కరీంనగర్‌అర్బన్/జ్యోతినగర్/(రామగుండం): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల ఆమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన చేపట్టింది. ఆదిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్ రూపొందించింది.
ఉమ్మడి జిల్లాలో స్పందన..
► ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
► కరీంనగర్ జిల్లాలో 3,54,363, పెద్దపల్లిలో 2,69,461, సిరిసిల్లలో 1,90,965, జగిత్యాలలో 3,24,532 లక్షల మంది వివిధ పథకాల కోసం దరఖాస్తు చేశారు.
► స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 17లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
► ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎనిమిది రోజుల పాటు సాగిన ప్రజాపాలనలో మహాలక్ష్మి, రూ.500కే వంట గ్యాస్, కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకం కావడంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆన్‌లైన్‌లో నమోదు..
► ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేపనిలో అధికారులు ఉన్నారు.
► ఈనెల 17 వరకు నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు.
► దరఖాస్తులు ఆౖన్‌లైన్‌లో ఎంట్రీ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు స్థితిని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది.
► తొలుత ప్రజాపాలన వైబ్‌సైట్‌లోకి వెళ్లి శ్రీయువర్ అప్లికేషన్ స్టేటస్‌శ్రీ పై క్లిక్ చేస్తే దరఖాస్తు నంబర్ అడుగుతుంది.
► దానిని నమోదుచేస్తే దరఖాస్తు స్థితి, ఏఏ పథకాలకు అర్హులుగా ఉన్నారనే విషయాలను తెలుసుకోవచ్చు.
► ప్రజాపాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.
ఓటీపీలు చెప్ప వద్దు..
‘ఓటీపీలు చెప్ప వద్దు. డబ్బులు పోగొట్టుకోవద్దు’ అని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఈమేరకు వారు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్తగా ఉండకూడదని, సైబర్ నేరగాళ్లతో చాలా అప్రమత్తంగా ఉండాలిని సూచిస్తున్నారు.
► ఎవరు ఫోన్‌చేనా ఓటీపీ చెప్పవద్దు
► ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసినవారు మరింత అప్రమత్తంగా ఉండాలి
► గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది
► దరఖాస్తుదారులకు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఓటీపీలు రావు
► చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు
► ఫేక్ మెసేజ్‌లని ఓపెన్ చేయకూడదు
అందుబాటులోకి ప్రత్యేక వెబ్‌సైట్ దరఖాస్తు స్థితి తెలుసుకునే వెసులుబాటు
అప్రమత్తంగా ఉండండి
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు. గ్యారంటీ స్కీంలకు దరఖాస్తు చేసుకున్నారా అని ఫోన్లు వచ్చి ఓటీపీలు చెప్పాలంటే ఎవరూ చెప్పకూడదు. అలాంటి పోన్లు వచ్చిన నంబర్లను పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలి. బ్యాంకు అధికారులని, క్రెడిట్ కార్డు వచ్చిందని, మీ ఖాతా అప్‌డేట్ చేస్తామని ఫోన్‌లకు సమాచారం వస్తే వాటిని తిరస్కరించాలి.
– జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ
Comments
Please login to add a commentAdd a comment