ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు.. | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..

Published Mon, Jan 15 2024 12:08 AM | Last Updated on Mon, Jan 15 2024 1:30 PM

- - Sakshi

ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్‌లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్‌తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు.

మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు.

ఇవి చదవండి: కస్టం మిల్లింగ్‌ కహానీ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement