ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్‌ ఇదే | Telangana Congress Govt Praja Palana Vijayotsavalu Schedule Release | Sakshi
Sakshi News home page

ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్‌ ఇదే

Published Thu, Nov 28 2024 6:09 PM | Last Updated on Thu, Nov 28 2024 7:19 PM

Telangana Congress Govt Praja Palana Vijayotsavalu Schedule Release

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు.  భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనుంది.

డిసెంబర్ 2వ తేదీ అన్ని జిల్లాల్లో సీఎం కప్ పోటీలను  ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏడాది కాలం పనితీరుపై లెక్కలను మంత్రులు వెల్లడించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త వేడుకలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది.

డిసెంబర్ 1:
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.
విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.
సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)

డిసెంబర్ 2:
16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం
213 కొత్త అంబులెన్సులు ప్రారంభం
33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభం
ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టు

డిసెంబర్ 3:
హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు
ఆరాంఘర్‌ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.
రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం

డిసెంబర్ 4:
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ భవన శంకుస్థాపన
వర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం
9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.

డిసెంబర్ 5:
ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం
స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు
3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం
ఘట్ కేసర్‌లో బాలికల ITI కాలేజీ ప్రారంభం

డిసెంబర్ 6:
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం
244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.

డిసెంబర్ 7:
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం
పోలీస్ బ్యాండ్ ప్రదర్శన
తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.

డిసెంబర్ 8:
7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం
130 కొత్త మీ సేవల ప్రారంభం
యంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపన
తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు

డిసెంబర్ 9:
లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు
డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement