నేడు తెలంగాణ ఎంసెట్–3
నేడు తెలంగాణ ఎంసెట్–3
Published Sat, Sep 10 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
– ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
– ఎంసెట్–2 పరీక్ష రాసిన వారికే అవకాశం
– రీజినల్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలంగాణ పరిధిలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం తలపెట్టిన ఎంసెట్–3ని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎంసెట్–2 రాసిన 2700 మందికి మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉందన్నారు. జిల్లాకు సంబంధించి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, సెయింట్ జోసెప్ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. హాల్ టిక్కెట్‌తోపాటు ఆన్‌లైన్ దరఖాస్తు తెచ్చిన వారికే అనుమతి ఉంటుందన్నారు. పరీక్ష పర్యవేక్షణకు 8 మంది అబ్జర్వర్లు, నలుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, ఒక్కరూ స్పెషల్ అబ్జర్వర్‌ను నియమించామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Advertisement