హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే వెల్లడించింది. వీటిలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్‌సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఎప్‌సెట్(EAPCET) ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి3) ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది. ఎప్‌సెట్ పరీక్షలు జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.
పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారు..
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.
కాగా, ఈ ఏడాది నిర్వహించనున్న అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్ష(సెట్)ల తేదీలను ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాసే వారికి ఇబ్బంది రాకుండా సెట్ పరీక్షల తేదీలను వేర్వేరు రోజుల్లో ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment