ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫిజిక్స్ పేపరు–1, ఎకనామిక్స్ పేపరు–1 పరీక్షలకు విద్యార్థులు భారీ సంఖ్యలో గైర్హాజరయ్యారు.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫిజిక్స్ పేపరు–1, ఎకనామిక్స్ పేపరు–1 పరీక్షలకు విద్యార్థులు భారీ సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో అత్యధికంగా 28 వేల మంది గైర్హాజరు కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 38,083 మంది గైర్హాజరు కావడం గమనార్హం. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు 5,50,395 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 5,12,312 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే 6.91 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
అలాగే, ఇప్పటివరకు కొన్ని పరీక్షల్లో అత్యధికంగా 21 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాగా, శుక్రవారం జరిగిన పరీక్షల్లో 45 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులను బుక్ చేశారు. ఇందులో అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 10 మంది, మంచి ర్యాలలో నలుగురు, పెద్దపల్లిలో ఇద్దరు, జగిత్యాలలో ఒక్కరు, ఖమ్మంలో ముగ్గురు, సిద్దిపేట్‌లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు, యాదాద్రిలో ఐదుగురు, జోగులాంబలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో నలుగురు, నాగర్‌కర్నూలులో నలుగురు, సంగారెడ్డిలో నలుగురు, హైదరాబాద్‌లో ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ అయ్యాయి.