
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎంసెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.
ఎంసెట్‌తో సహా 8 సెట్ల షెడ్యూళ్లను తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. అన్ని సెట్లనూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు. ముందుగా ఎడ్‌సెట్, లాసెట్‌ను ఏప్రిల్ 19న నిర్వహిస్తామని, మే 4న జరిగే పీఈసెట్‌తో సెట్స్ ముగుస్తాయని తెలిపారు. ఎంసెట్ కోసం 115 నుంచి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment