ముద్రగడపై ఘంటా వ్యాఖ్యలు సరికాదు | minister ganta words was not fair on mudragada | Sakshi
Sakshi News home page

ముద్రగడపై ఘంటా వ్యాఖ్యలు సరికాదు

Published Sun, Aug 7 2016 10:48 PM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM

మాట్లాడుతున్న ఏపీ కాపు జేఏసీ నేతలు - Sakshi

మాట్లాడుతున్న ఏపీ కాపు జేఏసీ నేతలు

చిక్కడపల్లి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాస్‌రావు వాఖ్యలు వెంటనే విరమించుకుకోవాని ఏపీ కాపు జేఏసీ  నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం అశోక్‌నగర్‌లోని ఎస్‌ఎంఎస్‌లో ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తోటరాజు, చందు జనార్థన్, పెద్దకాపు, నీలం రాంబాబునాయుడులు మాట్లాడారు. ఘంటా శ్రీనివాస్‌ సీఎం చంద్రబాబునాయుడు తొత్తుగా మారి ఆయన మెప్పు పొందేందుకు ముద్రగడపై విమర్శనలు చేస్తున్నారని ఆరోపించారు.

కాపులకు బీసీ హోదా కల్పించాలని దీక్ష చేస్తుంటే మద్దతివ్వాల్సిందిపోయి జాతిలో పుట్టి జాతికి అన్యాయం చేసే విధంగా ఘంటా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలోకి రావాలని  వారు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందు పువ్వులు, పూల దండలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement