సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదన్నారు.
కాగా, నేడు తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు. అలాగే, నా స్వార్థం కూడా ఏమీ లేదు. పర్యావరణ పునరుజ్జీవనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. లేక్ సిటీ.. ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.
కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదు. భూమాఫియా గాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తాం. హైదరాబాద్ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్.. పరేషాన్..
Comments
Please login to add a commentAdd a comment