ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం (జనరల్, ఒకేషనల్) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.
కర్నూలులో విడుదల చేయనున్న మంత్రి గంటా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం (జనరల్, ఒకేషనల్) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సుసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంవీ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫలితాలను వివిధ వె బ్‌సైట్లలో పొందుపర్చనున్నట్లు ఎంవీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు www.sakshi.com లో కూడా అందుబాటులో ఉంటాయి.