ఇంటర్‌ ఇంగ్లిష్‌–2 పరీక్షకు 20,300 మంది గైర్హాజరు | 20,300 students absences to the inter english-2 exam | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఇంగ్లిష్‌–2 పరీక్షకు 20,300 మంది గైర్హాజరు

Published Sun, Mar 5 2017 3:25 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

20,300 students absences to the inter english-2 exam

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌–2 పరీక్షకు 20,300 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్‌ కేటగిరీలకు సంబంధించి మొత్తం 4,25,848 మంది విద్యార్థులకుగాను 4,05,548 మంది మాత్రమే పరీక్ష రాశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాగా ఇందులో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు, నిర్మల్‌ జిల్లాలో మూడు కేసులు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement