ప్రశ్నాపత్రం లీకుపై మంత్రి సీరియస్
Published Sat, Mar 25 2017 1:59 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
- విచారణకు ఆదేశం
విజయవాడ: నెల్లూరు జిల్లాలో పదోతరగతి సైన్స్-1 పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్త హల్‌చల్ చేస్తోంది. సామన్య శాస్త్రం-1 ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.
Advertisement
Advertisement