computerization
-
ఆశించిన స్థాయిలో రుణాలిచ్చాం
సాక్షి, అమరావతి: 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేశామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ మణిమేఖలై స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో 228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. పలువురు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో మణిమేఖలై మాట్లాడుతూ.. 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రాధాన్యతా రంగాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా, తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రూ.1.36లక్షల కోట్లు (36శాతం) రుణాలు అందించామన్నారు. అలాగే వ్యవసాయరంగానికి రూ.2.64లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.89,438 కోట్లు (34శాతం) ఇచ్చామని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగానికి 87వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.44వేల కోట్లు (51 శాతం) అందించామన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.1.65లక్షల కోట్లు అందించాల్సి ఉండగా, 87,731 కోట్లు (53 శాతం) అందించినట్లు వివరించారు. నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావత్ మాట్లాడుతూ..ఏపీలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆర్బీఐ ఏపీ రీజీయన్ రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్ మాట్లాడుతూ డిజిటల్ టాన్స్ఫర్మేషన్లో క్యూఆర్ కోడ్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ఆర్బీఐ ప్రారంభించిందని తెలిపారు. వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో 50లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు.తొలుత ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంక్ ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కేంద్ర ఫైనాన్షియల్ సర్విసెస్ శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వినర్ సీవీఎన్ భాస్కరరావు, సిడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనకు 1.25 కోట్ల దరఖాస్తులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా భారీస్థా యిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ప్రజాపాలన శనివారం(జనవరి 6)తో ముగిసింది. ఈ ఎనిమిది రోజుల్లో 1,24,85,383 పైగానే దర ఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులు రాగా 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలపై వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల అమలులో భాగంగా ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమా నికి అధి కార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ కంప్యూటరీకరణ కోసం డీటీపీ ఆపరేటర్లను సైతం తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటోంది. డిప్యూటీ సీఎం భట్టి శ్రీకారం గతనెల 28వ తేదీన నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ఈ క్రార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా, సీఎం రేవంత్‌రెడ్డి ఎడతెగని పనులతో తీరి క లేకుండా ఉన్న నేపథ్యంలో ఎక్కడా పాల్గొనలేకపోయా రని ప్రభుత్వవర్గాల సమాచారం. ప్రజాపాలన కొనసాగు తుండగానే.. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం కూడా మంగళ, శుక్రవారాల్లో కొనసాగిస్తు న్నారు. ప్రజాపాలనలో పెద్దఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికీ... ప్రజావాణిలో సైతం శుక్రవారం వరకు దాదాపు 30 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. పోటెత్తిన సమస్యలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, చేయూత పథకాల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతు న్నాయి. ఇక పథకాలన్నింటికీ రేషన్ కార్డు ప్రధానం అని సర్కారు తేల్చి చెప్పిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో వాటి కోసం దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. ప్రారంభంలో ఇదివ రకే పెన్షన్ తీసుకుంటున్న వారు, రైతుబంధు లబ్ధిదారులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరణ ఇస్తూ.. పెన్షన్‌దారులు, రైతుబంధు పొందుతున్న వారు కొత్తగా రైతుభరోసా, చేయూత కింద దరఖాస్తు చేసు కోవాల్సిన అవసరం లేదని, కొత్తగా కావాల్సిన వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేయడంతో.. క్ర మంగా వాటి సంఖ్య తగ్గినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణిలో 30,148 అర్జీలు స్వీకరణ హైదరాబాద్(లక్డీకాపూల్): మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. గత నెల 8వ తేదీ నుంచి శుక్రవారం వరకు ప్రజావాణికి 30,148 అర్జీలు వచ్చాయి. తొలుత రోజూ నిర్వహించినా.. ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులకు కుదించి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సీఎస్ సమీక్ష ప్రతిరోజూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమీ క్షించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
చరణ్‌సింగ్ ఓకే అంటే ఆనాడే...ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ
న్యూఢిల్లీ: భారత్ ఓ బంగారం వంటి అవకాశాన్ని జారవిడుచుకుందని, 1970ల చివర్లో పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పన్ను వ్యవస్థ రూపకల్పన ప్రతిపాదనను టీసీఎస్ తీసుకురాగా, నాటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్ తిరస్కరించినట్టు మేనేజ్మెంట్ స్ట్రాటజిస్ట్ శశాంక్ షా తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘ది టాటా గ్రూపు: ఫ్రమ్ టార్చ్ బేరర్స్ టు ట్రయల్‌బ్లేజర్స్’ పేరుతో షా రాసిన పుస్తకంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ‘‘1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ అనంతరం బ్యాంకుల్లో వ్యాపారం తగ్గగా, భారత్‌లో కంప్యూటర్లు వద్దని నాటి ప్రభుత్వం భావించింది. కంప్యూటరైజేషన్‌తో పెద్ద ఎత్తున ఉపాధి దెబ్బతింటుందని భావించడం జరిగింది’’ అని షా తెలిపారు. ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్న పాన్ వ్యవస్థను టీసీఎస్ 1977లో ఆదాయపన్ను శాఖ కోసం అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఇది మంచి ఫలితం రావడంతో ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ అవకాశం కూడా టీసీఎస్‌కు లభించింది. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్ ఆర్థిక శాఖలో కంప్యూటరీకరణ అవసరం లేదని, ఇది ఉపాధిలేమికి దారితీస్తుందంటూ తిరస్కరించారు. ఒకవేళ నాడు అమలు చేసి ఉంటే, పూర్తి కంప్యూటర్ ఆధారిత పన్ను వ్యవస్థతో ఎన్నో దేశాల కంటే భారత్ ముందుండేది’’ అని షా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపుసం
సంజామల: సంజామల సహకార సంఘానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించినట్లు సొసైటీ చైర్మన్ పెండేకంటి కిరణ్‌కుమార్ చెప్పారు. స్థానిక సొసైటీలో సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు, సిబ్బంది సహకారంతో సొసైటీ అభివృద్ది బాటలో నడుస్తోందన్నారు. సొసైటీకి ఆప్కాబ్ కంప్యూటరీకరణ సౌకర్యం పైలట్ ప్రాజెక్టుకింద ఎంపికయినట్లు తెలిపారు. వర్గవైసమ్యాలు, రాజకీయాలకతీతంగా సంఘంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సంజామల గతంలో జిల్లాస్థాయిలో గుర్తింపు ఉండేదని ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం పట్ల సిబ్బందికి పాలకవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చల్లా తిరుపాలయ్య, ఓబులమ్మ, బండి జనార్దన్‌రెడ్డి, సొసైటీ సీఈఓ రవీంద్రనా«ద్గుప్త తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటరీకరణకు కాసులేవీ..?
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కంప్యూటరీకరణపై అధికారుల్లో అస్పష్టత నెలకొంది. 15 రోజుల్లో వివరాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించి న ప్రభుత్వం.. అందుకు చెల్లించే సొమ్ముపై మా త్రం స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి కారణమవుతోంది. పైకం చెల్లింపుపై స్పష్టత ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఈ నెల 19 సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఒకే రోజు సర్వేలో జిల్లాలో 8,40,971 కుటుంబాల వివరాలు సేకరించారు. 866 గ్రామపంచాయతీల్లో 6,83,556 కుటుంబాలు, ఏడు మున్సిపాలిటీల ప రిధిలోని 213 వార్డుల్లో గల 1,57,415 కుటుంబాల వివరాలు సర్వే ఫారాల్లో నమోదయ్యాయి. సర్వే శాతం 106.50గా నమోదైంది. నేడు లేదా రేపు ఈ సర్వే కంప్యూటరీకరణ పూర్తిస్థాయిలో ప్రారంభమ య్యే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,030 కంప్యూటర్లు ఈ వివరాలను నిక్షిప్తం చేసేందుకు ఉ పయోగిస్తున్నారు. ఇందుకు కార్యాలయాలు, భవనాలూ ఎంపికచేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రొక్కం ఏదీ..? సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, జిల్లా స్థాయి పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ జగన్మోహన్ ఇప్పటికే స్పష్టం చేశా రు. ఒక్కో ఆపరేటర్ రోజూ 80-100 వరకు సర్వే ఫారాలు వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో కుటుంబం ఆధారంగా చెల్లిస్తారా లేదా రోజు వారి గౌరవ వేతనం ప్రకారం ఇస్తారా అనే విషయంపై మార్గదర్శకలేమీ రాలేదు. దీనిపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏం చెప్పాలో తెలియక.. ప్రభుత్వం నుంచి స్పష్టత లేక అధికారుల్లో గందరగోళం నెలకొంది. ‘ప్రస్తుతానికి కంప్యూటరీకరణ ప్రారంభించండి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆ మేరకు మీకు చెల్లిస్తాం’ అని అధికారులు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు భరోసా ఇస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో స్పష్టత వస్తే బాగుంటుందని అధికారులు, ఆపరేటర్లు భావిస్తున్నారు. -
ఈ-జిల్లాగా హైదరాబాద్!
=విలువైన రికార్డుల కంప్యూటరైజేషన్‌కు కలెక్టర్ ఆదేశం =జిల్లాలోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు =అన్ని కార్యాలయాలకు డెస్క్‌టాప్‌లు, స్కానర్లు సాక్షి, సిటీబ్యూరో/కలెక్టరేట్, న్యూస్‌లైన్: హైటెక్ జిల్లాగా పేరుగాంచిన హైదరాబాద్ ఇకపై ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్‌గా మార నుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు, అన్ని కార్యాయలయాలకు డెస్క్‌టాప్‌లను అందజే యనున్నట్లు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు కంపూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు కూడా ఇస్తామన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి విలువైన పాత రికార్డులన్నింటినీ గుర్తించి, వాటిని జాగ్రత్తగా స్కాన్ చేసి భద్రపరచాలని సూచించారు. సొంత భవనాల్లేని ప్రభుత్వ విభాగాలకు అవసరమైతే స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. విభాగాల వారీగా అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ స్థలాలు.. తదితర వివరాలను వెంటనే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నట్లు ఐసీడీఎస్ పీడీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయమై సహకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పటిష్టంగా భూముల పరిరక్షణ అనంతరం రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాలను క్షణ్ణంగా పరిశీలించి రెగ్యులరైజ్ చే యాలని సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలను ల్యాండ్ బ్యాంకులో పొందుపరచాలని ఆదేశించారు. ఆపద్భందు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు స త్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మిగు లు భూములను గుర్తించి హద్దులను నిర్ణయిం చాలన్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన స్థలాలను, ఆయా సంస్థలు వినియోగించుకోని పక్షంలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నవ్య, కిషన్లతో పాటు తహశీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్ తదితరులున్నారు.