వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే మార్చి 28 నుంచి ఏప్రిల్ 19 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 11లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక్కో పేపరుకు రూ.25 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 17 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో వచ్చే నెల 18 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. మీసేవా లేదా ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనే పరీక్ష ఫీజు చెల్లించాలని వివరించారు.
మార్చి 28 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
Published Fri, Jan 29 2016 4:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement