book అనే పదం ఉండాల్సి ఉండగా.. అది లేకుండానే ఇచ్చారు. ►ఒక మార్కు కలిగిన 12వ ప్రశ్నలో turn a deaf ear అని ముద్రించాల్సి ఉండగా..turn a deaf year అని ముద్రించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
-
వెబ్సైట్లో ఇంటర్ జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు, మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన రీ వెరిఫికేషన్‌లో సున్నా మార్కులు వచ్చిన సమాధానాలు, అసలు దిద్దని సమాధానాలను మాత్రమే పరిశీలించి మార్కులు వేశారని పేర్కొన్నారు. అలాగే మార్కుల మొత్తాన్ని కూడా సరిచూశారని తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి మార్కులు వేసిన జవాబులను పునఃపరిశీలన చేయడం మాత్రం జరగదని స్పష్టంచేశారు. అంటే రీ వాల్యుయేషన్ ఉండదని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాయడానికి సబ్జెక్టుకు రూ.150 చొప్పున కాలేజీలో ఫీజు చెల్లించి, ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు మాన్యువల్ నామినల్ రోల్ పంపించాలని సూచించారు. ఎంఈసీ విద్యార్థులు ఇది గమనించాలి... ఎంఈసీ విద్యార్థులు గణితంలో 75 మార్కుల ప్రశ్నపత్రానికే సమాధానాలు రాసినప్పటికీ, వారికి వచ్చిన మార్కులను 50 మార్కులకు అనుగుణంగా గుణించి మెమోలో వేస్తారని అశోక్ వివరించారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి గణితం పేపర్లో 18 మార్కులు వస్తే.. వాటిని 2/3తో గుణించి 12 మార్కులుగా నిర్ధారించి, ఆ మేరకు మెమోలో ప్రింట్ చేస్తారని తెలిపారు. అందువల్ల విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల కంటే మెమోలో తక్కువ వచ్చాయని ఆందోళన చెందకుండా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. -
పరీక్ష కేంద్రంలోనే తుదిశ్వాస!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో విషాదం నెలకొంది. పరీక్ష రాయడానికి వచ్చిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు గుండెపోటుతో పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే ఆ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేని గ్రామానికి చెందిన వెంకట్రావు, ఉప్పలమ్మ దంపతుల కుమారుడు గోపిరాజు (18) సికింద్రాబాద్ వైఎంసీఏ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అకౌంట్స్, ట్యాక్సేషన్ అండ్ ట్యాలీ (వృత్తివిద్య) చదువుతున్నాడు. ఆయనకు ప్యారడైజ్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో సెంటర్ పడింది. వార్షిక పరీక్షల్లో భాగంగా శనివారం ఇంగ్లీషు పేపర్ృ2 పరీక్ష రాసేందుకు ఉదయం 8.15 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే ఛాతిలో నొప్పిగా ఉండటంతో స్నేహితుడితో కలిసి పక్కనే ఉన్న మెడికల్‌షాపుకు వెళ్లి 2 ట్యాబ్లెట్స్ కొన్నాడు. వీటిలో ఒకటి వేసుకోగా వేంటనే వాంతి చేసుకోవడంతో కింద పడిపోయింది. ఆ తర్వాత మరో రెండుసార్లు వాంతి చేసుకున్నాడు. ఛాతీ నొప్పితో మెట్లు ఎక్కడం వల్లే నొప్పి కాస్తంత తక్కువగా ఉందని.. మరో ట్యాబ్లెట్ వేసుకుని పరీక్షాకేంద్రం లోపలికి వెళ్లాడు. స్నేహితుడి సాయంతో రెండో అంతస్తులో ఉన్న పరీక్ష గదిలోపలికి చేరుకున్నాడు. అప్పటికే ఆయన ఛాతి నొప్పితో బాధపడుతుండటం, ఆపై మెట్లు ఎక్కి రెండో అంతస్థుకు రావడంతో నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో చూస్తుండగానే గోపిరాజు అక్కడే కుప్పకూలిపోయాడు. కాలేజీ సిబ్బంది వెంటనే 108కు సమాచారం ఇచ్చినా.. రావడం ఆలస్యమైంది. దీంతో ఆ భవనం కిందే ఉన్న ప్రయివేటు డయాగ్నోస్టిక్‌కు సంబంధించిన అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోపిరాజు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాంగోపాల్‌పేట్ పోలీసులు సన్‌షైన్‌కు చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికీ తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారు సొంతూరికి తీసుకెళ్లారు. ఛాతీ నొప్పిపై అవగాహన లేకే! గోపిరాజుకు ఉదయం 8.30గంటల సమయంలోనే చాతినొప్పి వచ్చింది. అయితే స్నేహితులు ఆసుపత్రికి వెళ్దామంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందంటూ వారించాడు. ఛాతినొప్పిని గుండెపోటుగా గుర్తించలేకపోవడం.. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్లే మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. నొప్పి రాగానే ఆసుపత్రికి చేరుకుని ఉంటే కాపాడే వారమన్నారు. దీంతోపాటు పరీక్షాకేంద్రంలో కుప్పకూలిపోయినప్పుడు సిబ్బంది ఫిట్స్ అనుకుని ఆలస్యం చేయడం కూడా ఈ అవాంఛనీయ ఘటనకు కారణం. 108 అంబులెన్సు ఆలస్యంగా రావడం.. రోడ్డు దాటితే సన్‌షైన్ ఆసుపత్రి ఉన్నా అంబులెన్సు కోసం వేచి చూడటం ఇవన్నీ కారణాలుగానే భావించాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పేద కుటుంబం.. చదువులో ఆణిముత్యం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం, కొక్కిరేని గ్రామానికి చెందిన వెంకట్రావ్, ఉప్పలమ్మ దంపతులు దాదాపు 15 ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి ఎల్లారెడ్డిగూడలో స్థిరపడ్డారు. తండ్రి వెంకటరావు అదే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఐదుగురు సంతా నం కాగా వీరిలో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు. గోపిరాజు నాలుగో సంతానం. తల్లి ఉప్పలమ్మ గతేడాది నుంచి కిడ్నీ వ్యాధి తో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె డయాలసిస్ చేయించుకుంటుంది. మొదటి కుమార్తెకు వివాహం కాగా.. రెండవ కుమార్తె పక్కనున్న ఇళ్లలో పనిచేస్తోంది. మూడో కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. గోపిరాజు తమ్ముడు అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పేదరికం కారణంగా ఖర్చుల కోసం గోపిరాజు ఉదయమే లేచి న్యూస్పేప ర్ వేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. చదువులో కూడా గోపిరాజు ముందంజలో ఉన్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం 79% మార్కులు సాధించాడు. గోపిరాజు పడి పోయాడని తెలియగానే వెంటనే తాము ఆస్పత్రికి తీసుకెళతామని చెప్పినా సిబ్బంది ఒప్పుకోలేదని, ఆలస్యం చేశారని ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
-
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
సాక్షి, వరంగల్ అర్బన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు (బుధవారం) మొదయ్యాయి. ఎలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే, హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్డీ కళాశాలలో ఒక విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. కాలేజీ సిబ్బంది గుర్తించారు. దీంతో అవమాన భారానికి గురైన పోలసాని రక్షరావు (16) కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన రక్షను ఆస్పత్రికి తరలించారు. (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం) తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. నేటినుంచి జరుగుతున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా హాల్లోకి రానిచ్చేది లేదని అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫస్టియర్, సెకండియర్ కలుపుకొని ఏపీలో 10లక్షల 17వేల 600 మంది పరీక్ష రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1430 పరీక్షా కేంద్రాలను ఏపీ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మొత్తం 113 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందిపెట్టే కాలేజీలపై ఓవైపు చర్యలు తీసుకుంటామంటూనే... తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరంటూ ఏపీ బోర్డు అధికారులు స్పష్టంచేశారు. మాల్ ప్రాక్టీస్ చేస్తే 8 పరీక్షల వరకూ డీబార్ చేస్తామని విద్యార్థులను హెచ్చరించారు. ఇటు తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తమ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు.. దానిపై ఎలాంటి సంతకం అవసరంలేదని విద్యార్థులకు తెలంగాణ బోర్డు అధికారులు భరోసా కల్పించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో వచ్చేనెల 16, ఏపీలో మార్చి 18తో పరీక్షలు ముగియనున్నాయి. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు భారీగా గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫిజిక్స్ పేపరు–1, ఎకనామిక్స్ పేపరు–1 పరీక్షలకు విద్యార్థులు భారీ సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో అత్యధికంగా 28 వేల మంది గైర్హాజరు కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 38,083 మంది గైర్హాజరు కావడం గమనార్హం. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు 5,50,395 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,12,312 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే 6.91 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే, ఇప్పటివరకు కొన్ని పరీక్షల్లో అత్యధికంగా 21 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 45 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులను బుక్ చేశారు. ఇందులో అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 10 మంది, మంచి ర్యాలలో నలుగురు, పెద్దపల్లిలో ఇద్దరు, జగిత్యాలలో ఒక్కరు, ఖమ్మంలో ముగ్గురు, సిద్దిపేట్లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు, యాదాద్రిలో ఐదుగురు, జోగులాంబలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో నలుగురు, నాగర్‌కర్నూలులో నలుగురు, సంగారెడ్డిలో నలుగురు, హైదరాబాద్‌లో ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ అయ్యాయి. -
ఇంటర్ ఇంగ్లిష్–2 పరీక్షకు 20,300 మంది గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్–2 పరీక్షకు 20,300 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ కేటగిరీలకు సంబంధించి మొత్తం 4,25,848 మంది విద్యార్థులకుగాను 4,05,548 మంది మాత్రమే పరీక్ష రాశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా ఇందులో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు, నిర్మల్ జిల్లాలో మూడు కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆల్ ది బెస్ట్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు సిటీబ్యూరో: ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షల్లో భాగంగా తొలిరోజు ప్రథమ సంవత్సరం పరీక్ష జరగనుంది. గ్రేటర్ పరిధిలో దాదాపు 1.92 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోనున్నారు. వీరికోసం 400కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇప్పటికే అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య నుంచి గట్టెక్కేందుకు వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయలు దేరాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని కేంద్రాలను అనసంధానం చేస్తూ గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తోంది. కాగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఆహారం, ఆరోగ్యం విషయంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని మానసిక, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతుండడంతో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఆర్టీసీ వెయ్యి ప్రత్యేక బస్సులు ఈ నెల 1వ తేదీ నుంచి 18 వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 1000 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ హాల్టిక్కెట్లతో పాటు ఉచిత, రాయితీ బస్‌పాస్‌లను కూడా కలిగి ఉండాలి. ఈ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ 9959226160, 9959226154 నెంబర్లకు సంప్రదించవచ్చు. -
‘టెన్త్’లో 5 నిమిషాల ఆలస్యం.. ఓకే
⇒ ఇంటర్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ⇒ జిల్లా కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 14 నుంచి మొదలవనున్న ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకే ప్రారంభం కానుండగా.. 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. అదే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాత్రం నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జిల్లాల్లో ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షల ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలివీ.. ► పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. అత్యవసరమైతే బయట బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసుల ఫోన్‌ను వినియోగించాలి. దానికి సంబంధించి ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, ఎంత సమయం మాట్లాడారన్న వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. ► ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించవద్దు. దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందు నుంచే (ఉదయం 8 గంటల నుంచి) హాల్లోకి అనుమతిస్తారని, ముందుగానే రావాలని తెలియజేయాలి. ► పదో తరగతి పరీక్షలకు మాత్రం ఐదు నిమిషాల వరకు ఆలస్యాన్ని అనుమతించవచ్చు. ► పరీక్ష కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేలా చూడాలి. విద్యార్థులకు ఏ రూట్ పాస్ అయినా అనుమతించాలి. ► పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలి. ప్రథమ చికిత్స కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ► పరీక్షలకు ఆటంకం కల్పించే వారిపై సెక్షన్ 25 ప్రకారం‡ చర్యలుంటాయి. చిట్టీలు అందించినా, పరీక్ష కేంద్రం గోడలు దూకి వచ్చినా, మాల్‌ప్రాక్టీస్‌కు సహకరించినా, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించినా కేసులు నమోదు చేస్తారు. ► విద్యార్థులు పాఠశాలల యూనిఫారాలు వేసుకురావద్దు. ► పరీక్ష కేంద్రం లొకేటర్ యాప్ వినియోగం ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైతే.. వచ్చే ఏడాది నుంచి టెన్త్‌కు కూడా అమలు చేస్తారు. -
ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది. ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది. ఫీజును మీసేవా/ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100, ఇంటర్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చెల్లించాలని సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు. -
రేపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
విడుదల చేయనున్న మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1వ తేదీనుంచి టెన్త్ పరీక్షలను మార్చి 14వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు షెడ్యూళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు జరిగేలానే ఏపీలోనూ షెడ్యూల్ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నారుు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ముందు భావించినా ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌లో నియమించాలని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది. -
ఇంటర్ పరీక్షల తర్వాతే టెన్త్ పరీక్షలు!
- పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ కసరత్తు - రెండూ కలిపి నిర్వహించడం కష్టమేనంటున్న అధికారులు - మూడు, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం.. తేదీల ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను కలిపి నిర్వహిం చాలా? వేర్వేరుగా నిర్వహించాలా? అన్న అంశం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలో మొదట ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ప్రధాన పరీక్షలు పూర్తయ్యాక పది పరీక్షలు ప్రారంభిస్తే సమస్య లు లేకుండా సాగవచ్చన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చింది. సీబీఎస్ఈ తరహాలో పాఠశాలల్లో పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభిస్తున్నందునా పదో తరగతి పరీక్షలనూ ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే మార్చి మొదటి వారంలోనే ఒకే తేదీల్లో రెండింటి పరీక్షలను ప్రారంభించి, ఒకే తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో టెన్త, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించింది. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చిం ది. 2 రోజుల కిందట పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు సమావేశమై చర్చించారు. మధ్యా హ్నం నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలను తీసుకెళ్లడంలో సమస్యలు ఎదురవుతాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. పైగా 2 రకాల పరీక్షలను నిర్వహించడం, ఒక పరీక్ష తర్వాత మరో పరీక్ష కోసం హాల్‌టికెట్ల నంబర్లు వేయడం సమస్యగా మారుతుందన్న భావనకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను పక్కనబెట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయంలో పట్టుదలతో ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోనే పరీక్ష కేంద్రా లను ఏర్పాటుచేసి, నిర్వహించాలంటే ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని త్వరలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో మరోసారి చర్చించి తీసుకోనున్నారు. పాత పద్ధతిలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, టెన్త పరీక్షలను నిర్వహించడంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంటర్, టెన్త పరీక్షల తేదీలపైనా కసరత్తు చేస్తున్నారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు..? ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభిం చే ఆలోచనలు చేస్తున్నారు. మరీ ముందస్తు అవుతుందని, నిర్వహించడం సాధ్యమేనా? అన్న అంశంపై చర్చిస్తున్నారు. మార్చి 8 నుంచి ప్రారంభిస్తే ఆలస్యమవుతుందన్న భావనా ఉంది. మార్చి 2 లేదా 3వ తేదీల్లో పరీక్షలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు 2 కలిపి నిర్వహించాలని మొదట్లో భావించిన దృష్ట్యా మార్చి 3 లేదా 4 తేదీల్లో.. వీలుకాకపోతే 7 లేదా 8 తేదీల్లో నిర్వహించా లన్న ఆలోచన చేశారు. ప్రస్తుతం ఇంటర్ తర్వాతే పది పరీక్షలను నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చిన దృష్ట్యా మార్చి 15 నాటికి పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, పరీక్షల ప్రారంభ తేదీలపై మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం కడియంతో చర్చించిన తర్వాత పరీక్షల టైమ్‌టేబుళ్లను ప్రకటించే అవకాశం ఉంది. -
పరీక్ష కేంద్రం గుర్తింపునకు మొబైల్ యాప్
- హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయగానే పరీక్ష కేంద్రం గుర్తింపు - అందుబాటులోకి రూట్ మ్యాప్ రూపొందించిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పరీక్ష కేంద్రం ఎక్కడుందోనని ఆందోళన చెందుతున్నారా? ఎలా వెళ్లాలో మార్గం తెలియదని ఆలోచిస్తున్నారా? ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. దాని సహాయంతో పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఇట్టే తెలుసు కోవచ్చు. ప్రస్తుతం గ్రూపు-2 రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం యాప్‌ను రూపొందించింది. స్మార్ట్ ఫోన్లు కలిగిన వారు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ యాప్‌తో హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా జీపీఎస్ సాయంతో పొందవచ్చు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలకు హాజరయ్యే వారికి అందజేసే హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం ఎక్కడుం ది? ఏ జిల్లా, ఏగ్రామం, కేంద్రం పేరు మాత్రమే ముద్రిం చి ఉండేవి. ఈనెల 11, 13 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,916 కేంద్రాల్లో జరిగే గ్రూపు-2 రాత పరీక్షకు 7,89,985 మంది అభ్యర్థులు హాజరు కానున్నా రు. వారంతా మొబైల్ యాప్ సేవలను పొందేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియెట్ పరీక్షలకు కూడా...: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా మొబైల్ యాప్ సేవలను అందుబా టులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 10 లక్ష ల మంది విద్యార్థులకు ఈ యాప్‌ను అందుబాటు లోకి తేవాలని యోచిస్తోంది. దీంతో వారు పరీక్ష కేంద్రాన్ని సులభంగా కనుక్కునేలా, రూట్‌ను తెలుసుకునేలా ఉండాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపైనా బోర్డు దృష్టి సారించింది. -
‘టెక్నాలజీ’ పూర్తిగా వాడేశాడు...!
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు సహకరించిన స్నేహితుడూ రిమాండ్ పంజగుట్ట: అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థితో పాటు అతడికి సహకరించిన మరో విద్యార్థిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ నవ్భారత్నగర్ నివాసి షేక్ ఎజాజ్ (19) 2014లో ఎస్సార్‌నగర్‌లోని న్యూవిజన్ జూని యర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఆరు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సెల్‌ఫోన్ సంస్థలో పని చేసిన ఇతను ఫోన్ టెక్నాలజీ-పని తీరును పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఈ టెక్నాలజీతో కాపీయింగ్‌కు పాల్పడి ఎలాగైనా ఇంటర్మీడియట్ పాస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా ఇందుకు అవసరమైన బ్లూటూత్, వైర్లెస్ మైక్రోఫోన్, చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్‌ఫోన్ తెప్పించుకున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని రాయల్ జూనియర్ కాలేజీలో పరీక్ష సంటర్ పడింది. ఇంజినీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న తన స్నేహితుడు మహ్మద్ సమీయుల్లా (19) సాయంతో సివిక్స్ -1, సివిక్స్ -2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వెళ్లగా... చీఫ్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి ఎజాజ్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించాడు. వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎజా జ్, సమీయుల్లాలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
మార్చి 28 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే మార్చి 28 నుంచి ఏప్రిల్ 19 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 11లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక్కో పేపరుకు రూ.25 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 18 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని వివరించారు. -
ఇంటర్ పరీక్షలపై గవర్నర్‌కు వివరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వేరుగా నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ అధికారులు వికాస్‌రాజ్, శైలజా రామయ్యార్, రామశంకర్ నాయక్ వివరించారు.మంగళవారం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అనంతరం వారు సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి గవర్నర్‌తో చర్చించిన అంశాలను వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చిం చినట్లు తెలిసింది. వాటితోపాటు ఇంటర్మీడియెట్ పరీక్షల గురించి చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలపై బుధవారం సాయంత్రం తెలంగాణ, ఏపీ విద్యా శాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో గవర్నర్ భేటీ కానున్నట్లు తెలిసింది. -
ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే..
-
ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే..
ఇంటర్ బోర్డుకు ఏపీ మంత్రి గంటా ఆదేశం రెండు రాష్ట్రాలకూ ఒకే ప్రశ్నపత్రం హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ బోర్డును ఆదేశించారు. ఉమ్మడి ప్రవేశాల అంశం ఉన్నందున ఇంటర్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఏకీకృతంగానే రూపొం దించాలని చెప్పారు. విద్యాశాఖపై మంత్రి మం గళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్ చదువుకున్న విద్యార్థుల తదుపరి ఉన్నత విద్యా ప్రవేశాలను రెండు రాష్ట్రాల్లోనూ ఉమ్మడిగా జరపాల్సి ఉన్నందున ఇంటర్ పరీక్షలు కూడా ఉమ్మడి ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలని మంత్రి చెప్పారు. డైట్సెట్పై త్వరితగతిన చర్యలు డైట్‌సెట్ ప్రవేశాలపై ఈ భేటీలో విస్తృత చర్చ జరిగింది. ఈ ప్రవేశాలకు ఆటంకంగా ఉన్న సాంకేతికాంశాలను పరిష్కరించాలని, డైట్‌సెట్ ఇప్పటికే ఆలస్యమైనందున త్వరితంగా ప్రవేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గంటా సూచించారు.ఓపెన్ స్కూళ్లకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో కూడా మంత్రి గంటా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని జాక్టో ప్రతినిధులు, ఎమ్మెల్సీలు సమావేశానంతరం వివరించారు.