ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2016 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఉత్తీర్ణత 82.32 శాతం
మహారాణిపేట/బాలాజీచెరువు (కాకినాడ)/ కాతేరు (రాజమహేంద్రవరం రూరల్)/తణుకు టౌన్: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2016 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఏయూ సెనేట్ హాల్లో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, మీసాల గీత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ బి.ఉదయలక్ష్మిలతో కలసి ఫలితాల సీడీలను విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 82.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తొలి 25 ర్యాంకులు ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ప.గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలి వెన్నుకి చెందిన మట్టా వెంకట శేషుతేజ్ ప్రథమస్థానం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ససనపూరి శ్రీరామ్‌గుప్తా రెండో ర్యాంక్, తూ. గోదావరి జిల్లాకు చెందిన మేరుగు వెంకట రోహిత్ మూడో ర్యాంకు సాధించారు.