టాపర్లంతా..అమ్మాయిలే
♦ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థినులదే పైచేయి
♦ ప్రథమ సంవత్సరంలో 69, ద్వితీయ సంవత్సరంలో
♦ 80 శాతం బాలికల ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో బాలికలు విజయ దుందుభి మోగించారు. ప్రథమ, ద్వి తీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం తోపాటు ర్యాంకులు, సబ్జెక్టుల్లో అత్యు త్తమ మార్కుల సాధనలోనూ అగ్రస్థా నంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర మానవ వన రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయ వాడలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయ ణరెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్, ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీ య సంవత్సరాల ఫలితాలతో పాటు వొకేషనల్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఏడాది మార్కు ల ఆధారంగా ఉత్తీర్ణత వివరాలను ప్రకటించినా, వచ్చే ఏడాది నుంచి గ్రేడ్‌ల వారీగా ఫలితాలను వెల్లడిస్తా మని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
మార్కులను ప్రకటించడా న్ని నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మంత్రి గంటా గ్రూపుల వారీగా వాటిని ప్రకటించడం గమనా ర్హం. టాప్ 10 ర్యాంకుల్లో మొదటి మూడు ర్యాంకులు, సదరు విద్యార్థుల పేర్లు, వారు సాధించిన మార్కులను వెల్లడించారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగింది. ప్రథమ సంవత్సరంలో 64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కడప జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది.
మే 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తాము ఆశించిన మేర మార్కులు సాధించలేదనుకున్న వారు, సబ్జెక్టు లు ఫెయిలైన వారు మే 15వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ చెప్పారు. ఈ పరీక్షలకు ఈ నెల 20వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫి కేషన్‌కు ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఐఏఎస్ అవుతా...
రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందటం సంతోషంగా ఉంది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఇదే కష్టాన్ని, క్రమశిక్షణను కొనసాగిస్తాను. నిత్యం నన్ను ప్రోత్సహించిన వీరిశెట్టి జూనియర్ కళాశాల డైరెక్టర్ నాగప్రసాద్, ప్రిన్సిపల్ శివశంకర్, తల్లిదండ్రులు షేక్ అబ్దుల్ అజీజ్, పర్వీన్, తాత మస్తాన్‌లకు రుణపడి ఉంటాను.
– షర్మిల, సీనియర్ ఎంపీసీ స్టేట్ ఫస్ట్
(992), ప్రకాశం జిల్లా పొదిలి
నా ప్రాంత వాసులకు సేవ చేస్తా...
నీట్‌లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్ పూర్తిచేసి నా ప్రాంత వాసులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. నాన్న ఆలపర్తి వెంకటేశ్వర్లు చిరుద్యోగి, అమ్మ సురేఖ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. నాకు వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు, వీజీఆర్‌ఎం కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– ఆలపర్తి నైమిష, సీనియర్
బైపీసీ స్టేట్ ఫస్ట్ (991), బాపట్ల