రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహణపై ఊగిసలాటకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ...
ఏపీ ప్రభుత్వ నిర్ణయం నేడు మంత్రి గంటా అధికారిక ప్రకటన
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహణపై ఊగిసలాటకు ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడిగానే ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉన్న ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అధికారిక ప్రకటన చేయనున్నారు. గతంలో ప్రకటించినట్టుగానే మే 10న ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశాలున్నాయి.