Praja Palana
-
ఫాంహౌస్ సీఎంను కాను..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఢిల్లీ పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేమీ ఫాంహౌస్ సీఎంను కాదు. పని చేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్లడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్‌లోనో లేదు. అది మన దేశ రాజధాని. ఇది ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనేక అంశాలుంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కడుతున్నాం. అందులో హక్కుగా రావాల్సిన మన వాటాను తిరిగి తెచ్చుకోవడం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతా..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఓ నిజాము పిశాచమా... కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..’అంటూ దాశరథి కృష్ణమాచార్య రాసిన కవితతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ఐక్యతను దెబ్బతియడానికే వివాదం ‘తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను, సమైక్యతను దెబ్బతీసే విధంగా సెపె్టంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరాని విషయం. నిరంకుశ నిజాం రాజు, ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగానే పోరాటం జరిగింది కాని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా కాదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం. విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదు.అందుకే ఈ శుభదినానికి ప్రజా పాలన దినోత్సవంగా నామకరణం చేశాం. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. తెలంగాణ అస్తిత్వం అంటే తమ కుటుంబ అస్తిత్వం, సంస్కృతి అని గత పాలకులు భావించారు. తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా నేను అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికా..’అని రేవంత్ చెప్పారు. ఎన్ని అడ్డంకులొచి్చనా హైడ్రా ఆగదు ‘గత పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. ప్రతి నెలా అసలు, వడ్డీ కలిపి రూ.6 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులందరినీ కలిసి, వినతిపత్రాలు ఇస్తున్నా. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ గత పాలకుల పాపంతో ఫ్లడ్స్ సిటీగా దిగజారింది. చెరువులు, నాలాలు కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచి్చనా హైడ్రా ఆగదు..’అని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమంలో మా రికార్డులు మేమే తిరగరాస్తున్నాం..‘మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేశాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. సంక్షేమంలో మా పార్టీ రికార్డులను మేమే తిరగ రాస్తున్నాం. మేం అధికారంలోకి వచి్చన 6 నెలల్లో ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం రూ.282 కోట్ల సబ్సిడీని, 49 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌కు రూ.965 కోట్ల సబ్సిడీని చెల్లించాం.87 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి రూ.2,958 కోట్లు ఆదా చేసుకున్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సహాయం అందించి ఈ ఏడాది 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం ఇవ్వబోతున్నాం. విద్యా రంగంలో సమూల మార్పులకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గల్ఫ్ కారి్మకులు విదేశాల్లో మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వారి సమస్యల అధ్యయనానికి ఒక కమిటీని వేశాం..’అని రేవంత్ తెలిపారు. -
కేరళ పరిస్థితి రాకూడదనే హైడ్రా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదన్నారు.కాగా, నేడు తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. అలాగే, నా స్వార్థం కూడా ఏమీ లేదు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. లేక్ సిటీ.. ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. భూమాఫియా గాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తాం. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా’ అని వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్.. పరేషాన్.. -
నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణది: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. 👉పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘సెప్టెంబర్ 17వ తేదీని కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిది. తెలంగాణ బాసిన సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. నిజాంనే మట్టికరించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయం విస్మరించారు. ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇందులో రాజకీయాలకు తావులేదు. ఒక జాతి తన స్వేచ్చ కోసం, ఆత్మగౌరవం కోసం, రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో, వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. అందుకే ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం.👉నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు. టీఎస్‌ను టీజీగా మార్చాం. ఇది అక్షరాల మార్పు కాదు, ప్రజల ఆకాంక్షల తీర్పు. గత పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పు, ప్రతీనెలా ఆరువేల కోట్ల మేర అసలు, వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి.👉డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వైభవంగా జరపబోతున్నాం. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. కేంద్రం నుంచి మన హక్కుగా రావాల్సిన ప్రతీ పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే భేషజాలు లేకుండా నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలిశాను. 👉హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. అలాగే, నా స్వార్థం కూడా ఏమీ లేదు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. లేక్ సిటీ.. ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. భూమాఫియా గాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ నివాళులు👉గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు👉తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్👉 రేవంత్‌తో పాటు నివాళులర్పించిన నగర మేయర్, పలువురు కాంగ్రెస్ నేతలు 👉గాంధీ భవన్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వీహెచ్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సహా పలువురు పాల్గొన్నారు. 👉ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. కాంగ్రెస్ వల్లనే స్వాతంత్య్రం వచ్చింది. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యింది. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. చదువుకున్న అనుకుంటున్న కేటీఆర్‌కి సంస్కారం లేదు. సంస్కారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా?. తెలంగాణ తల్లిని గౌరవించాలని.. సెక్రటేరియట్ గుండెల్లో విగ్రహం పెడుతుంది ప్రభుత్వం. 👉సెప్టెంబర్ 17, 1948 వరకు మన సంస్థానానికి స్వాతంత్ర్యం రాలేదు. దూరదృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పంపించింది దేశంలో విలీనం చేయించారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుంది. తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదు. ఆనాడు ఉన్న ఇప్పటి బీజేపీ అనుబంధ సంఘాలు బ్రిటిష్‌కి వంతపాడారు. వల్లభాయ్ పటేల్‌కి బీజేపీకి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. 👉నేడు తెలంగాణవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించనున్నారు. ఇక, సెప్టెంబర్ 17వ తేదీ సందర్భంగా ఇక ప్రతీ సంవత్సరం ప్రజా పాలన దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.👉తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.👉కాగా, ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మరోవైపు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి సీఎం నివాళులు అర్పించనున్నారు.👉ఇక, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారమే అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా పాలనా దినోత్సవంగా గెజిట్ విడుదల..తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా సెప్టెంబరు 17వ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజిట్ జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.#TelanganaNews #PrajaPalana @TelanganaCMO @revanth_anumula @V6News. pic.twitter.com/MlfqUHy8Es— Danasari Seethakka (@meeseethakka) September 17, 2024ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్.. పరేషాన్! -
మళ్లీ ‘ప్రజాపాలన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు జారీ చేయడమే ఎజెండాగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఇక నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింకు ఉండదని, వేర్వేరుగా రెండు కార్డులు జారీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో ఇదే ఎజెండాగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతి వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానాన్ని అనుసరిస్తున్నారని ఇటీవల విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని.. అక్కడ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇకపై రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలతోపాటు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించే సాయానికి ఈ డిజిటల్ హెల్త్ కార్డే ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక కార్యాచరణ రాష్ట్రంలో డెంగీ, చికెన్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న అంశంపై సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలన కోసం ఫాగింగ్, రసాయనాల స్ప్రే వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. పనిచేయని ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలి్పంచాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. డెంగీ, చికెన్‌గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు సూచించారు. -
'మహాలక్ష్మి' కోసం మహిళల నిరీక్షణ..
నిజామాబాద్: అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500ల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఫలితంగా ఈ పథకం కింద సాయం కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రధానంగా ఆసరా పథకం కింద పింఛన్ అందుకోలేని మహిళలు తమకు మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా ఆర్థిక సాయం అందిచడం ఒకటి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. ఆసరా పథకం కింద జిల్లాలో 77,158 మంది వితంతువులు, 10,520 మంది ఒంటరి మహిళలు, 96,264 మంది బీడీ కారి్మకులు ప్రతినెలా పింఛన్లను అందుకుంటున్నారు.వృద్ధాప్య, వికలాంగులు పింఛన్లలోనూ కొంత మంది అర్హులైన మహిళలు ఉన్నారు. జిల్లాలో 7,18,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆసరా పింఛన్లను అందుకోలేని మహిళలు మహాలక్ష్మి సాయం ద్వారా లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో మహాలక్ష్మి సాయం ఎంత మందికి వస్తుంది, ఎవరు అర్హులనే విషయం తేలుతుంది. అసలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకపోవడం, అర్హుల ఎంపికకు చర్యలు తీసుకోకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తంతు ఎలాగూ ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో కోడ్ ఎత్తివేసే అవకాశం ఉంది. అప్పటికైనా మహాలక్ష్మి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.ఇవి చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్ -
దరఖాస్తులు 66.30 లక్షలు.. కట్టేవి 4.16 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. భారీ కోత ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా టిక్ చేశారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షలు దాటాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన 14.75 లక్షల మంది కూడా మళ్లీ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. దీంతో మొదటి వడపోతలో భాగంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టేశారు. దీంతో 66.30 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వాటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మొదటి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరు చేస్తూ వెళ్లినా, వచ్చే ఐదేళ్లలో అటుఇటుగా 20 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఏమూలకూ చాలవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను రకరకాల అంశాల ఆధారంగా వడపోసి వీలైనంత మేర తగ్గించే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని నిరుపేదలు 30 – 35 లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుని తగ్గించినా.. దరఖాస్తుల్లో ఆ సంఖ్య మేరకు పోను మిగిలినవారు అంటే సుమారు 30 లక్షల మంది తప్పకుండా అనర్హులే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్సీసీ కప్పు ఉంటే ఔటే.. ప్రాథమికంగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. ఆర్సీసీ పైకప్పు ఉన్న సొంత ఇల్లు ఉంటే ఇందిరమ్మ పథకానికి అర్హత ఉండదు. చుట్టూ కాంక్రీట్ గోడలు ఉండి, కప్పు భాగంలో రేకులు, తడకలు, పెంకులు లాంటివి ఉంటే అర్హత వస్తుంది. దీంతో ఇప్పుడు గుట్టలాగా పేరుకుపోయి ఉన్న దరఖాస్తుల్లో.. అలా ఆర్సీసీ పైకప్పుతో ఉన్న సొంతింటిదారులు ఎవరున్నారని వెతికి పట్టుకునే పనిలో అధికారులున్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే.. ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా నిరుపేదలై ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారినే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ఈ దరఖాస్తుదారుల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎంతమంది తప్పుడు రేషన్‌కార్డు నంబర్లు నమోదు చేశారో అన్న వివరాలను కూడా వాకబు చేస్తున్నారు. ఈ సంవత్సరం సొంత జాగా ఉన్నవారికే! సొంత జాగా ఉన్నవారికే ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి మరీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సంవత్సరం మాత్రం సొంత జాగా లేని వారిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. -
తెలంగాణ: ‘మహాలక్ష్మి’, ‘గృహ జ్యోతి’ ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని.. అందుకే ఆర్థిక ఇబ్బందులున్నా చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో అభయహస్తం గ్యారెంటీల అమలులో భాగంగా.. ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన పథకం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేశామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూటికి నూరు శాతం అన్ని హామీలను అమలు చేస్తామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారాయన. అలాగే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని మరోసారి స్పష్టత ఇచ్చారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ఇస్తున్నామని, అలాగే మహాలక్ష్మీ పథకం కింద సబ్జిడీతో రూ.500 సిలిండర్ అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కోడ్ వల్లే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తుక్కుగుడలో సోనియా గాంధీ హామీ ఇచ్చారు. సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. రెండు పథకాలను చేవెళ్ళలో ప్రారంభించాలి అనుకున్నాం. ఎమ్మెల్సీ కోడ్ వల్ల అక్కడి నుంచి సెక్రటేరియట్ కు మార్చాల్సి వచ్చింది. ప్రియాంక గాంధీ కోడ్ కారణంగా రద్దు చేసుకున్నారు. కట్టెలపోయ్యి నుంచి గ్యాస్ సిలిండర్ ను ఆనాడే తక్కువకు ఇందిరా గాంధీ ఇచ్చారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ దీపం పథకం తీసుకొచ్చింది. రూ.400 కేగ్యాస్ సిలిండర్ అందించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు సిలిండర్ రేటు పెరిగింది. మోదీ గ్యాస్ ధరలు పెంచితే కేసీఆర్ సబ్సీడీ ఇవ్వలేదు. .. మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తాం. ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా...అపోహలు ప్రచారం చేసినా పథకాలు ఆగవు. సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం. ఆమె ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా పాలన చేస్తాం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం అని సీఎం రేవంత్ అన్నారు. ఉచిత విద్యుత్‌పై ఆ ప్రచారం నమ్మొద్దు: డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల స్కీమ్‌ను దేశం అంతా చూస్తోందని.. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అమలుకాని ఆరు గ్యారెంటీల హామీ కాంగ్రెస్ ఇచ్చినట్లు BRS మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే విమర్శలు చేస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు జేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరు గ్యారెంటీ లను అమలు చేయాలని అందరం పట్టుదలతో ఉన్నాం. అరకొర నిధులతో జీతాలు ఇస్తూనే, పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రారంభించిన గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలువబోతున్నాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమే ఇందిరమ్మ రాజ్యం అంటే. 200 యూనిట్లు అమలు అంటే కోతలు అని ప్రచారం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు రేపు మార్చి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వబోతున్నాం. అర్హత కలిగిన వారందరికీ ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ నేతలు బోగస్ ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు అని భట్టి పిలుపు ఇచ్చారు. ఇతర మంత్రులు.. భవిష్యత్తులో తెల్లకార్డు ఉండి ఎల్పీజీ కనెక్షన్ ఉంటే.. మహాలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది బల్ధిదారులున్నారని.. లబ్ధిదారుల జాబితాలో ఇప్పుడు లేనివారిని త్వరలోనే చేరుస్తామని చెప్పారాయన. మరో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొలువుదీరాక రెండు పథకాలు.. ఇప్పుడు మరో రెండింటిని ప్రారంభించామని.. నూటికి నూరు శాతం అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. -
దరఖాస్తులపై ఫిబ్రవరిలో ఇంటింటా సర్వే
కరీంనగర్: ప్రజాపాలనలో వేటికెన్ని అర్జీలొచ్చాయో లెక్క తేలింది. జిల్లాలో ఆన్లైన్ ప్రక్రియ ఇటీవలే ముగియగా మహాలక్ష్మి పథకానికి అత్యధిక అర్జీలు వచ్చాయని స్పష్టమవుతోంది. గత నెల 28 నుంచి ఈ నెల 6వరకు గ్రామాల్లో, పట్టణాల్లో రోజూవారీగా అర్జీలు స్వీకరించగా వెల్లువలా దరఖాస్తులు వచ్చిన సంగతి విదితమే. సదరు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ పూర్తవగా ఇక క్షేత్రస్థాయి పరిశీలన మిగిలింది. తస్మాత్ జాగ్రత్త లక్షల మంది అర్జీలు ఇచ్చిన క్రమంలో ఆరు గ్యారంటీల సాకుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నట్లు సమాచారముందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచితులు పంపించే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని, ఓటీపీలను చెప్పవద్దని చెబుతు మోసానికి గురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. ఫిబ్రవరిలో క్షేత్రస్థాయి పరిశీలన అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తవగా ఫిబ్రవరిలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. అనర్హులను ఏరివేసి అర్హులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకమవటంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందించటమే లక్ష్యంగా సబ్ కమిటీ పనిచేయనుంది. సదరు కమిటీ గైడ్‌లైన్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో గ్రామాలు: 313, మున్సిపాలిటీలు: 5, వచ్చిన అర్జీలు: 3,22,264 (రేషన్ కార్డులకు కలిపి), గ్యారంటీలకు వచ్చిన అర్జీలు: 3,21,246, మొత్తంగా కవరైన నివాసాలు: 3,12,186 ఆన్‌లైన్‌తో తేలిన లెక్క ఇదీ.. రూ.2500కు వచ్చిన అర్జీలు: 2,26,401 రూ.500కు గ్యాస్‌కు: 2,77,292 ఇందిరమ్మ ఇండ్లకు: 2,17,180 గృహజ్యోతికి: 2,35,091 రైతు భరోసాకు: 1,02,172 రైతు కూలీలకు: 1,11,187 -
రేవంత్ రెడ్డి ఫోకస్ మారితేనే మంచిది!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును బెదిరిస్తున్నట్లుగా ఉంది. పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామని చెప్పడం ద్వారా తన ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారు. లండన్‌లో తన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ను వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వంద మీటర్ల లోతున పాతిపెడతామని కూడా ఆయన అన్నారు. లండన్ నుంచే ఆయన పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఆరంభించినట్లు అనిపిస్తుంది. నిజానికి విదేశాలకు వెళ్లినప్పుడు తన ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడానికి సహజంగా యత్నిస్తారు. తన లక్ష్యాలను వివరిస్తారు. కాని రేవంత్ తన స్పీచ్‌లో కేసీఆర్‌ను, కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పులి అవుతారో, ఎప్పుడు పిల్లి అవుతారో చెప్పలేం. ఎవ్పుడైనా ,ఎవరైనా, ఏమైనా కావచ్చు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డే. 2015లో ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలైనప్పుడు ఆయన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. శాసనసభ నుంచి ఆయన బహిష్కరణకు కూడా గురయ్యారు. తదుపరి 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చెందారు. అప్పుడు రేవంత్ రాజకీయంగా బాగా వెనకబడి పోయినట్లు అనిపించింది. కాని అదృష్టం కలిసి వచ్చి మల్కాజిగిరి నుంచి స్వల్ప ఆధిక్యతతో లోక్‌సభకు గెలవడం ఆయన రాజకీయ జీవితంతో ఒక పెద్ద మలుపు అయింది. తదుపరి రేవంత్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు అవడం, అనంతరం ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం జరిగింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా దురుసుగా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన భాషపై అభ్యంతరాలు వచ్చేవి. అయినా రేవంత్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయనపై విమర్శలు బీఆర్ఎస్ వంతుగా మారింది. కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కాని, మాజీ మంత్రి హరీష్ రావు కాని కాంగ్రెస్ హామీలను పదే, పదే గుర్తు చేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అసమ్మతి, అసంతృప్తి పెరిగేలా ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది రేవంత్‌కు గుర్రుగానే ఉంటుంది. ఆయన మంత్రివర్గ సహచరుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్రమంలోనే రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 'ఎన్నికలలో బీఆర్ఎస్ బొక్కబోర్లాపడ్డా బుద్ది రాలేదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా వంద మీటర్ల లోతున బొందపెడతాం. పులి బయటకు వచ్చేస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎదురుచూస్తున్నా.. నా దగ్గర బోను, వల ఉన్నాయి..' అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమే. అంటే దీని అర్ధం కాలు జారి పడ్డ కేసీఆర్ కోలుకుని మళ్లీ ప్రజాజీవనంలోకి వస్తే ఆయనను ఏదో కేసులో పెట్టి అరెస్టు చేస్తామని చెప్పడమేనా అన్న ప్రశ్న వస్తుంది. కాకపోతే, ఆ మాట ఆయన నేరుగా చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్చ జరగకూడదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు తెలియచేయరాదన్నట్లుగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రవర్తిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిజమే! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్ ఆ విషయం తప్ప మిగిలిన అంశాలపైనే కేంద్రీకరిస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదే, పదే ప్రస్తావించడం ద్వారా రేవంత్‌ను ఇరకాటంలోకి నెట్టడానికి కేటీఆర్, హరీష్‌రావు ఇతర నేతలు వ్యవహరిస్తారు. కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుని వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఆయన తక్షణమే ప్రజలలో తిరగాలని అనుకోకపోవచ్చు. మహా వస్తే పార్టీ ఆఫీస్‌కు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లవచ్చు. ఎటూ మరో మూడు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తేల్చుకుందామని రేవంత్ అన్నట్లుగానే కేసీఆర్ కూడా అందుకు సిద్దం అవుతుండాలి. ఈలోగానే మాటల యుద్దంలో పైచేయి సాధించడానికి ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కు కాళేశ్వరం వీక్ పాయింట్ అయినట్లుగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు వీక్ పాయింట్లు అవుతాయి. వాటిని అమలు చేయలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నేతలపైన విమర్శలు చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది. ఇంతవరకు ఆర్టీసీ బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేశారు. దీనివల్ల మొదట కాస్త ఆకర్షణ ఏర్పడినా, రానురాను అది తగ్గుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. బస్‌లలో సీట్లు చాలకపోవడం, అందరిని ఎక్కించుకోకపోవడం, అన్ని బస్ లలో ఈ సదుపాయం లేకపోవడం, ఈ స్కీమ్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికన్నా వంట గ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే ఇచ్చే స్కీమ్ అమలు చేసి ఉంటే రేవంత్ ప్రభుత్వానికి ప్రజలలో ప్రత్యేకించి పేదవర్గాలలో గుడ్ విల్ పెరిగేది. కాని ఆ స్కీమ్ అమలు చేయాలంటే డబ్బు కూడా ఎప్పటికప్పుడు చెల్లించవలసి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. సుమారు కోటి మంది వరకు ఆ స్కీమ్ కింద సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏడాది అయ్యే వ్యయం సుమారు 2500 కోట్లు అని అంచనా వేశారు. దీనితో పాటు వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు ఇవ్వవలసి ఉంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన వాగ్దానాల జాబితా చాంతాడు అంత అవుతుంది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్ ఒక పిలుపు ఇచ్చారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందువల్ల జనవరి బిల్లులను చెల్లించవద్దని, ఆ బిల్లులను సోనియాగాంధీ చిరునామాకు పంపించాలని ఆయన ప్రజలకు సూచించారు. వీటిని గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుంది. ఎందుకంటే వీటన్నిటిని అమలు చేయడం సాధ్యం కాదని వారికి తెలుసు కాబట్టి. బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతున బొందపెట్టడం సరే కాని, ముందుగా వంద రోజుల లోపు హామీలను అమలు చేయాలని, రేవంత్ మాదిరి అహంకారంగా మాట్లాడేవారిని చాలామందిని చూశామని ఆయన అన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేసేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావవడంతో వాటి రుచిని ఆయన చవిచూస్తున్నారు. రేవంత్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాధ్ షిండేతో పోల్చుతూ ఎప్పటికైనా కాంగ్రెస్‌ను చీల్చుతారన్నట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌ది బీజేపీ రక్తమని కూడా ఆయన అన్నారు. రాజకీయంగా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ కూడా టీడీపీవారే. అలాగే రేవంత్ కూడా తొలుత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. రేవంత్‌కు కాంగ్రెస్‌ను చీల్చవలసిన అవసరం ఎందుకు వస్తుందో తెలియదు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేస్తే అప్పుడు అలా అవుతారని చెప్పడం కేటీఆర్ ఉద్దేశం కావచ్చు. కాని ఇదేదో ఊహాజనిత విమర్శగా కనిపిస్తుంది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు రేవంత్ కు, ఇటు కేసీఆర్ కు ఇద్దరికి ప్రతిష్టాత్మకమే. మధ్యలో బీజేపీ తన వంతు గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే అప్పుడు ఆ పార్టీలో అసమ్మతి పెరిగితే పెరగవచ్చు. ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం రేవంత్‌కు డోకా ఉండదనే చెప్పాలి. కేసీఆర్ కు కూడా పరీక్ష సమయమే. గౌరవప్రదమైన సంఖ్యలో లోక్ సభ సీట్లు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కు భవిష్యత్తుపై అనుమానాలు వస్తాయి. మరో నాలుగేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో మాదిరి సెంటిమెంట్‌తో రాజకీయాలు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. రేవంత్ డావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం జరిగింది. రేవంత్ గతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానిని విమర్శించేవారు. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ సైతం ఆదానిపై విరుచుకుపడుతుంటారు. డావోస్ లో మాత్రం అదానిని రేవంత్ కలవడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాంగ్రెస్ తన విధానం మార్చుకుందా? లేక అవకాశవాదంతో పోతోందా అనే సందేహం వస్తుంది. మూసి నదికి సంబంధించి శుద్ది చేయాలన్న ఆలోచనలు బాగానే ఉన్నాయి. లండన్‌లో దీనిపై చర్చలు జరిపే నెపంతో ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిలిపించుకోవడంలో రాజకీయం కూడా ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. రేవంత్ రెడ్డిని తన బ్లాక్ మెయిల్ ద్వారా ఒక మీడియా యజమాని ఇప్పటికే లొంగదీసుకున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అదే కొనసాగితే రేవంత్ కు కొత్త చిక్కులు రావచ్చు. ప్రస్తుతం రేవంత్‌కు ఆ మీడియా పెట్టే జాకీలపై ఆధారపడకుండా, తన స్వశక్తి ద్వారా ప్రజలలో ఆదరణ పొందగలిగితేనే నిలబడగలుగుతారు.లేకుంటే రాజకీయంగా చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. గతసారి ఇక్కడ నుంచే రేవంత్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి జరిగే ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైతే ఆయన నైతికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరో సంగతి ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు వ్యతిరేకంగా మాట్లాడినట్లు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఫర్వాలేదు కాని, బీఆర్ఎస్ మాత్రం ఉండకూడదన్నట్లు మాట్లాడినట్లు తోక పత్రిక యజమాని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మోదీ ఒక కాంగ్రెస్ నేతతో అలా అంటారా అన్నది డౌటే. కల్పిత కధలు రాయడంలో దిట్టగా పేరిందిన ఈయన మాటలు జనం ఎవరూ నమ్మరు. అలాగే టీడీపీకి మద్దతు ఇచ్చే మరో పత్రిక పట్ల కూడా రేవంత్ వ్యవహరించే శైలిని కూడా ప్రజలు గమనిస్తారు. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక ప్రముఖ కంపెనీ సీఈఓ మరణించారు. ఈ కేసును రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేవంత్ తమ చెప్పుచేతలలో ఉన్నాడని ఆ పత్రిక యాజమాన్యం భావిస్తోందని చెబుతారు. ఇలా తెలుగుదేశం మీడియా గుప్పిట్లోనే రేవంత్ కనుక కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. వారితో తగాదా తెచ్చుకోవాలని చెప్పడం లేదు కాని వారి ఆటలకు అనుగుణంగా రేవంత్ డాన్స్ చేస్తే మాత్రం అప్రతిష్టపాలవుతాడని చెప్పకతప్పదు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ తనపై ఆరోపణలు జనంలోకి వెళ్లకుండా చూడడానికి విశ్వయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతే బాగుండు అన్నట్లుగా వ్యవహరిస్తుందని భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్‌తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: కస్టం మిల్లింగ్ కహానీ.. -
పడకేసిన పాలన!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో పనులు పడకేశాయి. కోటి మందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన జీహెచ్ఎంసీలో సేవలందడం లేదు. చెత్త సమస్యల నుంచి రోడ్ల అవస్థల దాకా.. ప్రాపర్టీట్యాక్స్ ఫిర్యాదుల నుంచి దోమల నివారణ దాకా ప్రజా సమస్యల పట్టింపు లేకుండా పోయింది. మూడు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల పేరిట పనులు కుంటుపడగా.. ప్రస్తుతం ‘ప్రజా పాలన’ పేరిట పనులు జరగడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ సమస్యలు తీర్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ► నవంబర్ నెలాఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అంతకు ముందునుంచే ఎన్నికల నిబంధనల పేరిట పనులు కుంటుపడ్డాయి. పలువురు అధికారులు సైతం ఎన్నికల విధుల్లోనే ఉండటంతో తమ విభాగాలకు సంబంధించిన పనులు పట్టించుకోలేదు. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో తెలియదని పనుల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలిశాక చేయాలనే తలంపుతో పనులు చేయడం లేరు.దానికి తోడు నిధుల లేమితోనూ శ్రద్ధ చూపడం లేదు. ► ప్రాజెక్టులకు సంబంధించిన పనులను అలా వదిలివేయగా, ప్రజల నిత్య సమస్యలను సైతం పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిసేంత దాకా ఎన్నికల విధుల సాకుతో సమస్యలను వినిపించుకోలేదు. ప్రస్తుతం ‘ప్రజాపాలన’ పేరిట మిగతా విషయాలను పట్టించుకోవడం లేదు. వివిధ విభాగాల అధికారులను, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి విభాగాధిపతుల దాకా ప్రజాపాలనలో భాగస్వాములను చేశారు. కార్యక్రమం పకడ్బందీగా, త్వరితగతిన నిర్వహించాలనే తలంపుతో టీమ్‌లీడర్లు, స్పెషలాఫీసర్లు, తదితర పేర్లతో నియమించారు. దాంతో వారు తమ రెగ్యులర్ విధులు నిర్వహించడం లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమన్వయం కోసమని స్పెషలాఫీసర్లను నియమించినా సమన్వయం కనిపించడం లేదు. ఎందరున్నా.. ఎందరిని నియమించినా తగిన పర్యవేక్షణ, సమన్వయం లేకే ప్రజాపాలన దరఖాస్తుల్ని బజారు పాల్జేసి అభాసుపాలయ్యారు. అందుకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోలేకపోయారు. డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లనుంచి వివిధ విభాగాల అధికారులందరూ ‘ప్రజాపాలన’ విధుల్లోనే ఉన్నారంటున్నారు. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరని కొందరు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.ఆయా విభాగాల అధికారులతోపాటు కమిషనర్ సైతం ‘ప్రజాపాలన’ పనుల కోసం ఇతర జోన్లకు వెళ్లారనడంతో నిస్సహాయంగా వెనుదిరిగారు. ‘ప్రజావాణి’కి వెళ్లాల్సిందేనా.. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి హాజరు కావాల్సిందేనా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుడ్డిలో మెల్ల చందంగా కనీసం సర్కిల్, జోనల్‌స్థాయిల్లో ‘ప్రజావాణి’ని ఇటీవలే ప్రారంభించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులనైనా వెంటనే పరిష్కరిస్తారో లేదో?! -
ప్రజాపాలన దరఖాస్తులపై తీవ్ర దుమారం
-
నడిరోడ్డుపై ‘ప్రజాపాలన’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన అన్ని దరఖాస్తులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తగిన జాగ్రత్తలతో డేటా ఎంట్రీ జరుగుతోందని, దరఖాస్తులను అత్యంత జాగ్రత్తలతో భద్రపరచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిందని, మిగతావి కూడా త్వరలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు, టీమ్ లీడర్లు డేటా ఎంట్రీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, దరఖాస్తుల భద్రత కోసం వారికి కచ్చితమైన సూచనలిచ్చినట్లు పేర్కొన్నారు. సాక్షి, సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్: జీహెచ్ఎంసీలో కొందరు అధికారుల ఇష్టారాజ్యంతో ప్రభుత్వానికి తలవంపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో భాగంగా అర్హమైన పథకాల కోసం గంటల తరబడి క్యూలో నిల్చొని ప్రజలందజేసిన అభయ హస్తం దరఖాస్తులు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీనికి బాధ్యునిగా పేర్కొంటూ టీమ్‌లీడర్‌గా ఉన్న హయత్‌నగర్ సర్కిల్ ట్యాక్స్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.మహేందర్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లోనూ అభయహస్తం దరఖాస్తు ఫారాలను బయటకు తరలిస్తుండగా గుర్తించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ఎక్కడికక్కడే సంబంధిత సర్కిల్/జోన్ పరిధిలోని కార్యాలయాల్లో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం ఈ ఘటనతో వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం బాలానగర్ ఫ్లై ఓవర్‌పై ఓ బైక్‌పై నుంచి కొన్ని కాగితాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. వాటిని చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. అవి ప్రజాపాలనలోని దరఖాస్తులు కావడం.. అవి కూడా నగరానికి ఈ చివరన ఉన్న హయత్‌నగర్ సర్కిల్‌వి కావడంతో అవాక్కయ్యారు. ఈ దరఖాస్తులను ఆ చివరన ఉన్న కూకట్‌పల్లికి తరలిస్తున్నట్లు తెలిసింది. వాటిని కంప్యూటరీకరించేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి తరలిస్తున్నట్లు తెలిసింది. హయత్‌నగర్ సర్కిల్ ఉన్నది ఎల్బీనగర్ జోన్లో కాగా.. వాటిని కూకట్‌పల్లికి ఎందుకు తరలించాల్సి వచ్చిందన్నది అంతుపట్టడం లేదు. అన్ని దరఖాస్తుల కంప్యూటరీకరణ ఒకే ఏజెన్సీకి ఇచ్చారా ? అన్నది అధికారులు వెల్లడించలేదు. కూకట్పల్లి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లు గతంలో తమ బదిలీ ఉత్తర్వులను పరస్పరం మార్చుకోవడాన్ని ప్రజలు ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. తప్పెవరిది.. శిక్ష ఎవరికి ? సంబంధిత జోన్‌కు చెందిన ఉన్నతాధికారులు దరఖాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉండగా, వారి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమర్శలు వెలువడుతున్నాయి. సంబంధిత జోన్, సర్కిల్ కమిషనర్‌పై కాకుండా సూపరింటెండ్‌పై మాత్రమే చర్యలు తీసుకోవడం వెనుక కారణాలేమిటో అంతుపట్టడం లేదు. ఎంతోకాలంగా సదరు ఏజెన్సీతో కొనసాగుతున్న సంబంధం వల్లే దూరంగా ఉన్నప్పటికీ ఆ ఏజెన్సీకి దరఖాస్తుల కంప్యూటరీకరణ పనులు కాంట్రాక్టుకిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఇచ్చింది ఎవరు? అన్నది పట్టించుకోకుండా తూతూమంత్రంగా ఎవరో ఒకరిని బలి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మారని జీహెచ్ఎంసీ తీరు.. గతంలోనూ ఎన్నికల సందర్భంగా తప్పులు జరిగినప్పుడు కింది స్థాయిలోని వారిని బలిపశువుల్ని చేయడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. బాగా చేశారని పేరొస్తే మాత్రం ‘కిరీటాలు’ వాళ్లు పెట్టుకుంటూ, తప్పులు జరిగినప్పుడు మాత్రం చాకిరీ చేసిన ఉద్యోగులను బలి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వికేంద్రీకరణ ప్రభావం.. జీహెచ్ఎంసీలో జోన్లకు సర్వాధికారాలు కట్టబెట్టినప్పటి నుంచే జోనల్ స్థాయిలో అవకతవకలు పెరిగిపోయాయనే ఆరోపణలున్నాయి. అరుదుగా ఎప్పుడో మాత్రమే ఇలాంటి ఘటనలు బయట పడుతున్నాయని చెబుతున్నారు. ఎక్కడైనా వికేంద్రీకరణ సత్ఫలితాలిస్తుండగా జీహెచ్ఎంసీలో అది పూర్తిగా రివర్స్ అయింది. పేదల జీవితాలతో ముడిపడి ఉన్న దరఖాస్తులను అద్దె బైక్‌పై పంపించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దరఖాస్తుల కంప్యూటరీకరణ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా, ఎక్కడికిపడితే అక్కడికి, జీహెచ్ఎంసీ నుంచి కనీసం ఒక ఉద్యోగి కూడా వెంట లేకుండా పంపించడం, ఇళ్లకు కూడా పంపించడం, తదితరమైన వాటికి సమాధానాల్లేవు. కుత్బుల్లాపూర్ సర్కిల్లోనూ దరఖాస్తులు బయటకు తరలిస్తుండటం వెలుగు చూడటంతో అక్కడ కూడా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా వెల్లడి కాలేదు. మంత్రి పొన్నం ఆరా.. ► దరఖాస్తుల తరలింపు ఘటనపై జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ► కూకట్పల్లి జోనల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను ఇష్టానుసారంగా ప్రైవేటు సిబ్బంది చేతుల్లో పెట్టి ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయాల్సిందిగా సూచించడం విమర్శలకు తావిస్తోంది. ► మంగళవారం పలువురు దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని తీసుకువెళ్లడం కనిపించింది. ఈ దరఖాస్తులు ఎవరు ఇచ్చారు అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అని అడిగితే ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయమన్నారు అనే సమాధానం చెప్పడం విశేషం. ఏఎంసీ భార్గవ్ నారాయణ సూచన మేరకు వార్డు కార్యాలయంలో అప్లోడ్ చేసేందుకు వెళుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ నరసింహను ‘సాక్షి’వివరణ కోరగా వార్డు కార్యాలయంలో అప్లోడ్ చేసేందుకు తీసుకు వెళుతున్నారని, ఇంటికి తీసుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. -
ఆరు గ్యారెంటీలకు అప్లై చేశారా.. మీ దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి
కరీంనగర్‌అర్బన్/జ్యోతినగర్/(రామగుండం): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల ఆమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన చేపట్టింది. ఆదిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్సైట్ రూపొందించింది. ఉమ్మడి జిల్లాలో స్పందన.. ► ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ► కరీంనగర్ జిల్లాలో 3,54,363, పెద్దపల్లిలో 2,69,461, సిరిసిల్లలో 1,90,965, జగిత్యాలలో 3,24,532 లక్షల మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేశారు. ► స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 17లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ► ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎనిమిది రోజుల పాటు సాగిన ప్రజాపాలనలో మహాలక్ష్మి, రూ.500కే వంట గ్యాస్, కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకం కావడంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆన్లైన్లో నమోదు.. ► ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేపనిలో అధికారులు ఉన్నారు. ► ఈనెల 17 వరకు నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తులు ఆౖన్‌లైన్‌లో ఎంట్రీ అయిన తర్వాత వెబ్సైట్లో దరఖాస్తు స్థితిని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ► తొలుత ప్రజాపాలన వైబ్సైట్లోకి వెళ్లి శ్రీయువర్ అప్లికేషన్ స్టేటస్‌శ్రీ పై క్లిక్ చేస్తే దరఖాస్తు నంబర్ అడుగుతుంది. ► దానిని నమోదుచేస్తే దరఖాస్తు స్థితి, ఏఏ పథకాలకు అర్హులుగా ఉన్నారనే విషయాలను తెలుసుకోవచ్చు. ► ప్రజాపాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఓటీపీలు చెప్ప వద్దు.. ‘ఓటీపీలు చెప్ప వద్దు. డబ్బులు పోగొట్టుకోవద్దు’ అని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఈమేరకు వారు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకూడదని, సైబర్ నేరగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలిని సూచిస్తున్నారు. ► ఎవరు ఫోన్చేనా ఓటీపీ చెప్పవద్దు ► ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసినవారు మరింత అప్రమత్తంగా ఉండాలి ► గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది ► దరఖాస్తుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఓటీపీలు రావు ► చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు ► ఫేక్ మెసేజ్లని ఓపెన్ చేయకూడదు అందుబాటులోకి ప్రత్యేక వెబ్సైట్ దరఖాస్తు స్థితి తెలుసుకునే వెసులుబాటు అప్రమత్తంగా ఉండండి ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు. గ్యారంటీ స్కీంలకు దరఖాస్తు చేసుకున్నారా అని ఫోన్లు వచ్చి ఓటీపీలు చెప్పాలంటే ఎవరూ చెప్పకూడదు. అలాంటి పోన్లు వచ్చిన నంబర్లను పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలి. బ్యాంకు అధికారులని, క్రెడిట్ కార్డు వచ్చిందని, మీ ఖాతా అప్డేట్ చేస్తామని ఫోన్లకు సమాచారం వస్తే వాటిని తిరస్కరించాలి. – జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ -
ప్రజాపాలనపై నేడు సీఎం సమావేశం
-
ఆశలన్నీ.. ఆన్‌లైన్‌లోకి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’కు విశేష స్పందన లభించింది. అభయ హస్తం ఆరు గ్యారంటీల పథకం అమల్లో భాగంగా ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు అందాయి. స్వీకరణ క్రతువు రెండు రోజుల క్రితమే ముగిసింది. అర్జీలను ఆన్లైన్లో క్రోడికరించే అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ పూర్తిచేసింది. ఈ నెల 17 లోగా ఆర్జీల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఆశించిన స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు లేక పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. ఎనిమిది రోజులు.. ప్రభుత్వం 2023 డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలవు రోజులు మినహా ఎనిమిది రోజుల పాటు అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,53,277 దరఖాస్తులు అందాయి. 16 మున్సిపాలిటీల నుంచి 2,61,807 దరఖాస్తులు రాగా, 21 మండలాల పరి«ధిలోని 558 గ్రామ పంచాయతీల నుంచి 2,91,470 దరఖాస్తులు అందాయి. వీటిలో మెజార్టీ దరఖాస్తులు గృహలక్ష్మి, రేషన్‌కార్డులు, చేయూత పథకాలకు సంబంధించినవే కావడం గమనార్హం. రేషన్‌కార్డులు, ‘గృహజ్యోతి’కి డిమాండ్ ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా అభయహస్తం, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 నివాసాలు, మున్సిపాలిటీల పరిధిలో 2,88,361 నివాసాల నుంచి అర్జీలు పెట్టుకున్నారు. మెజార్టీ దరఖాస్తులు గృహజ్యోతి, రేషన్ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. మున్సిపాలిటీల నుంచి అందిన అర్జీల్లో 47,551 రేషన్‌కార్డులకు సంబంధించినవే కావడం విశేషం. ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో క్రోడికరించే ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో సాంకేతిక సిబ్బంది లేకపోవడం ఈ పనులకు ఇబ్బందిగా మారింది. -
ప్రజాపాలనపై నేడు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన సాగిన తీరు, వచ్చిన దరఖాస్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ భేటీ కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు దీనికి హాజరుకావాలని కోరినట్లు సమాచారం. కాగా ప్రజాపాలనలో ఎక్కువగా దరఖాస్తులు దేని కోసం వచ్చాయి? వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో వాటి కంప్యూటరీకరణ, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ తదితర అంశాలను చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. చేయూత పథకం కింద పింఛన్‌ను రూ.4,000కు పెంచడం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకతవకలకు సంబంధించి న్యాయ విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తదితరాలపై కూడా చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఇక నెలరోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నెలరోజుల పాలన, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మరింత ఘాటుగా స్పందించడానికి ఏమి చేయాలన్న అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. 1.11 కోట్ల కుటుంబాల నుంచి దరఖాస్తులు గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు 8 పనిదినాల్లో కొనసాగిన ప్రజాపాలనలో మొత్తం 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి ద్వారా 1,25,84,383 దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 12,769 గ్రామ పంచాయతీలతో పాటు, 3,623 మునిసిపల్ వార్డులు/డివిజన్లలో ఈ ప్రజాపాలన నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తంలోని ఆరు గ్యారంటీల కింద మొత్తం 1,05,91,636 దరఖాస్తులు రాగా.. ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 అందాయి. -
ప్రజాపాలనకు 1.25 కోట్ల దరఖాస్తులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా భారీస్థా యిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన శనివారం(జనవరి 6)తో ముగిసింది. ఈ ఎనిమిది రోజుల్లో 1,24,85,383 పైగానే దర ఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమా నికి అధి కార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ కంప్యూటరీకరణ కోసం డీటీపీ ఆపరేటర్లను సైతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటోంది. డిప్యూటీ సీఎం భట్టి శ్రీకారం గతనెల 28వ తేదీన నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ఈ క్రార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా, సీఎం రేవంత్‌రెడ్డి ఎడతెగని పనులతో తీరి క లేకుండా ఉన్న నేపథ్యంలో ఎక్కడా పాల్గొనలేకపోయా రని ప్రభుత్వవర్గాల సమాచారం. ప్రజాపాలన కొనసాగు తుండగానే.. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం కూడా మంగళ, శుక్రవారాల్లో కొనసాగిస్తు న్నారు. ప్రజాపాలనలో పెద్దఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ... ప్రజావాణిలో సైతం శుక్రవారం వరకు దాదాపు 30 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. పోటెత్తిన సమస్యలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతు న్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానం అని సర్కారు తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ప్రారంభంలో ఇదివ రకే పెన్షన్ తీసుకుంటున్న వారు, రైతుబంధు లబ్ధిదారులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరణ ఇస్తూ.. పెన్షన్‌దారులు, రైతుబంధు పొందుతున్న వారు కొత్తగా రైతుభరోసా, చేయూత కింద దరఖాస్తు చేసు కోవాల్సిన అవసరం లేదని, కొత్తగా కావాల్సిన వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేయడంతో.. క్ర మంగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణిలో 30,148 అర్జీలు స్వీకరణ హైదరాబాద్(లక్డీకాపూల్): మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. గత నెల 8వ తేదీ నుంచి శుక్రవారం వరకు ప్రజావాణికి 30,148 అర్జీలు వచ్చాయి. తొలుత రోజూ నిర్వహించినా.. ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సీఎస్ సమీక్ష ప్రతిరోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమీ క్షించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
నేటితో ముగియనున్న ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ
-
TS: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర
జోగిపేట,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జోగిపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదీచదవండి..కీచక తండ్రి..తప్పించుకుని వెళితే మరో దారుణం -
17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తుల మొత్తం డేటా ఎంట్రీ ఈనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహ ణ, దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్లతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సీఎస్ అభినందించారు. ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు టీవోటీలకు శిక్షణ డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనీ ఆఫ్ ట్రైనర్ (టీవోటీ)లకు 4వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీవోటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయా లన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని చెప్పారు. డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. 2వ తేదీ నాటికి 57 లక్షల దరఖాస్తులు మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని సీఎస్ తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని కూడా సీఎస్ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
ప్రజాపాలన తర్వాత నామినేటెడ్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తీవ్ర పోటీ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది.