
బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు!
ప్రకటించిన మంత్రి గంటా
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వివాదం రేపిన బీచ్ లవ్ ఫెస్టివల్ ఎట్టకేలకు రద్దయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం ఉబలాట పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నవంబరు 3న ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచిక ప్రచురించిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. (చదవండి : బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్ )
ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ జరగదని, రద్దయిందని బుధవారం విశాఖలో విలేకరులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్ జరుగుతుందని మంత్రి తెలిపారు.