సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ప్రవేశ పరీక్షా-2016 ఫలితాలను ఈనెల 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలుత 9న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని తెలపగా, నీట్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పును చెప్పనుండడంతో ఫలితాలను సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు.
10న ఉదయం విడుదల కానున్న టెన్త్ ఫలితాలు : పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 10న ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. విశాఖ ఆంధ్రా వర్సిటీ సెనెట్ హాల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
రేపు సాయంత్రం ఏపీ ఎంసెట్ ఫలితాలు
Published Sun, May 8 2016 1:34 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM
Advertisement
Advertisement