విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ప్రవేశ పరీక్షా ఫలితాలు ఉన్నాయి. మార్కుల ఫలితాల ఆధారంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీలకు నీట్ నుంచి మినహాయింపు లేదన్నారు. ప్రైవేట్ కాలేజీలో సీటుకు నీట్ తప్పనిసరిగా రాయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులను నీట్కు సిద్ధం చేస్తామని చెప్పారు.