తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వేరుగా నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వేరుగా నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ అధికారులు వికాస్‌రాజ్, శైలజా రామయ్యార్, రామశంకర్ నాయక్ వివరించారు.మంగళవారం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అనంతరం వారు సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి గవర్నర్‌తో చర్చించిన అంశాలను వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివిధ అంశాలపై చర్చిం చినట్లు తెలిసింది. వాటితోపాటు ఇంటర్మీడియెట్ పరీక్షల గురించి చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలపై బుధవారం సాయంత్రం తెలంగాణ, ఏపీ విద్యా శాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో గవర్నర్ భేటీ కానున్నట్లు తెలిసింది.