3 రోజుల్లో 94.61 శాతం హాజరు
సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్‌లో భాగంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 128 కేంద్రాల్లో మూడురోజుల పాటు ఆన్‌లైన్లో ఈ ప్రవేశపరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,98,158 మంది విద్యార్థులకు గాను 1,87,484 మంది విద్యార్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.
శుక్రవారం అగ్రి, ఫార్మా తదితర కోర్సులకు సంబంధించి (బైపీసీ స్ట్రీమ్) ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు 80,735 మంది దరఖాస్తు చేసుకోగా ఏపీ తెలంగాణల్లో కలిపి 139 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రిలిమనరీ కీ 28వ తేదీన ఎపీ ఎంసెట్ వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు.కీపై అభ్యంతరాలను మే 1వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని చెప్పారు.
ముగిసిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష
Published Thu, Apr 27 2017 1:22 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement