సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా భారీస్థా యిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన శనివారం(జనవరి 6)తో ముగిసింది. ఈ ఎనిమిది రోజుల్లో 1,24,85,383 పైగానే దర ఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమా నికి అధి కార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ కంప్యూటరీకరణ కోసం డీటీపీ ఆపరేటర్లను సైతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటోంది.
డిప్యూటీ సీఎం భట్టి శ్రీకారం
గతనెల 28వ తేదీన నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ఈ క్రార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా, సీఎం రేవంత్‌రెడ్డి ఎడతెగని పనులతో తీరి క లేకుండా ఉన్న నేపథ్యంలో ఎక్కడా పాల్గొనలేకపోయా రని ప్రభుత్వవర్గాల సమాచారం. ప్రజాపాలన కొనసాగు తుండగానే.. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం కూడా మంగళ, శుక్రవారాల్లో కొనసాగిస్తు న్నారు. ప్రజాపాలనలో పెద్దఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ... ప్రజావాణిలో సైతం శుక్రవారం వరకు దాదాపు 30 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం.
పోటెత్తిన సమస్యలు
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతు న్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానం అని సర్కారు తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు.
ప్రారంభంలో ఇదివ రకే పెన్షన్ తీసుకుంటున్న వారు, రైతుబంధు లబ్ధిదారులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరణ ఇస్తూ.. పెన్షన్‌దారులు, రైతుబంధు పొందుతున్న వారు కొత్తగా రైతుభరోసా, చేయూత కింద దరఖాస్తు చేసు కోవాల్సిన అవసరం లేదని, కొత్తగా కావాల్సిన వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేయడంతో.. క్ర మంగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రజావాణిలో 30,148 అర్జీలు స్వీకరణ
హైదరాబాద్(లక్డీకాపూల్): మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. గత నెల 8వ తేదీ నుంచి శుక్రవారం వరకు ప్రజావాణికి 30,148 అర్జీలు వచ్చాయి. తొలుత రోజూ నిర్వహించినా.. ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజూ సీఎస్ సమీక్ష
ప్రతిరోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమీ క్షించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment